Futuristic Rayalaseema
About Leader
Job Portal
How to apply
rayalaseema
  • రాయలసీమ చిత్తూరు ,అనంతపురం ,కడప మరియు కర్నూల్ అనే నాలుగు ముఖ్య జిల్లా లతో కూడి ఉన్నది
  • రాయలసీమ జనాభా 15,184,908 మరియు 67,5626km చదరపు విస్తీర్ణం కలిగి ఉన్నది
  • రాయలసీమను ఒకప్పుడు ప్రముఖ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు పాలించెను
  • రాయలసీమ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయాలు చాల ఉన్నవి,అందులో ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం.
  • రాగి సంకటి చాలా ప్రముఖమైనధీ దీని గురించి రాయలసీమ లో తెలియని వాళ్ళు ఉండరు
  • శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి మఠం కడప జిల్లా లో కలదు ,ఈయన కర్నూల్ జిల్లాలో కాలజ్ఞానం రాసారు.

రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా వెలుగొందిన ప్రాంతం. రాయలసీమ అంటే వాడుక భాషలో రాజులు ఏలిన ప్రాంతమని అర్థం. అయితే ఈ ప్రాంతాన్ని మొదటి నుంచి రాయలసీమ అని పిలవడం జరుగలేదు. అసలు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారి కాలంలో దీన్ని అప్పగించబడ్డ (ceded ) జిల్లాలు అని బ్రిటిష్ వారు పిలిచేవారు. ప్రస్తుతం కర్ణాటక లో గల బళ్ళారి జిల్లాతో పాటు , అనంతపూర్, కడప, కర్నూల్, చిత్తూర్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని అప్పటి నిజాం రాజు ఒక ఒప్పదంలో భాగంగా బ్రిటిష్ వారికి అప్పగించాడు. అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని అప్పగించిన జిల్లాలుగా బ్రిటిష్ వాళ్ళు పిలవడం ప్రారంభించారు. అయితే 1928 వ సంవత్సరంలో, అప్పటి ఆంధ్ర మహాసభ నాయకులు ఈ ప్రాంతాన్ని అప్పగించిన జిల్లాలుగా పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు . మహాసభలో రాయలసీమ ప్రాంతంగా పిలవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అప్పటినుంచి , ఈ ఐదు జిల్లాలతో కూడిన ప్రాంతాన్ని రాయలసీమ గా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో బళ్ళారి జిల్లా కర్ణాటక రాష్ట్రంలో చేరింది. ప్రస్తుతం నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ ప్రాంతంలో మొత్తం జనాభా సుమారు 1.51 కోట్లుగా ఉంది.

రాయలసీమ ప్రాంత విస్తీర్ణం 67,168 sq.km. ఈ ప్రాంతంలో ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే). ఇది రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న ఆలయంగా పేరుగాంచింది. జిల్లాల వారీగా చూస్తే , కడప జిల్లాను రాయలసీమ ప్రాంతానికి కేంద్ర స్థానంగా చెప్పవచ్చు.ఎందుకంటే ఇది రాయలసీమ లోని మిగతా అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉంది. ఈ జిల్లాలో ఎన్నో పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. కర్నూల్ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లా ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా వెలుగొందింది. అక్టోబర్ 1,1953 న కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము అవతరించింది. కర్నూల్ జిల్లా విస్తీర్ణంలో దేశంలోనే పదవ అతిపెద్ద విస్తీర్ణం గల జిల్లాగా పేరుగాంచింది. అంతేగాకుండా , జనాభా విషయానికి వస్తే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 53 వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే ఇది 1888 వ సంవత్సరంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి విడిపోయి ఏర్పడింది. ఆ తర్వాత, 1956 వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ అవతరణతో పాటు ప్రస్తుతమున్న అనంతపూర్ జిల్లా గా మారింది. ఇక చివరిదైన చిత్తూరు జిల్లా కూడా 1911 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని మండలాలను కలుపుకొని ఏర్పడింది.

రాయలసీమ ప్రాంతం నుంచి ఇప్పటివరకు అత్యధికంగా ఆరుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరు నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య , కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి , ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి. వీరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా పనిచేస్తున్నారు. ఈయన, విభజనకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

Close