Futuristic Rayalaseema
About Leader
Job Portal
kj reddy

అనంతపూర్ జిల్లాలో బస్సుల తయారీ ఫ్యాక్టరీ ని పెట్టనున్న ప్రఖ్యాత సంస్థ వీరా

రూ.600 కోట్ల పెట్టుబడితో ఏటా 8 వేల బస్సుల తయారీ కి సన్నాహాలు  

రెండు దశల్లో 7 వేల మందికి లభించనున్న ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 

రాయలసీమ ప్రాంతంలో కరవు జిల్లాగా పేరుగాంచిన అనంతపూర్ జిల్లాకు త్వరలో ఒక  భారీ పరిశ్రమ రానుంది. బస్సుల తయారీలో  పేరుగాంచిన  వీరా వాహన సంస్థ గూడుపల్లి వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో తన ఫ్యాక్టరీ ని పెట్టనుంది. ఈ బస్సుల తయారీ యూనిట్‌ను రెండు దశల్లో నెలకొల్పడానికి సంస్థ ముందుకు వచ్చింది. గత నవంబర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.

       గూడుపల్లి వద్ద తమ ప్లాంటును  ఏర్పాటు చేయడానికి వీర వాహన సంస్థ పలు ప్రోత్సహకాలు, రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి  కోరింది. ఎకరా స్థలాన్ని తమకు రూ.5లక్షలకు ఇవ్వాలని కోరింది. ఈ సంస్థ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఎకరా ధర రూ.6లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా  ప్రవేశ పన్ను మినహాయింపు, స్టాంపు రుసుం వంద శాతం రాయితీ, వ్యాట్‌ పన్నును ఏడు సంవత్సరాల పాటు వంద శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడానికి అనుమతిచ్చింది. ఏడు సంవత్సరాల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా ఏడు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మొదటి దశలో ఏటా 8 వేల బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉన్న యూనిట్‌ను నెలకొల్పతారు. దాని ద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.

            రెండో దశలో 12 నుంచి 18 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న చిన్న బస్సులను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మరో రెండు వేల మందికి ఉపాధి కలగనుంది.  వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థ బెంగళూరులో ప్రస్తుతం పెద్ద తయారీ యూనిట్‌ను నెలకొల్పింది.దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన దాదాపు రెండు వేలకుపైగా బస్సులు పరుగులు తీస్తున్నాయి.


kj reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ.11వేల కోట్ల వడ్డీలేని రుణాలు మార్చిలోగా పంపిణీ చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

 రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడానికి  ఈ ఏడాది అందజేయాల్సిన రూ.11వేల కోట్ల వడ్డీలేని రుణాల్ని తక్షణమే పంపిణీచేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను  ఆదేశించారు. 

 ఈ మొత్తం ప్రక్రియను మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. తన నివాసంలో మహిళ స్వయం సహాయక సంఘాల పనితీరుని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ సంఘాల స్ఫూర్తిని నీరుగార్చారనీ, మహిళ సాధికారత ధ్యేయంగా మళ్లీ శూన్యం నుంచి ప్రారంభించి జవసత్వాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇకపై ఈ సంఘాలకిచ్చే రుణాలు వారికి మరింత ఆదాయాన్ని సమకూర్చేలా ఉండాలని చెప్పారు. రుణాలు సద్వినియోగం అయ్యేలా చూసే బాధ్యతను కూడా తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ కనీసం రూ.10వేలు ఆదాయం సమకూర్చేలా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన స్త్రీ నిధి పథకాన్ని రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి బ్యాంక్ గా  మార్చాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా రూ.1,100 కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకొంటే ఇప్పటికి రూ.682 కోట్లు అందించినట్లు సెర్ప్ సీఈవో పి.కృష్ణమోహన్ తెలిపారు. ‘పసుపు కుంకుమ’ పథకంలో భాగంగా రూ.4,971 కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.


kj reddy

తొలి బడ్జెట్‌ సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ముస్తాబు

భారీ భద్రత మధ్య జరుగనున్న సమావేశాలు 

వెలగపూడికి వెళ్లే అన్ని మార్గాల్లో 15 చెక్‌పోస్టులు ఏర్పాటు 

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ తొలి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర రాజధాని అమరావతి ముస్తాబైంది.  వెలగపూడిలో కొత్తగా నిర్మించిన భవనం నుంచి తొలిసారిగా వచ్చే నెల మార్చి 6 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి జరిగినన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సహా ఉన్నతాధికారులంతా సమావేశాలు ఏ మార్గం నుంచి బయలుదేరినా సకాలంలో వారు సచివాలయం, అసెంబ్లీ భవనాలకు చేరుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అసెంబ్లీ కొలువుదీరిన వెలగపూడి ప్రాంతానికి చేరుకునే అన్ని మార్గాల్లో 15 అంతర్గత తనిఖీకేంద్రాలు (చెక్ పోస్టులు)  ఏర్పాటు చేయనున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు 18 రోజులపాటు జరగనున్నాయి. సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా  ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు  అసెంబ్లీ వెలుపల ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉండడంతో . ఆయా సంస్థలు, రాజకీయ పార్టీలకు చెందిన ఆందోళనకారులు నిరసన తెలపటానికి ఒక ధర్నాచౌక్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలనీ అధికారులు నిర్ణయించారు. ఆందోళనలు, ధర్నాలకు పెద్దఎత్తున ప్రజలను సమీకరిస్తారు. వారంతా ధర్నాచౌక్‌కు హాజరుకావటానికి వీలుగా రవాణా వసతి ఉండాలి.                                                                                                                  ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు విజయవాడకు చేరుకోవటానికి బస్సు, రైల్వేవంటి సౌకర్యాలు బాగా ఉన్నాయని, విజయవాడ కేంద్రంగానే ఆందోళనలు చేసుకోవటానికి తాత్కాలిక ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ కొలువుదీరిన వెలగపూడికి విజయవాడ గుంటూరువైపు నుంచి సులభంగా చేరుకునేలా రోడ్డుమార్గాల్లో ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మార్గాల నుంచి ఆందోళనకారులు అసెంబ్లీ ప్రాంగణలోకి చొచ్చుకురాకుండా ప్రధానరహదారుల్లో ఎక్కడికక్కడ పోలీసు బారికేడ్లు, ఇనుపకంచె అమర్చనున్నారు.  గుంటూరు జోన్‌ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి 30 మంది డీఎస్పీలు, 70మంది ఇన్‌స్పెక్టర్లు, వందమంది ఎస్సైలు, వందల సంఖ్యలో కానిస్టేబుళ్లు బందోబస్తు విధులకు  రానున్నారు.  ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో భారీ రిహార్సల్స్‌కు పోలీస్ డిపార్టుమెంట్ సన్నాహాలు చేస్తోంది. 


kj reddy

నైపుణ్య శిక్షణ పొందిన 50% మందికి ఉపాధి కల్పించాలని సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశం

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో 50శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, పీఎంకేఎస్‌వై పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంతో పాటు విద్య, ఉపాధి కల్పనకు సంబందించిన అంశాలపై  ఇక నుంచి 45 రోజులకోసారి సమీక్షిస్తామని అయన అధికారులకు తెలిపారు

ప్రతి శాఖను ఈ-ప్రగతితో అనుసంధానిస్తామని ఇలా చేయడం  వల్ల అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని అయన ఈ సందర్బంగా  చెప్పారు. నిరుద్యోగ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో విద్య రంగం పరిస్థితి పై అయన ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు.  విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్లే ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

                         అక్షరాస్యత, నాక్‌ రేటింగ్‌ల్లో రాష్ట్రం వెనకబడి ఉండటాన్ని ప్రస్తావించారు. విద్యావ్యవస్థను సంస్కరించి ఉత్తమ ఫలితాలు సాధించడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్‌, కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమల స్థాపన కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. 


kj reddy

ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: రిటర్నింగ్ ఆఫీసర్ కోన శశిధర్

త్వరలో జరుగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభధ్రులు, ఉపాధ్యాయుల స్థానాల ఎమ్మెల్సీ  ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ ఆఫీసర్, అనంతపూర్ జిల్లా కలెక్టర్   కోన శశిధర్‌ తెలిపారు. 

ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారి హైదరాబాద్ నుంచి  భన్వర్‌లాల్‌ కలెక్టర్లు, ఎస్పీలతో  వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ శశిధర్  మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కడప,. కర్నూల్ అనంతపూర్ జిల్లాలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్‌ పెట్టెలను భద్ర పరచడానికి, ఓట్ల లెక్కింపునకు స్థానిక  పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సెక్టోరల్  అధికారులు, ప్లయింగ్‌ స్వా్కడ్లకు మెజిస్టీరియల్‌ పవర్స్‌ కల్పించేందుకు జీఏడీకి ప్రతిపాదనలు పంపామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌, లెక్కింపు ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపూర్ జిల్లా   ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూం వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు వచ్చే నెల మార్చి 9  వ తేదీన జరుగనున్నాయి. 


kj reddy

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది

పట్టభద్రుల స్థానానికి 25   మంది పోటీ

ఉపాధ్యాయుల స్థానం నుంచి బరిలో 10  మంది 

త్వరలో ఎన్నికలు జరుగనున్న కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల  తుదిపోరుకు  35 మంది అభ్యర్థులు సిద్ధమయ్యారు. నామినేషన్ల పరిశీలన తర్వాత పట్టభద్ర నియోజకవర్గం నుంచి 27 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 11 మంది అర్హులుగా  మిగిలారు. అయితే ఇలా అర్హులుగా మిగిలిన వారిలో  గురువారం పట్టభద్ర అభ్యర్థులు ఇద్దరు, ఉపాధ్యాయ అభ్యర్థి ఒకరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పట్టభద్ర స్థానం నుంచి 25 మంది,  ఉపాధ్యాయ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం  నుంచి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఐన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కేజే రెడ్డి గారు ,పోటీ చేస్తున్నారు. 


kj reddy

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

336  పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు

ఓటు హక్కును వినియోగించుకోనున్న  2,49,582 ఓటర్లు

పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలైన కడప, కర్నూల్, అనంతపూర్ జిల్లాల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం మూడు జిల్లాల పరిధిలో  336  పోలింగ్  కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిదంగా.. పట్టభద్రుల  స్థానంతో పాటు జరుగునున్న  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం  ఎన్నికలకు 171 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు  ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రాల  జాబితాను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, అనంతపూర్జి ల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ బుధవారం విడుదల చేశారు.  

పట్టభద్రుల స్థానంలో తగ్గిన ఓటర్ల సంఖ్య:

                        హోరాహోరీగా జరుగుతున్ప ఈ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. , ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల కూడా ఈసారి తగ్గింది. పట్టభద్ర స్థానానికి చెందిన  ఓటర్లు 3,933  తగ్గగా   ఉపాధ్యాయ ఓటర్లు 129 మంది తగ్గారు. ఇప్పటివరకు ఈ రెండు స్థానాలకు సంబందించిన తుది జాబితాలో 2,53,515 మంది పట్టభద్ర ఓటర్లు, 20,644 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండేవారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అనర్హుల తొలగింపు, కొత్తగా ఓటర్ల చేర్పు ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ తర్వాత పట్టభద్ర ఓటర్లు 2,49,582 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 1,72,962, మహిళా ఓటర్లు 76,611 మంది, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 20,515 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 13,294, మహిళా ఓటర్లు 7,220 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.

జిల్లాల వారీగా పట్టభద్ర నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు. 

జిల్లా                      మొత్తం    

వైఎస్‌ఆర్‌                 105    

అనంతపురం            119    

కర్నూలు                   112    

మొత్తం                      336    

ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు

జిల్లా                       మొత్తం    

వైఎస్‌ఆర్‌                52    

అనంతపురం          65    

కర్నూలు                  54    

మొత్తం                   171   


kj reddy

లాసెట్ -2017 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 18, 2017.

న్యాయవాద  వృత్తిలో ప్రవేశించాలనే యువతకు శుభవార్త.  ఆంధ్రప్రదేశ్ లాసెట్–2017 నోటిఫికేషన్ విడుదలయింది. 

ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. మూడేళ్లు-ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ  పరీక్షను నిర్వహించనున్నారు.   ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్శిటీ వెబ్సైట్ ద్వారా ఈ నెల 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు దాఖలు చేయడానికి  చివరి తేదీ మార్చి 18, 2017 . అపరాధ రుసుము రూ.500తో మార్చి 27, 2017  వరకు మరియు రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్ 5 వరకు, రూ.1500తో ఏప్రిల్ 14 వరకు, రూ.5 వేలతో ఏప్రిల్ 17 (సాయంత్రం 5 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్ష ఫీజు రూ.700 గా నిర్ణయించారు. అదేవిదంగా రెండేళ్ల  ఎల్ఎల్ఎంకు రూ.800గా నిర్ణయించారు. హాల్ టిక్కెట్లను  ఏప్రిల్ 14 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న రాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. 


kj reddy

ఘనంగా ముగిసిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నూతన రాజధాని  అమరావతి లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతంగా ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు  రాష్ట్ర, దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో  బౌద్ధ మత  గురువు శ్రీ దలైలామా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర  శ్రీ మంత్రి వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్ర మహాజన్, సినీనటి మనీషా కొయిరాలా, దేశ విదేశాలకు చెందిన 401  మహిళా శాశనసభ్యురాళ్లు, 91  మంది మహిళా ఎంపీలు, వివిధ సామాజిక, కార్పొరేట్ రంగాలకు చెందిన , 300  మంది మహిళా   ప్రముఖులు ఉన్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ శ్రీ కోడెల శివప్రసాద్ రావు చైర్మన్ గా వ్యవహరించగా, రాష్ట్ర సీఎం శ్రీ నారా   చంద్రబాబు నాయుడు చీఫ్ ప్యాట్రన్ గా వ్యవహరించారు.  

 

సదస్సుకు సంబంధించిన ముఖ్యమైన హైలైట్స్  

సదస్సుకు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులతో కలుపుకొని, 10  వేల మంది ని ఆహ్వానించగా.. దాదాపు 22 వేల మందికి పైగా మహిళలు ఈ మూడు రోజుల సదస్సులో పాల్గొని సరిక్రొత్త రికార్డు సృష్టించారు. . 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సును అందరు ఎప్పుడు గుర్తుంచుకునేలా చేయాలనే లక్ష్యంతో 'తల్లికి వందనం' అనే కొత్త పథకాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహిళా పార్లమెంట్ సభ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని యువత లో మహిళల పట్ల గౌరవభావం  పెంపొందించేలా  చేయడమే ఈ పథకం ఉద్దేశ్యం. 

తల్లికి వందనం కార్యక్రమం లో భాగంగా పిల్లలు తమ తల్లిదండ్రుల పాదాలను నీటితో కడిగి.. వారు  ఆశీర్వాదం తీసుకుంటారు. 

మహిళలకు చట్ట సభల్లో 33  శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా సదస్సు ఆమోదించింది. 


kj reddy

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అ‘ద్వితీయ’ సదస్సు

ఈనెల 27,28 తేదీల్లో విశాఖలో  ఆంధ్రప్రదేశ్-సీఐఐ రెండో సదస్సు.

ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు.

అమరావతి, జనవరి 25 : సత్వర పారిశ్రామికాభివృద్ధి-సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా    నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖనగరం వేదిక కానుంది. ‘‘సుస్థిర అభివృద్ధికి భాగస్వామ్యాలు- ఆవిర్భవిస్తున్న ప్రపంచ ఆర్ధిక క్రమం’’ ఇతివృత్తంతో  ఈ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో  విశాఖ హార్బర్ పార్కు దగ్గర ఏ.పీ.ఐ.ఐ.సీ మైదానంలో  జరగనుంది. 

గత ఏడాది భాగస్వామ్య సదస్సులో  ఫలవంతమైన ప్రాజెక్టులు

గత ఏడాది భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చింది. రూ. 4 లక్షల 67 వేల 577 కోట్ల రూపాయల విలువైపు ఎంవోయూలు కుదిరాయి.  328 ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. 9,58,896 మందికి ఉపాధి కలుగుతోంది. 

వివిధ దశల్లో ప్రాజెక్టులు : 38 యూనిట్లలో తయారీ ప్రారంభం

వీటిలో ఇప్పటికే 48 శాతం ప్రాజెక్టులు పనులు ప్రారంభించి వివిధ దశల్లో వున్నాయి. 42% పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 38 యూనిట్లు తయారీని ప్రారంభించాయి. వీటి విలువ రూ. 52,987 కోట్లు. మరో 6 యూనిట్లు ట్రైయిల్ ప్రొడక్షన్లో వున్నాయి, వీటి విలువ రూ. 1,519 కోట్లు.

మిషన్ల బిగింపు దశలో 16 కర్మాగారాలు:

 మిషనరీ బిగింపు దశలో 16 కర్మాగారాలున్నాయి. వీటి విలువ రూ. 14,700 కోట్లు. సివిల్ వర్క్ దశలో 29 యూనిట్లు వున్నాయి. వీటి విలువ రూ. 82,595 కోట్లు. రూ. 23,754 కోట్లతో మరో 13 కంపెనీలు శంకుస్థాపనకు సిద్ధమయ్యాయి. ఇంకా రూ. 6,611 కోట్ల విలువ చేసే పెట్టుబడులు పెడుతున్న 8 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి.

ఈ స్ఫూర్తితో మరోసారి విశాఖలో ఈనెల 27, 28న భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.   ఇప్పటికే దాదాపు 425 సంస్థలు రాష్ట్రంలో రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు పంపాయి. విశాఖ భాగస్వామ్య సదస్సుకు దాదాపు 4 వేల మంది ప్రతినిధులు భాగస్వామ్య సదస్సుకు హాజరవుతారు. వీరిలో 42 దేశాల నుంచి పాల్గొనే 300 మంది విదేశీ ప్రతినిధులు వున్నారు. 12 దేశాల వాణిజ్య మంత్రులు రానున్నారు.  కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ధర్మేంద్రప్రధాన్, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి ఈ సదస్సులో పాల్గొంటారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్ అండ్ అపారల్, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. 

టీవీఎస్, విప్రో, క్రేన్ , టాటా, సియట్, దాసన్, డిక్సన్, డ్రోన్ డిఫెన్స్, అపోలో, హిమామి, శ్రీ సిమెంట్స్, టోరెంట్ పవర్, ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటాయి.

సూర్యుడు ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్’ స్ఫూర్తిమంత్రంతో రాష్ట్ర ప్రభుత్వం  భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) తో గత ఏడాది ఇక్కడే నిర్వహించిన సదస్సు విజయవంతమైన అంశం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చొరవతో ఈ ఏడాదీ సదస్సును విశాఖలో నిర్వహించటానికి అంగీకరించింది. ఫలితమే మళ్లీ విశాఖలో శుక్రవారం నాడు నిర్వహించే సదస్సు.   ప్రపంచంలో అభివృద్ధి ప్రాధాన్యాలు, విధాన రూపకల్పన ప్రధాన లక్ష్యం.  తదుపరి స్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి చర్చావేదికగా ఈ సదస్సు ఉపయోగపడాలని ముఖ్యోద్దేశం. భారత్‌ లో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం, ఆసక్తి ఉన్న దేశాలను ఆకర్షించి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చటం ధ్యేయం.

రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పర్చేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలెన్నో తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించింది.  అద్భుత కృషితో గత ఏడాది రాష్ట్ట్రప్రభుత్వం  నెంబర్ వన్  ర్యాంకును  సాధించింది.

 ప్రత్యేక దృష్టి పెట్టిన విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ఐటి, పరిశ్రమలు-మౌలిక సదుపాయాల రంగాల్లో  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు  ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పిస్తోంది.  రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, సహజవనరుల్లో మన కలిమిని, బలిమిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా, యూ.కే, జపాన్, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు.

 కొద్దిరోజుల క్రితమే దావోస్ ‘ప్రపంచ ఆర్ధిక వేదిక’ (World Economic Forum) సదస్సు ఆహ్వానం మేర ఐదు రోజులు దావోస్ లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆకాంక్ష వ్యక్తపరిచిన కంపెనీలతో దావోస్‌లో ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. చైనా, పాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా, మలేషియా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించి వెళ్లాయి.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాతో సాంకేతిక సహకారానికి  ‘సిస్టర్ స్టేట్ ’  ఒప్పందం కుదిరింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), పారిశ్రామిక విధానం, ఉన్నతీకరణ విభాగం, భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ విశాఖలో ఈనెల 27,28 తేదీలలో సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం  సిఐఐ సహకారంతో నిర్వహించే రెండో  సదస్సే కాదు. సిఐఐ దేశవ్యాప్త సదస్సుల్లో  23వ భాగస్వామ్య సదస్సు.  

సిఐఐ గత ఇరవై రెండేళ్లుగా అంతర్జాతీయ అంశాలపై సహకారానికి, సమస్యల పరిష్కార సాధన కోసం చర్చలకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో  22 సదస్సులు నిర్వహించింది. ప్రస్తుత అవకాశాలు-భవిష్యత్తులో సవాళ్లపై  చర్చించే వేదికలుగా  ఈ సదస్సులు నిలుస్తున్నాయి. ఏటా కనీసం వేయి నుంచి 1,500 మంది ప్రతినిధులు సీఐఐ సదస్సులో పాల్గొంటున్నారు. ఇందులో 40% మంది ప్రతినిధులు విదేశీ ప్రతినిధులు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే దేశాధినేతలు, మంత్రులు, విధాన రూపకల్పన నిర్ణేతలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, విద్యావేత్తలు పాల్గొంటారు. 

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకున్నా కసితో చేసిన కృషి ఫలించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో (‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’) నెంబర్ వన్ గా అవతరించింది.రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవటానికి ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ ఇతివృత్తంతో సాగిస్తున్న ప్రస్థానం ఫలితాలనిస్తోంది. మౌలిక సదుపాయాలు, సహజవనరుల్లో  ఆంధ్రప్రదేశ్ కలిమిని,బలిమిని వివరించడానికి జాస్తి కృష్ణకిశోర్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇ.డి.బి) బృందం గత ఏడాది నవంబర్‌లో చైనాలో పర్యటించి వచ్చింది.

విశాఖలో ఈనెల 27,28 తేదీల్లో సదస్సు: 

సీఐఐ సదస్సు సమయ సూచిక, వివరాలు:

 మొదటి రోజు సమావేశం శుక్రవారం 

ఉదయం గం.10.00: ‘ఇండియా ఎట్ ది కస్ప్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇతివృత్తంగా మొదటి సమావేశం. ఉ. గం.11.30 నిలకు. ‘టైమ్ ఇండియా అవార్డ్స్’ ప్రారంభ సమావేశం. మధ్యాహ్నం గం.2.15 ని.లకు: సుస్థిర ఆర్ధిక, వాణిజ్యాభివృద్ధి సాధన దిశగా భారత్: అభివృద్ధి చెందిన దేశాలు నాయకత్వం వహిస్తాయా? అనే అంశంపై ప్లీనరీ సమావేశం.

 మధ్యాహ్నం గం.3.45: రెండో ప్లీనరీ సమావేశం: ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్-ప్రపంచంకోసం-భవిష్యత్తు కోసం సిద్ధం.  

సాయంత్రం గం. 5.45: మూడో ప్లీనరీ సమావేశం:  సుస్థిర అభివృద్ధికి వినూత్న భాగస్వామ్యాల ఆవిష్కరణ.  సాయంత్రం గం.7.00 లకు నాలుగో ప్లీనరీ సమావేశం:గ్లోబల్ ఫైనాన్షియల ఆర్కిటెక్చర్: ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ.

రెండో రోజు సమావేశాలు శనివారం 28 వతేదీ

ఉదయం గం.10. ఐదో ప్లీనరీ సమావేశం:  ఇండస్ట్రీ 4.0- లీవరేజింగ్ ఫర్ ఎఫిషియన్సీ, అడాప్టబిలిటీ, ప్రొడక్టివిటీ (LEAP)? What is it in India? ఉ. గం.10.00: ఆంధ్ర ప్రదేశ్ అండ్ గ్లోబల్ నాలెడ్జ్ అండ్ రిసెర్చి పార్ట్‌నర్‌షిప్స్.

11.15: ఆరో ప్లీనరీ సమావేశం. భారత అమెరికా సంబంధాలు. కొత్త పరిపాలన భవిష్యత్తు ప్రణాళిక:

గం.11:15: ప్రత్యేక సమావేశం స్కిల్లింగ్ 4.0-ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్

మ. 12.30 ఏడో ప్లీనరీ సమావేశం: ‘అన్ లీజింగ్ గ్రోత్ ఇండస్ట్రియల్ కారిడార్స్’.

మ. గం.3.00: ఎనిమిదో ప్లీనరీ సెషన్: ఇండియాస్ ఇంటిగ్రేషన్ విత్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా.  


kj reddy

కర్నూలులో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్న ఐయోవా విశ్వవిద్యాలయం

కర్నూలులో సీడ్ ప్రాసెసింగ్, విత్తన ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం  విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఐయోవా విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకోనుంది.

ఇందుకు కర్నూలులోని నంద్యాల ప్రాంతం అన్ని ప్రాంతాలంకంటే కూడా అనుకూలంగా ఉందని , ఇక్కడ అధిక దిగుబడిని ఇచ్చే మరియు వ్యాధి నిరోధక రకాలు లభ్యమవుతాయని ప్రభుత్వం గుర్తించింది.
దాదాపు 100 కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడం, దీనిలో జన్యుపరంగా మార్పుకాని విత్తనాలను పెంచడంలో 5 లక్షల మంది రైతులను బాగస్వామ్యులుగా చేయడం ప్రవిత్వం యొక్క దీర్ఘకాలిక లక్ష్యం.
 


kj reddy

ఆడబిడ్డని బతకనిద్దాం - ఆ బిడ్డకు బతుకునిద్దాం: నేడు జాతీయ బాలికా దినోత్సవం

 తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజుల్లో కూడా బ్రూణ హత్య దశను దాటి భూమిఫై పడింది మొదలు ఆడపిల్ల అడుగడుగునా విచక్షణ ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరం. దీనికి కారణం సమాజ మూలమూలల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణం అయితే, అడవారికే ఆడవాళ్లే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్లు కొంత వరకు కారణం అవుతున్నారు.

ఈ విషయంపై సామాజిక అవగాహనా పెంచి పీడన నుండి బాలికలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఈ అవగాహనను మరింతగా పెంచేందుకు భాగంగా, మన దేశంలో ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా  మహిళా సాధికారతను పరితపించే కెజె రెడ్డి గారు తన కెజెఆర్ ఫౌండేషన్   తరపున బాలికల విద్య, పోషకాహారం, న్యాయం, విద్య సహాయం, సంరక్షణ వంటి అంశాలకు సంబంధించిన కనీస హక్కులపై దేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా చర్యలను తీసుకోవాలని కోరుకుంటున్నారు. తన వంతు సహాయంగా కెజెఆర్ ఫౌండేషన్  ద్వారా ఇప్పటికే బాలికలకు ఉచిత ఆరోగ్య చికిత్సకు సంబంధించి పలు  కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజున బాలికల దినోత్సవం సంధర్బంగా రానున్న రోజుల్లో రాయలసీమలో మరిన్ని సామాజిక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని  గారు తెలిపారు. అంతేకాక బాలిక మరియు మహిళా సాధికారత తమ లక్ష్యం అని అందుకోసం తాను స్థాపించబోయే పరిశ్రమల్లో ప్రత్యేకంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. 
దేశంలో రోజురోజుకి అడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఇది ఇలాగె కొనసాగితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే కాక ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40% పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయని ఇటీవలే యూనిసెఫ్ గణాంకాలను వెల్లడించింది. ఇంతే కాక బాలికల ఉన్నత విద్య మరో సమస్యగా మారింది, ఇప్పటికి చాల రాష్ట్రాల్లో 40%నికి పైగా  పదో తరగతి కంటే ముందే బడి మానేస్తున్నారు.
దేశంలో ప్రత్యేకంగా రాయలసీమలో ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నామని అందుకోసం తమ ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తామని ఆయన అన్నారు. మహిళలలో ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడే రాయలసీమ అబివృద్ది పథంలో మరింత ముందుకు వెళ్తుందని కెజె రెడ్డి అభిప్రాయపడ్డారు.
 


kj reddy

రక్తదానం - మహా దానం: రక్త దాతలు నిజ జీవితంలో హీరోలు: కెజెర్ ఫౌండేషన్

"రక్త దాతలు నిజ జీవితంలో హీరోలు - రండి కలిసికట్టుగా ఒక జీవితాన్ని కాపాడుదాం...!"
 

ఒక మనిషి జీవితాన్ని కాపాడటమంటే  మొత్తం మానవాళి నే కాపాడినట్లు అని మన పెద్దలు చెప్పారు.  దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చేశే రక్తదానమే. రక్తదానం లాంటి గొప్ప కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కె జె రెడ్డి గారి  నేతృత్వంలోని  కెజెఆర్ ఫౌండేషన్ అవసరమైన వారికి రక్తాన్ని అందించి  రాయలసీమ ప్రాంతంలోని  వేల  మంది ప్రాణాలు కాపాడాలనే  ఒక గొప్ప లక్ష్యంతో ఈ రక్త దానం చేయాలనే సంకల్పాన్ని  ఆచరణలో పెట్టింది.  ఈ మా ప్రయత్నంలో రక్తదానం చేసేవారు, రక్తదానం చేయాలనుకునే వారు, రక్తం కావాల్సిన వారు అందరు భాగస్వామ్యం కావచ్చూ. వీరందరి కోసం కేజే రెడ్డి ఫౌండేషన్ ఒక ఆన్ లైన్ వేదికను సిద్ధం చేసింది. ఈ వేదికలో అందరు భాగస్వామ్యం కావచ్చూ.  

ఎందుకు రక్త దానం చేయాలి..?
* రక్తానికి మరొక ప్రత్యామ్నాయం లేదు
* భారత దేశంలో ప్రతి 3 సెకండ్లకు ఒకరికి రక్త మార్పిడి అవసరం ఉంది
* మనం ఒక్కసారి రక్తం ఇస్తే అది ముగ్గురికి ఉపయోగ పడుతుంది
 ముగ్గురికి ఎలా ఉపయోగ పడుతుంది అని సందేహం వస్తుందా..?
మనం దానం చేసిన రక్తాన్ని 3 రూపాల్లో విభజిస్తారు. రెడ్ సెల్స్, ప్లాస్మా మరియు ప్లేట్లెట్స్ ఈ మూడు రకాలని ముగ్గురికి వారి వారి అవసరాలను బట్టి అందిస్తారు.  

రక్తదానం వల్ల కలిగే లాభాలు: 

1. రక్తదానం చేసేవారికి తమ సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం దొరుకుతుంది 
2. రక్తదానం చేసేవారిలో గుండెకు సంబందించిన రోగాలు వచ్ఛే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇనుము శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది.  

3. రక్తదానం కేన్సర్ రోగం బారిన పడే అవకాశాల్ని తగ్గిస్తుంది. 
 4. రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబందించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా ఉచితంగా  చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమను తాము ఆరోగ్యవంతునిగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం దొరుకుతుంది. 
5. రక్తదానం చేయడం వల్ల మన శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దింతో బరువు పెరిగే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు. 
 

రక్తం దానం చేసే వారు, చేయాలనుకునే వారు  ఎలా తమ పేర్లను నమోదు చేసుకోవాలి? 
తరచూ రక్తదానం చేసేవారు, రక్తదానం చేయాలనుకునే వారు మా ఫౌండేషన్ కు సంబందించిన వెబ్సైటు లోకి వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చూ. మా వెబ్సైటు చిరునామా kjrfoundation.co.in/BloodDonor 
రక్తం కావాలనుకునే వారు కూడా మా ఫౌండేషన్ వెబ్సైటు లోకి వెళ్లి సంబంధిత ఆన్ లైన్ అప్లికేషన్ ను పూర్తి చేసి తమ  పేర్లను నమోదు చేసుకోవాలి. 


kj reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాధించిన విజయాలు

నారా లోకేష్!  రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ రంగంలో   ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసునిగా నారా లోకేష్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన  కొనసాగుతున్నారు. తన రాజకీయ ప్రవేశంతోనే  ఎన్నో వరుస విజయాలను సాధించి.. ఆయన తండ్రికి తగ్గ తనయునిగా తనను తాను నిరూపించుకున్నారు. లోకేష్ రాజకీయ ప్రవేశం 2013  వ సంవత్సరంలో జరిగింది. ఇదే ఏడాది మే నెల నాటికీ అయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. లోకేష్ సాధించిన ఎన్నో  విజయాల్లో కొన్ని..

1. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన నగదు బదిలీ పథకాన్ని రూపశిల్పి నారా లోకేష్. 2009  లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో లో నగదు బదిలీ పథకాన్ని పెట్టి లోకేష్ ఈ అంశంపై దేశవ్యాప్త చర్చకు దారితీసారు. ఈ పథకాన్ని తొలుత విమర్శించినా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2013  వ సంవత్సరంలో నగదు బదిలీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది. 
2. రెండు సార్లు ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి తేవడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

3. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచి నీరు అందించే  ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం రూపశిల్పి. లోకేష్  సూచనతో  ఈ పథకాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  
4.  లక్షలాది పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక వినూత్నమైన జీవిత  భీమా సౌకర్యాన్ని కల్పించిన నాయకుడు. ఈ పథకం వల్ల పార్టీ కోసం పనిచేస్తూ ప్రాణాలను  కోల్పోయిన ఎంతో మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు  రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందింది. 
5. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి రూపశిల్పి కూడా లోకేషే.  
6. పార్టీ లో సభ్యుల సంఖ్యను యాభై లక్షల మైలు రాయిని దాటించి దేశ రాజకీయాల్లో సరిక్రొత్త రికార్డును టీడీపీ నెలకొల్పేలా లోకేష్  చేశారు.  లోకేష్ నాయకత్వంలో పార్టీ సాధించిన ఈ రికార్డును ఎంతో మంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు అమెరికన్ ఆర్మీ తో పోల్చారు. ఎందుకంటే అమెరికన్ ఆర్మీ లో కూడా 50  లక్షల మంది సైనికులు ఉన్నారు.


kj reddy

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె జె రెడ్డికి మద్దతు ప్రకటించిన రాయలసీమ ఫాస్టర్ల ఫెడరేషన్ - ఎన్నికల్లో విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు

ఈ సమావేశం రాయలసీమ ఫాస్టర్ల చీఫ్ ప్యాట్రన్ సజీవరాజు ఆధ్వర్యంలో జరిగింది. 

ఇందులో రాయలసీమ ఫాస్టర్ ఫెడరేషన్ అధ్యక్షులు యేసు రత్నం, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కర్నూలు జిల్లా ఫాస్టర్స్ కౌన్సిల్ అధ్యక్షులు ఇమ్మానియేలు, సిటీ అధ్యక్షులు విలియమ్స్, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి హవిలన్ బాబు తదితరులు పాల్గొని కె జె రెడ్డికి మద్దతు తెలియజేసి ఆయన విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసారు.     


kj reddy

‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై దావోస్ లో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు:

దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై ప్రసంగించారు. అద్భుత ప్రగతికి ఆధునిక సాంకేతికతను తాము సోపానంగా మలుచుకున్నామని చెప్పారు. తానుకేవలం టెక్నాలజీలో తాను మేనేజర్ మాత్రమేనని, ప్రొఫెషనల్‌ని కానని చెబుతూనే ఒక ప్రొఫెషనల్ కంటే చక్కగా వివరించిన తీరు దావోస్ లో సదస్యులను ఆకట్టుకుంది.

ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి:

‘ఇదో అద్భుతమైన ప్రదేశం. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. అందరం ఒకే చోట కలుసుకునేందుకు వీలయ్యింది. ‘నేను ప్రొఫెషనల్ ను కాను నేను మేనేజర్‌నే’. టెక్నాలజీ ఈ సమాజానికి , ముఖ్యంగా సామాన్యుడికి ఎలా ఉపయోగించాలా అనేదే నా తపన. ముప్ఫయ్ ఐదేళ్లనాడే టెక్నాలజీ ఉపయోగించాను. 1984-85..ఆ సమయంలో కంప్యూటర్లు ఉపయోగించాను. పార్టీ నిర్మాణంలో వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలని, జవాబుదారీతనంకోసం కంప్యూటర్లు ఉపయోగించాం. ఆరోజుల్లో కంపెనీలు పరిమితంగానే ఉండేవి. పెద్ద పెద్ద మిషన్లుండేవి. ఈ కంప్యూటర్ల ఉంచడానికి ప్రజలకు ఏసీలు కూడా లేని సమయం. ఈరోజు పరిస్థితి గణనీయంగా, సంపూర్ణంగా మారిపోయింది. ఇంటరనెట్ రాకతో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజిగా మారింది. ‘ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్’ తో ఇవాళ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తున్నది. బయోమెట్రిక్స్,సెన్సర్స్ , డివైసెస్, సీసీ కెమేరాలు, డ్రోన్స్, రొబొటిక్స్..అనూహ్య సాంకేతిక ఆవిష్కారాలు వచ్చాయి.

అయితే ఇవన్నీ రాకముందే మా రాష్ట్రంలో నేను అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను. ఐటీ కంపెనీలను ఆకర్షించటానికి ప్రపంచమంతా తిరిది ప్రత్యేక కృషిచేశాను. హైదరాబాద్ ఒక నాలెడ్జి హబ్ గా ఏర్పడటంలో ఆనాటి కృషిని తక్కువ అంచనావేయవద్దు. నేను సాధ్యమైనంత వరకు అన్ని టెక్నాలజీలు ఉపయోగిస్తాను. రాజకీయాల్లో కొన్ని నాటకీయ సంఘటనలు జరుగుతుంటాయి. పాలిటిక్స్ లో అనూహ్యంగా నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నట్లే ఒకోసారి టెక్నాలజీలో కూడా చోటుచేసుకుంటాయి. భారత్ లో మా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు నల్లధనాన్ని అరికట్టడడానికి హఠాత్తుగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1000,రూ.500 నోట్లు రద్దు చేశారు. 86% లావాదేవీలు కరెన్సీ తోనే జరిగే మా దగ్గగర డీమోనిటైజేషన్ ప్రభావం పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్నాం. మొబైల్ లావాదేవీలవైపు మళ్లాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా భారత్ ఒక సానుకూలాంశం ఉంది. అదే ఆధార్. 


kj reddy

రైతులకు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడి సంక్రాతి కానుక - రూ.37వేల పంపుసెట్‌ ఉచితంగా పంపిణి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాతి కానుకను ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.37 వేలు విలువ కలిగిన వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్‌ను ఉచితంగా అందిస్తమని ప్రకటించారు.

 2017 చివరినాటికి పాత పంపుసెట్ల స్థానంలో రెండు లక్షల కొత్త పంపుసెట్లను నెలకొల్పనున్నామని తెలియజేశారు.  రాష్ట్రంలోని రైతులందరికీ తమ ప్రభుత్వం సంపూర్ణ సాయం అందిస్తుందని,  రైతు శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అయన పునరుద్గాటించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని రైతులందరికీ ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను రాష్ట్ర ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ మీడియాకు  విడుదల చేశారు. ఈ బహిరంగ లేఖలో రైతులకు సంబందించిన ప్రతి అంశాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న  నాసి రకం పంపుసెట్ల స్థానంలో 5 నక్షత్రాలు కలిగిన మోటారును రైతులకు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం తన లేఖలో గుర్తు చేశారు. ఈ పంపు సెట్లపై ఐదు   సంవత్సరాల వారంటీ ఉంటుందని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గురించి కూడా ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ రంగంపై ఏడాదికి రూ.8 వేల కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం  ఖర్చు చేస్తోందని వెల్లడించారు.రాష్ట్రంలోని  ఒక్కో రైతు కుటుంబానికి వ్యవసాయ పంపుసెట్‌కు కరెంట్‌ సరఫరాకు రూ.22 వేలు వెచ్చిస్తున్నామన్నారు. రైతులకు ఇప్పటి వరకూ 9,400 సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించామని తెలిపారు.  1,400 సౌర పంపుసెట్లను ఏర్పాటు చేయడం ద్వారా కృష్ణా జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 900 పంపుసెట్లు ఇవ్వడం ద్వారా విజయనగరం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.త్వరలోనే రాయలసీమ జిల్లాల రైతులు కూడా కోస్తా వారితో సమానంగా పంటలు పండిస్తారని పేర్కొన్నారు. సంక్రాతి పండగను పురస్కరించుకొని  ‘‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’’ కార్యక్రమం ను  నిర్వహిస్తున్నామని అయన ఈ సందర్బంగా వెల్లడించారు. . ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతునూ విద్యుత్‌ శాఖ ఉద్యోగి కలుస్తారని చంద్రబాబు నాయుడు తెలిపారు. .

 


kj reddy

ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి 'ఆరోగ్య రక్ష' పథకం రాష్ట్ర ప్రజలకు వరం - ప్రారంభమైన పేర్ల నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారి కోసం ‘ఆరోగ్య రక్ష’ అనే సరికొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ వినూత్న పథకాన్ని నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి ఒకటవ తేదీన విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు.

ఇప్పటికే ప్రభుత్వ పరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య భీమా కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 35 లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకంలో చేరడానికి అవసరమైన పేర్ల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకంలో చేరాలనుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ-సేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చూ. ‘ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకొనే ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1,200 చెల్లించాలి. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది ఈ పథకంలో చేరవచ్చుఁ. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్య సేవ అందుతుంది. పథకంలో చేరిన లబ్దిదారులకు రాష్ట్రంలోని 432 ఆస్పత్రుల్లో 1,044 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది. ఈ పథకం కాలపరిమితి ఏడాది ఉంటుంది. ఆన్లైన్ లో తమ దరఖాస్తులు సమర్పించాలనుకునే వారు ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైటు లో లాగిన్ అయ్యి చేయవచ్చు. దరఖాస్తుదారులు అందరు తమ ఆధార్ కార్డు వివరాలను ఈ కార్డు పొందడానికి సమర్పించాల్సిఉంటుంది. దరఖాస్తుల సమర్పణ అనంతరం 'ఆరోగ్య రక్షా' పధకాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన ఆరోగ్య కార్డులు సంబంధిత దరఖాస్తుదారులు పొందవచ్చు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పథకంలో చేరడానికి వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీ ని చివరి తేడాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆరోగ్య భీమా పథకం ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇందులో లబ్ధిదారులు కట్టే భీమా ప్రీమియం సొమ్ము, ప్రైవేట్‌ భీమా కంటే చాలా తక్కువ. దారిద్య్ర రేఖ (బీపీఎల్‌)కు దిగువన ఉన్న కుటుంబాలు, ఉద్యోగులు, పాత్రికేయులకు ఇప్పటికే ఆరోగ్య కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలందరికి ఆదర్శనంగా నిలవడానికి ఈ ఆరోగ్య రక్ష పథకంలో సీఎం శ్రీ నారా చంద్రబబు నాయుడు గారు కూడా తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకున్నారు.పథకానికి సంబందించిన ఆరోగ్య కార్డును వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అందుకున్నారు. ఈ పథకంలో చేరాలనుకునే రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం పథకానికి సంబందించిన వెబ్సైటు లింకును ఇక్కడ ఇస్తున్నాం. http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx


kj reddy

ఫలించనున్న పులివెందుల వాసుల దశాబ్దాల కల

ఈ నెల 11, గండికోట ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు

రాయలసీమ జిల్లా ఐన కడప లోని పులివెందుల వాసుల దశాబ్దాల నీటి కల త్వరలోనే నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ నెల 11న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. గండికోట ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా పులివెందులకు నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తికాకుండా ఉన్న ప్రాజెక్టులన్నింటికీ మోక్షం కలిగించే విధంగా తాము కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు అంటే 10 ఏళ్ల సమయం తీసుకోవడం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత... ఆదాయం వచ్చే మార్గం లేకపోయినా ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు తాగు, సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన ఈ రోజు అన్ని వర్గాల వారికీ పండగ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏలేరు ఆయకట్టు కింద రైతులు పది సంవత్సరాలు పోరాడారని గుర్తుచేశారు. తాను రాష్ట్రంలోని ఏ ప్రాంతం పైన వివక్ష చూపడం లేదని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసారు. తనకు అన్ని ప్రాంతాలు సమానమేనని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


kj reddy

‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

>గ్రూప్‌–1 పోస్టులు 78. >గ్రూప్‌–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు. >హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల పోస్టులు 100 >మొత్తం 1317 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

రాష్ట్రంలో గ్రూప్‌–1, గ్రూప్‌–3 సహా 1317 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 9 నోటిఫికేషన్లను కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.ఉదయభాస్కర్‌ మీడియా సమావేశంలో విడుదల చేశారు. 2017లో ఈ పోస్టులన్నిటికీ రాత పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గ్రూప్‌–1లో 78 పోస్టులు ఉన్నాయి. *డిప్యుటీ కలెక్టర్లు, *కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్లు, *డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్లు, *డిప్యుటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు, *అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్, *జిల్లా బీసీ సంక్షేమాధికారులు, *గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్లు, *లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్ల పోస్టులున్నాయి. >గ్రూప్‌–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్లు– 5, అగ్రికల్చర్‌ ఆఫీసర్లు–30, టౌన్, కంట్రీప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్లర్లు–5, మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు–5, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు–10, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–13, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–10, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–6, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1317 పోస్టులకు సంబంధించి 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆయా నోటిఫికేషన్ల పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హతలు, ఇతర సమాచారానికి సంబంధించి వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)ను పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్‌ వివరించింది. ఈ పోస్టులకు 1:50 చొప్పునే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్‌ టెస్టులను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఓఎమ్మార్‌ సమాధానాలతో నిర్వహించనున్నారు. కాగా, ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడ, లేదా గుంటూరులలో ఏర్పాటుచేయడానికి అద్దెభవనాలను అన్వేషిస్తున్నామని ఉదయభాస్కర్‌ తెలిపారు. గ్రూప్‌–1 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్‌–1 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ప్రిలిమనరీ పరీక్ష మే 7వ తేదీన ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేయనున్నారు. ప్రిలిమనరీ పరీక్షను రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్‌ పరీక్షను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. గ్రూప్‌–1లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీపై ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిషుతో పాటు ఐదు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్‌–3 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్‌–3 కింద భర్తీ చేయనున్న 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తును కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచారు. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ‘పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌’ నుంచి సంబంధిత కరస్పాండింగ్‌ లింకులోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ‘హెచ్‌టీటీపీ:ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్‌17.ఏపీపీఎస్‌సీ.జీఓవీ.ఐఎన్‌’ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌–3 పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఏప్రిల్‌ 23న నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షను జులై 16న ఆన్‌లైన్లో కంప్యూటరాధారితంగా చేపడతారు. ఈ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కుల పద్దతిని అనుసరిస్తారు. మెయిన్‌ పరీక్ష 300 మార్కులకు 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్‌1లో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. రెండో పేపర్లో రూరల్‌ డెవలప్‌మెంట్, గ్రామీణ ప్రాంతంలో సమస్యల (ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యతగా)పై ప్రశ్నలుంటాయి. ► టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం కాగా జనవరి 30వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులు 25 వేలు దాటితే స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 5, 6వ తేదీల్లో కంప్యూటరాధారితంగా చేపట్టనున్నారు. ఈ పరీక్షను విజయవాడ, గుంటూరులలో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అసిస్టెంటు టౌన్‌ప్లానర్‌ పోస్టులకు కూడా జనవరి 30వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. 25వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తరువాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30తో ముగుస్తుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ అవసరమైతే తేదీని తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌4న 450 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ► అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్, సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. స్క్రీనింగ్‌ టెస్ట్‌ను జూన్‌ 18న నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షను సెప్టెం బర్‌ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ► మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అవసరమైతే స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 5న నిర్వహిస్తారు. ► హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు జూన్‌11న స్క్రీనింగ్‌ టెస్ట్, సెప్టెంబర్‌ 21న మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ► అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫిషరీస్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ అవసరమైతే ఎప్పడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్ష మే 4, 5 తేదీల్లో జరుగుతుంది


kj reddy

సీమకు పర్యాటక శోభ తేవడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం:

రాయలసీమకు త్వరలోనే పర్యాటక శోభ రానుంది.

అబ్బుర ప్రముఖ రాజ కోటలు,అద్భుతమైన పుణ్య క్షేత్రాలు, మైమరిపించే వారసత్వ సంపద, ఆహా అనిపించే బెలుం గుహలు ,లేపాక్షి శిల్పాలు ఇలా ఎన్నెన్నో పర్యటక క్షేత్రాలకు నిలయమైన రాయలసీమకు హెరిటేజ్ సర్కూట్ గా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. స్వదేశీ పథకం కింద: *కడప జిల్లాలోని గండికోట *అనంతపురం జిల్లాలోని గుత్తికోట * పెనుగొండ కోట *లేపాక్షి ఆలయం *తాడిపత్రి ఆలయం *బుగ్గ రామేశ్వర ఆలయం *చింతల వెంకటేశ్వర ఆలయం * బెలుం గుహలు ప్రసాద్ కింద శ్రీశైలం: దేశంలోని 20 పుణ్య క్షేత్రాలలో శ్రీశైలం ప్రసాద్ పథకంలో ఒకటిగా ఎంపిక అయింది. ఈ క్షేత్రానికి మెరుగైన సౌకర్యాలతో పాటు, అక్కడ ఉన్న అవకాశాలను బట్టి అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు. ఎలాంటి అభివృద్ధి జరగనుంది: *స్వదేశీ దర్శన్ కింద పంపిన ఈ ప్రతి పాదనలు ద్వారా ఒక్కో క్షేత్రంలో 20 కోట్లతో యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తారు. *ఈ క్షేత్రాల్లో మ్యూజియంలు, కన్వెన్షన్ హాళ్లు, థీమ్ పార్కులు, సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారు. *అవకాశం ఉన్న చోట బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. *అంతే కాకుండా కోటలు, ఆలయాలు, గుహల సమీపంలో పర్యాటకాన్ని అనుకూలంగా ఉండే ప్రదేశాలను అభివృద్ధి పరచి పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూస్తారు.


kj reddy

BHIM యాప్ ని రిలీజ్ చేసిన నరేంద్ర మోడీ

నోట్ల రద్దు తరవాత డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహిస్తూ ప్రధాని నరేంద్ర మోడి BHIM యాప్ ను విడుదల చేశారు.

1) BHIM యాప్ తో వినియోగదారులు ఏ ఇతర బ్యాంక్ ఖాతాలకు అయినా నగదు బదిలీ చేయవచ్చు. ఇతరులు (డబ్బు తీసుకునే వాళ్ళు) BHIM యాప్ ఉపయోగించనప్పటికీ వారికీ ఖాతాలకు నగదు జమ చేయవచ్చు. 2) మరొక ప్రయోజనం ఈ అప్లికేషన్ ద్వారా డబ్బు పంపడం లో ఎటువంటి పరిమితి లేదు, మీరు మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎంత మొత్తన్ని అయితే బదిలీ చేయగలరో అంతే డబ్బును ఇతరులకు పంపవచ్చు. 3) భీమ్ యాప్ నేరుగా మన బ్యాంకు ఖాతాలతో అనుసంధానించబడుతుంది. 4) ఇతర ముఖ్యమైన ప్రయోజనం మనం అధార్ నమోదు సమయంలో అందించిన వేలు ముద్రలను ఉపయోగించడం ద్వారా బిల్లులు చెల్లించవచ్చు.


kj reddy

జన్మ భూమి - మా ఊరు కార్యక్రమంలో కుటుంబ వికాసానికి 15 సూత్రాలకు శ్రీకారం చుట్టిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు

సమాజం పూలవనం లాంటిది - పూలవనంలోని ప్రతి పువ్వులా వ్యక్తి యొక్క శక్తి , వ్యక్తి వికాసంతోనే కుటుంబం వికసిస్తుంది. కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం, తద్వారా రాష్ట్రం , దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధితో విరబూస్తాయి,ఆర్థిక వృద్ధితో అనందం వెల్లివిరుస్తుంది. ఆ లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వికాసానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ 15 సూత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాల్లో "కుటుంబ వికాసం" అమలుకు అందరం అంకితమవుతూ రాష్ట్ర వికాసానికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు: 1) జీవన భద్రత - ఎన్.టి.ఆర్ భరోసా 2) ఆహార భద్రత 3) చంద్రన్న భీమా 4) విద్యుత్ భద్రత 5) దీపం పథకం 6) మంచి నీటి భద్రత 7) గృహ భద్రత 8) ఆత్మ గౌరవం 9) ఆరోగ్య భద్రత 10) విద్యా భద్రత 11) ఇంటింటా పశు సంపద 12) ఉపాధి/ఉద్యోగ భద్రత 13) సమాచార/సాంకేతిక విజ్ఞానం 14) శాంతి భద్రతల పరిరక్షణ మహిళలకు భద్రత 15) ప్రతి కుటుంబానికి రూ.10,000 కనీస ఆదాయం


kj reddy

ఔత్సహిక పారిశ్రామిక వేత్త, నిత్యకృషీవలుడు శ్రీ కేజే రెడ్డి గారి జీవిత ప్రయాణం:

కేజే రెడ్డి.. రాయలసీమ ప్రాంతంలో కానీ, మరీ ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఈ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. కేజే రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది. అయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయన సాధించిన విజయాలు కష్టపడి పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ లాంటివి.

వ్యాపారంలో తాను సంపాందించిన ధనంతో కే.జే.ఆర్ గ్రూప్ ను ప్రారంభించి తన సామర్జ్యాన్ని వివిధ రకాలైన రంగాలకు విస్తరించారు. రియల్ ఎస్టేట్ రంగం, విద్యా రంగం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టి విజయాన్ని సాధించారు. తమ అభిమానులు, మిత్రులు ప్రేమతో పిలుచుకునే కే.జే.ఆర్ ఐన కేజే రెడ్డి సామజిక సేవలో కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందరో పేద వాళ్లకు తమ సంస్థ తరపున ఆర్ధిక సాయం చేశారు. ఇంతటితో ఆగకుండా పోలియో వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాల్ని కూడా ఆయన నిర్వహించారు. రాయలసీమ లో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాగ మయూరి ఎల్సీక్ట్రానిక్స్ పార్కును తన కే.జే.ఆర్ గ్రూప్ ద్వారా అనంతపురం జిల్లా లో శంకు స్థాపన చేసారు.ఈ పార్కు ద్వారా పదివేల మందికి నేరుగా మరియు మరో ఇరవై ఐదు వేళా మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.అంతే కాకుండా కడప,కర్నూల్, అనంతపురంలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని నెలకొల్పి వాటి ద్వారా మరో ఐదు వేల మంది నిరుద్య్యోగులకు ఉపాధి కల్పించనున్నారు. ఇలా ఎన్నో వ్యాపారాలలో విజయదుందుబి మోగించిన కేజే రెడ్డి గారు తన ను ఇంతవాన్ని చేసిన ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం తో ఈ మద్యే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసారు.అయన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా టి.డి.పి పార్టీ తరపున పోటీ చేయనున్నారు.పారిశ్రామికవేత్తగా మంచి పేరు ఉన్న ఈయన రాయలసీమ లో నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశాలను కల్పించి సీమ ను "పారిశ్రామిక సీమ"గా మార్చాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నారు.


kj reddy

సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభంతో రాయలసీమకు చెందిన నిరుద్యోగుల జీవితాల్లో చిగురించిన ఆశలు:

సోలార్ పవర్ ప్లాంట్లపై రాయలసీమ చెందిన నిరుద్యోగుల పెట్టుకున్న ఆశలు త్వరలోనే తీరబోతున్నాయి. ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం అనంతపురం,కర్నూల్, కడప జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. దీంతో దాదాపు 5000 నుండి 10,౦౦౦ మంది నిరుద్యోగులకు ఉపాధి కలగనుంది. ఇందుకు ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాయలసీమ లోని కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2500 MW సామర్థ్యం గల

సోలార్ పవర్ ప్లాంట్ల పనులు త్వరలోనే పూర్తికానుండడమే. ఈ మూడు ప్రాజెక్టులను 'అందరికి విద్యుత్తు' అన్న పథకంలో భాగంగా చేపడుతున్నామని 2014 సెప్టెంబర్లో జరిగిన కాబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మూడు పవర్ ప్రాజెక్టుల్లో 1000 MW సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ను అనంతపూర్ జిల్లాల కదిరి లో, 1000 MW ప్రాజెక్ట్ ను కర్నూల్ జిల్లా పాణ్యంలో, 500MW ప్రాజెక్ట్ ను కడప జిల్లా జమ్మలమడుగు లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకోసం అవసరమైన భూకేటాయింపులను కూడా ప్రభుత్వం వెంటనే చేసింది. అనంతపూర్ జిల్లా కదిరిలోని పవర్ ప్లాంట్ కు 5500 ఎకరాల భూమిని, కర్నూల్ జిల్లా పాణ్యంలోని పవర్ ప్లాంట్ కు 5000 ఎకరాల భూమిని, కడప జిల్లా జమ్మలమడుగు లోని పవర్ ప్లంట్ కు 3000 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతటితో ఆగకుండా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఎంఓయూ (MoU) లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. అనంతపూర్ లోని కదిరి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని జాతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి అప్పగించింది. అయితే ఈ పవర్ ప్లాంట్ల పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కదిరి పవర్ ప్లాంట్లోని పనుల్లో దాదాపు 75 శాతం పనులు రెండేళ్ల కాలంలో పూర్తయ్యాయి. మిగతా 25 శాతం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మిగతా 25 శాతం పనులు వచ్చే ఏడాది ప్రథమాంకంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారులు ఈ పనులు కచ్చితంగా అనుకున్న సమయానికే పూర్తి చేసి తీరుతామని హామీ కూడా ఇస్తున్నారు. అంతే కాకుండా కర్నూల్, కడప జిల్లాల్లో చేపట్టిన రెండు పవర్ ప్లాంట్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగుల్లో ఒకింత ఉత్సహం నెలకొంది.సోలార్ పవర్ ప్లాంట్లు పూర్తయితే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని వారు ఆశపడ్తున్నారు. ఈ మూడు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు కూడా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తాయనే లక్ష్యంతో చేపట్టడం జరిగింది.ఈ ప్రాజెక్టులు పూర్తి అవడంతో ఈ లక్ష్యం నెరవేరనుంది.


kj reddy

రాయలసీమ ఆశా కిరణం- రాగ మయూరి ఎలక్ట్రానిక్ పార్క్

రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా పిలవబడ్డ ప్రాంతం. కర్నూల్, కడప, అనంతపూర్ మరియు చిత్తూర్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం విజయనగరం రాజైన శ్రీ కృష్ణదేవరాయల వారి పాలనలో గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతంగా విరాజిల్లింది.

అయితే పాలకుల నిర్ల్యక్షంతో ఒకప్పటి రతనాల సీమ ఇప్పుడు రాళ్ళ సీమ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయి రెండున్నరేళ్లు గడిచిపోయినా, రాయలసీమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోస్తా జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. దీంతో రాయలసీమ ప్రాంతం మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. అయితే రాయలసీమ ప్రాంతానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కేజే రెడ్డి గారి నేతృత్వంలోని కేజేఆర్ గ్రూప్ ఒక భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్ పేరే ఎల్సిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్. ఇది అనంతపూర్ జిల్లాలోని చిలమతుర్ గ్రామంలో ఏర్పాటు కాబోతోంది. ఈ పార్క్ ద్వారా 30,000 మందికి పైగా ఉపాధిని పొందనున్నారు. 2017 ఏడాది చివరికల్లా ఈ పార్క్ ను ప్రారంభించడానికి కేజేఆర్ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు రాయలసీమ ప్రాంతంలోని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతో కేజేఆర్ గ్రూప్ ఈ ఎలక్ట్రానిక్స్ పార్క్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ పార్కులో దేశ డిఫెన్సు రంగానికి సంబందించిన ఎలక్ట్రానిక్స్ విడి భాగాలతో పాటు, ఏరో స్పేస్ రంగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ విడి భాగాలను ఇతర సంస్థలతో కలిసి కేజేఆర్ గ్రూప్ తయారుచేయబోతోంది. ఎల్సిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ ను 50 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మించబోతున్నారు.ఇందులో 30-35 అంతస్తులు గల ఆకాశ హర్మ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాలమైన బిల్డింగులలో దాదాపు ఇరవై వేలాది మందికి పైగా ఉపాధి కల్పించనున్నారు. ఈ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, నీళ్లు, విద్యుచ్ఛక్తి వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. ఈ పార్క్ ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పేదరికం చాలా వరకు దూరమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, రాయలసీమ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి పార్క్ ఏర్పాటు తోడ్పడనుండి.


kj reddy

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న రాయలసీమ...!!!

రాష్ట్ర విభజన జరిగిన రెండున్నరేళ్లు గడిచిన తరవాత రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి పడిన బాటలు ఇప్పుడు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమస్యలని అధిగమించుకుంటూ రాయలసీమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు నుండి బయట పడడానికి ముందడుగు వేస్తుంది.

ఈ సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య ను రాయలసీమ త్వరలోనే అధిగమించనుంది. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల వారిలో ఒక రకమైన ఆశ,ఉత్సహం నెలకొంది. మొదట రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్ర పాలకులు చేసిన ఎన్నో వాగ్దానాలు ఇప్పటికీ వాగ్దానులాగానే మిగిలిపోయాయి అని సీమ ప్రాంత ప్రజలు అనుకున్నప్పటికీ,సి.ఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో రాయలసీమ ప్రాంతం ప్రగతి పథంలో దూసుకుపోనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతానికి చెందిన జిల్లాలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలకు ఇవ్వడం ఈ ప్రాంతంలోని యువత మరియు ఇతర రంగాలకు చెందిన వారిలో ఒకింత ఆశ్చర్యాన్నిమరియు ఆనందాన్నికూడా నింపుతుంది. వరుసగా గత ఐదేళ్ల నుంచి కరువు జిల్లాలుగా ఉన్న కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలు నమోదవుతున్న కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని హంద్రీనీవా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది, అంతే కాకుండా పట్టిసీమ మరియు పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తూ రాయలసీమ ప్రాంత ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను అంతం చేస్తుంది. రాయలసీమ అభివృద్ధికి చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనది. జాతీయ సంస్థలైన ఐఐటీ (IIT) , సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని ఈ ప్రాంత జిల్లాల్లో ఏర్పాటు చేయడం. అయితే ఈ వాగ్దానాల్లో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వంత జిల్లా అయిన చిత్తూరులో ఐఐటీ ఏర్పాటు జరిగింది. అంతే కాకుండా రాయలసీమ లోని మిగతా మూడు జిల్లాలైన కర్నూల్, కడప మరియు అనంతపూర్ లో కూడా జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు త్వరలోనే ప్రారంభం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. చిత్తూర్ లో ఐఐటీ, ఐఐఎం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు వివిధ స్థాయిల్లో ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్నాయి. అంతే కాకుండా అనంతపూర్ జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికి నెరవేరలేదు. కర్నూల్ జిల్లాలో ఐఐటీ (IIT) ఏర్పాటు చేస్తామని, కడప జిల్లాలో ఎయిమ్స్ వంటి అత్యున్నత వైద్య విద్యా సంస్థను నెలకొల్పుతామని పాలకులు హామీ ఇచ్చ్చారు. అయితే ఈ హామీ కేవలం హామీ గానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలోనే అమరావతి నుండి రాయలసీమ జిల్లాలకు రోడ్డు మరియు రైలు సౌకర్యాలను కూడా స్వీకారం చుట్టారు.అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో తాము ఎదుర్కొంటున్న కష్టాలు దూరమౌతాయని రాయలసీమ ప్రజలు ఆశిస్తున్నారు. రాయలసీమ ప్రజలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఐన కేజేఆర్ గ్రూప్ ద్వారా అనంతపూర్ జిల్లాలో నిర్మించబోతున్న ఎలక్ట్రానిక్స్ పార్క్ ఒక ఆశా కిరణంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పార్క్ ఏర్పాటుతో 20,000 మందికి పైగా రాయలసీమకు చెందిన నిరుద్యోగ యువకులు ఉపాధి పొందనున్నారు.