Futuristic Rayalaseema
About Leader
Job Portal

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న రాయలసీమ...!!!

kj reddy
రాష్ట్ర విభజన జరిగిన రెండున్నరేళ్లు గడిచిన తరవాత రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి పడిన బాటలు ఇప్పుడు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమస్యలని అధిగమించుకుంటూ రాయలసీమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు నుండి బయట పడడానికి ముందడుగు వేస్తుంది.
ఈ సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య ను రాయలసీమ త్వరలోనే అధిగమించనుంది. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల వారిలో ఒక రకమైన ఆశ,ఉత్సహం నెలకొంది.

మొదట రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్ర పాలకులు చేసిన ఎన్నో వాగ్దానాలు ఇప్పటికీ వాగ్దానులాగానే మిగిలిపోయాయి అని సీమ ప్రాంత ప్రజలు అనుకున్నప్పటికీ,సి.ఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో రాయలసీమ ప్రాంతం ప్రగతి పథంలో దూసుకుపోనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతానికి చెందిన జిల్లాలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలకు ఇవ్వడం ఈ ప్రాంతంలోని యువత మరియు ఇతర రంగాలకు చెందిన వారిలో ఒకింత  ఆశ్చర్యాన్నిమరియు ఆనందాన్నికూడా నింపుతుంది. వరుసగా గత ఐదేళ్ల నుంచి కరువు జిల్లాలుగా ఉన్న కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలు నమోదవుతున్న కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని హంద్రీనీవా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది, అంతే కాకుండా పట్టిసీమ మరియు పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తూ రాయలసీమ ప్రాంత ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను అంతం చేస్తుంది.

రాయలసీమ అభివృద్ధికి చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనది. జాతీయ సంస్థలైన ఐఐటీ (IIT) , సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని ఈ ప్రాంత జిల్లాల్లో ఏర్పాటు చేయడం. అయితే ఈ వాగ్దానాల్లో ఇప్పటికే   
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వంత జిల్లా అయిన చిత్తూరులో ఐఐటీ ఏర్పాటు జరిగింది. అంతే కాకుండా రాయలసీమ లోని మిగతా మూడు జిల్లాలైన కర్నూల్, కడప మరియు అనంతపూర్ లో కూడా జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు త్వరలోనే ప్రారంభం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. చిత్తూర్ లో ఐఐటీ, ఐఐఎం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు వివిధ స్థాయిల్లో ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్నాయి.

అంతే  కాకుండా అనంతపూర్ జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి  ఇప్పటికి నెరవేరలేదు. కర్నూల్ జిల్లాలో ఐఐటీ (IIT) ఏర్పాటు చేస్తామని, కడప జిల్లాలో ఎయిమ్స్ వంటి అత్యున్నత వైద్య విద్యా సంస్థను నెలకొల్పుతామని పాలకులు హామీ ఇచ్చ్చారు. అయితే ఈ హామీ కేవలం హామీ గానే మిగిలిపోయింది.

ఈ మధ్యకాలంలోనే  అమరావతి నుండి రాయలసీమ జిల్లాలకు రోడ్డు మరియు రైలు సౌకర్యాలను కూడా స్వీకారం చుట్టారు.అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో తాము ఎదుర్కొంటున్న కష్టాలు దూరమౌతాయని రాయలసీమ ప్రజలు ఆశిస్తున్నారు. రాయలసీమ ప్రజలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఐన కేజేఆర్ గ్రూప్ ద్వారా అనంతపూర్ జిల్లాలో నిర్మించబోతున్న ఎలక్ట్రానిక్స్ పార్క్ ఒక ఆశా కిరణంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పార్క్ ఏర్పాటుతో 20,000 మందికి పైగా రాయలసీమకు చెందిన నిరుద్యోగ యువకులు ఉపాధి పొందనున్నారు.