Futuristic Rayalaseema
About Leader
Job Portal

ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి 'ఆరోగ్య రక్ష' పథకం రాష్ట్ర ప్రజలకు వరం - ప్రారంభమైన పేర్ల నమోదు కార్యక్రమం

kj reddy
రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారి కోసం ‘ఆరోగ్య రక్ష’ అనే సరికొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ వినూత్న పథకాన్ని నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి ఒకటవ తేదీన విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే ప్రభుత్వ పరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య భీమా  కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 35 లక్షల కుటుంబాలకు నగదు రహిత  వైద్య సేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకంలో చేరడానికి అవసరమైన పేర్ల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకంలో చేరాలనుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న మీ-సేవ  కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చూ.  ‘ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకొనే ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1,200 చెల్లించాలి. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది ఈ పథకంలో చేరవచ్చుఁ. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్య సేవ అందుతుంది. పథకంలో చేరిన లబ్దిదారులకు  రాష్ట్రంలోని 432 ఆస్పత్రుల్లో 1,044 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది. ఈ పథకం కాలపరిమితి ఏడాది ఉంటుంది. ఆన్లైన్ లో తమ దరఖాస్తులు సమర్పించాలనుకునే వారు ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైటు లో లాగిన్ అయ్యి చేయవచ్చు. దరఖాస్తుదారులు అందరు తమ ఆధార్ కార్డు వివరాలను ఈ కార్డు పొందడానికి సమర్పించాల్సిఉంటుంది.  దరఖాస్తుల సమర్పణ అనంతరం 'ఆరోగ్య రక్షా' పధకాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన  ఆరోగ్య కార్డులు  సంబంధిత దరఖాస్తుదారులు పొందవచ్చు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పథకంలో చేరడానికి  వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీ ని చివరి తేడాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ ఆరోగ్య భీమా పథకం ముఖ్య ప్రయోజనం  ఏమిటంటే ఇందులో లబ్ధిదారులు కట్టే భీమా ప్రీమియం సొమ్ము,   ప్రైవేట్‌ భీమా  కంటే చాలా తక్కువ.  దారిద్య్ర రేఖ (బీపీఎల్‌)కు దిగువన ఉన్న కుటుంబాలు, ఉద్యోగులు, పాత్రికేయులకు ఇప్పటికే ఆరోగ్య కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలందరికి ఆదర్శనంగా నిలవడానికి ఈ ఆరోగ్య రక్ష పథకంలో సీఎం శ్రీ నారా చంద్రబబు నాయుడు గారు కూడా  తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకున్నారు.పథకానికి సంబందించిన  ఆరోగ్య కార్డును వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అందుకున్నారు. ఈ పథకంలో చేరాలనుకునే రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం పథకానికి సంబందించిన వెబ్సైటు లింకును ఇక్కడ ఇస్తున్నాం. 

http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx