Futuristic Rayalaseema
About Leader
Job Portal

ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: రిటర్నింగ్ ఆఫీసర్ కోన శశిధర్

kj reddy

త్వరలో జరుగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభధ్రులు, ఉపాధ్యాయుల స్థానాల ఎమ్మెల్సీ  ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ ఆఫీసర్, అనంతపూర్ జిల్లా కలెక్టర్   కోన శశిధర్‌ తెలిపారు. 

ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారి హైదరాబాద్ నుంచి  భన్వర్‌లాల్‌ కలెక్టర్లు, ఎస్పీలతో  వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ శశిధర్  మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కడప,. కర్నూల్ అనంతపూర్ జిల్లాలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్‌ పెట్టెలను భద్ర పరచడానికి, ఓట్ల లెక్కింపునకు స్థానిక  పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సెక్టోరల్  అధికారులు, ప్లయింగ్‌ స్వా్కడ్లకు మెజిస్టీరియల్‌ పవర్స్‌ కల్పించేందుకు జీఏడీకి ప్రతిపాదనలు పంపామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌, లెక్కింపు ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతపూర్ జిల్లా   ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూం వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు వచ్చే నెల మార్చి 9  వ తేదీన జరుగనున్నాయి.