Futuristic Rayalaseema
About Leader
Job Portal

జన్మ భూమి - మా ఊరు కార్యక్రమంలో కుటుంబ వికాసానికి 15 సూత్రాలకు శ్రీకారం చుట్టిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు

kj reddy
సమాజం పూలవనం లాంటిది - పూలవనంలోని ప్రతి పువ్వులా వ్యక్తి యొక్క శక్తి , వ్యక్తి వికాసంతోనే కుటుంబం వికసిస్తుంది. కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం, తద్వారా రాష్ట్రం , దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధితో విరబూస్తాయి,ఆర్థిక వృద్ధితో అనందం వెల్లివిరుస్తుంది. ఆ లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు  కుటుంబ వికాసానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ 15 సూత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాల్లో  "కుటుంబ వికాసం" అమలుకు అందరం అంకితమవుతూ రాష్ట్ర వికాసానికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు:
1) జీవన భద్రత - ఎన్.టి.ఆర్  భరోసా 
2) ఆహార భద్రత 
3) చంద్రన్న భీమా 
4) విద్యుత్ భద్రత 
5) దీపం పథకం 
6) మంచి నీటి భద్రత 
7) గృహ భద్రత 
8) ఆత్మ గౌరవం 
9) ఆరోగ్య  భద్రత 
10) విద్యా  భద్రత 
11) ఇంటింటా పశు సంపద 
12) ఉపాధి/ఉద్యోగ భద్రత 
13) సమాచార/సాంకేతిక విజ్ఞానం 
14) శాంతి భద్రతల పరిరక్షణ 
మహిళలకు భద్రత 
15) ప్రతి కుటుంబానికి రూ.10,000 కనీస ఆదాయం