Futuristic Rayalaseema
About Leader
Job Portal

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

kj reddy

336  పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు

ఓటు హక్కును వినియోగించుకోనున్న  2,49,582 ఓటర్లు

పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలైన కడప, కర్నూల్, అనంతపూర్ జిల్లాల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం మూడు జిల్లాల పరిధిలో  336  పోలింగ్  కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిదంగా.. పట్టభద్రుల  స్థానంతో పాటు జరుగునున్న  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం  ఎన్నికలకు 171 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు  ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రాల  జాబితాను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, అనంతపూర్జి ల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ బుధవారం విడుదల చేశారు.  

పట్టభద్రుల స్థానంలో తగ్గిన ఓటర్ల సంఖ్య:

                        హోరాహోరీగా జరుగుతున్ప ఈ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. , ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల కూడా ఈసారి తగ్గింది. పట్టభద్ర స్థానానికి చెందిన  ఓటర్లు 3,933  తగ్గగా   ఉపాధ్యాయ ఓటర్లు 129 మంది తగ్గారు. ఇప్పటివరకు ఈ రెండు స్థానాలకు సంబందించిన తుది జాబితాలో 2,53,515 మంది పట్టభద్ర ఓటర్లు, 20,644 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండేవారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అనర్హుల తొలగింపు, కొత్తగా ఓటర్ల చేర్పు ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ తర్వాత పట్టభద్ర ఓటర్లు 2,49,582 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 1,72,962, మహిళా ఓటర్లు 76,611 మంది, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 20,515 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 13,294, మహిళా ఓటర్లు 7,220 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.

జిల్లాల వారీగా పట్టభద్ర నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు. 

జిల్లా                      మొత్తం    

వైఎస్‌ఆర్‌                 105    

అనంతపురం            119    

కర్నూలు                   112    

మొత్తం                      336    

ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు

జిల్లా                       మొత్తం    

వైఎస్‌ఆర్‌                52    

అనంతపురం          65    

కర్నూలు                  54    

మొత్తం                   171