Futuristic Rayalaseema
About Leader
Job Portal

రాయలసీమ ఆశా కిరణం- రాగ మయూరి ఎలక్ట్రానిక్ పార్క్

kj reddy
రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమగా పిలవబడ్డ ప్రాంతం. కర్నూల్, కడప, అనంతపూర్ మరియు చిత్తూర్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం విజయనగరం రాజైన శ్రీ కృష్ణదేవరాయల వారి పాలనలో గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతంగా విరాజిల్లింది.
అయితే పాలకుల నిర్ల్యక్షంతో ఒకప్పటి రతనాల సీమ ఇప్పుడు రాళ్ళ సీమ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయి రెండున్నరేళ్లు గడిచిపోయినా, రాయలసీమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోస్తా జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. దీంతో రాయలసీమ ప్రాంతం మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతోంది.

అయితే రాయలసీమ ప్రాంతానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కేజే రెడ్డి గారి నేతృత్వంలోని కేజేఆర్ గ్రూప్ ఒక భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్ పేరే ఎల్సిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్. ఇది అనంతపూర్ జిల్లాలోని చిలమతుర్ గ్రామంలో ఏర్పాటు కాబోతోంది. ఈ పార్క్ ద్వారా 30,000 మందికి పైగా ఉపాధిని పొందనున్నారు.

2017 ఏడాది చివరికల్లా ఈ పార్క్ ను ప్రారంభించడానికి కేజేఆర్ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు రాయలసీమ ప్రాంతంలోని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతో కేజేఆర్ గ్రూప్ ఈ ఎలక్ట్రానిక్స్ పార్క్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.

ఈ పార్కులో దేశ డిఫెన్సు రంగానికి సంబందించిన ఎలక్ట్రానిక్స్ విడి భాగాలతో పాటు, ఏరో స్పేస్ రంగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ విడి భాగాలను ఇతర సంస్థలతో కలిసి కేజేఆర్ గ్రూప్ తయారుచేయబోతోంది. ఎల్సిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ ను 50 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మించబోతున్నారు.ఇందులో 30-35 అంతస్తులు గల ఆకాశ హర్మ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాలమైన బిల్డింగులలో దాదాపు ఇరవై వేలాది మందికి పైగా ఉపాధి కల్పించనున్నారు.

ఈ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, నీళ్లు, విద్యుచ్ఛక్తి వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. ఈ పార్క్ ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పేదరికం చాలా వరకు దూరమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, రాయలసీమ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి పార్క్ ఏర్పాటు తోడ్పడనుండి.