Futuristic Rayalaseema
About Leader
Job Portal

సీమకు పర్యాటక శోభ తేవడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం:

kj reddy
రాయలసీమకు త్వరలోనే పర్యాటక శోభ రానుంది. 
అబ్బుర ప్రముఖ రాజ కోటలు,అద్భుతమైన పుణ్య క్షేత్రాలు, మైమరిపించే వారసత్వ సంపద, ఆహా అనిపించే బెలుం గుహలు ,లేపాక్షి శిల్పాలు ఇలా ఎన్నెన్నో పర్యటక క్షేత్రాలకు నిలయమైన రాయలసీమకు హెరిటేజ్ సర్కూట్ గా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 

స్వదేశీ పథకం కింద: 
*కడప జిల్లాలోని గండికోట
*అనంతపురం జిల్లాలోని గుత్తికోట
* పెనుగొండ కోట 
*లేపాక్షి ఆలయం 
*తాడిపత్రి ఆలయం
*బుగ్గ రామేశ్వర ఆలయం 
*చింతల వెంకటేశ్వర ఆలయం
* బెలుం గుహలు 
  
ప్రసాద్ కింద శ్రీశైలం:
దేశంలోని 20 పుణ్య  క్షేత్రాలలో  శ్రీశైలం ప్రసాద్ పథకంలో ఒకటిగా ఎంపిక అయింది. ఈ  క్షేత్రానికి మెరుగైన సౌకర్యాలతో పాటు, అక్కడ ఉన్న అవకాశాలను బట్టి అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు.  
ఎలాంటి అభివృద్ధి జరగనుంది:
*స్వదేశీ దర్శన్ కింద పంపిన ఈ ప్రతి పాదనలు ద్వారా ఒక్కో క్షేత్రంలో 20 కోట్లతో యాత్రికులకు సౌకర్యాలు  కల్పిస్తారు.
*ఈ క్షేత్రాల్లో మ్యూజియంలు, కన్వెన్షన్ హాళ్లు, థీమ్ పార్కులు, సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారు.
*అవకాశం ఉన్న చోట బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
*అంతే కాకుండా కోటలు, ఆలయాలు, గుహల సమీపంలో  పర్యాటకాన్ని అనుకూలంగా ఉండే ప్రదేశాలను అభివృద్ధి పరచి పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూస్తారు.