Futuristic Rayalaseema
About Leader
Job Portal

సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభంతో రాయలసీమకు చెందిన నిరుద్యోగుల జీవితాల్లో చిగురించిన ఆశలు:

kj reddy
సోలార్ పవర్ ప్లాంట్లపై రాయలసీమ చెందిన నిరుద్యోగుల పెట్టుకున్న ఆశలు త్వరలోనే తీరబోతున్నాయి. ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం అనంతపురం,కర్నూల్, కడప జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. దీంతో దాదాపు 5000 నుండి 10,౦౦౦ మంది నిరుద్యోగులకు ఉపాధి కలగనుంది. ఇందుకు ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రాయలసీమ లోని కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2500 MW సామర్థ్యం గల
సోలార్ పవర్ ప్లాంట్ల పనులు త్వరలోనే పూర్తికానుండడమే. ఈ మూడు ప్రాజెక్టులను 'అందరికి విద్యుత్తు' అన్న పథకంలో భాగంగా చేపడుతున్నామని 2014 సెప్టెంబర్లో జరిగిన కాబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

మూడు పవర్ ప్రాజెక్టుల్లో 1000 MW సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ను అనంతపూర్ జిల్లాల కదిరి లో, 1000 MW ప్రాజెక్ట్ ను కర్నూల్ జిల్లా పాణ్యంలో, 500MW ప్రాజెక్ట్ ను కడప జిల్లా జమ్మలమడుగు లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకోసం అవసరమైన భూకేటాయింపులను కూడా ప్రభుత్వం వెంటనే చేసింది. అనంతపూర్ జిల్లా కదిరిలోని పవర్ ప్లాంట్ కు 5500 ఎకరాల భూమిని, కర్నూల్ జిల్లా పాణ్యంలోని పవర్ ప్లాంట్ కు 5000 ఎకరాల భూమిని, కడప జిల్లా జమ్మలమడుగు లోని పవర్ ప్లంట్ కు 3000 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతటితో ఆగకుండా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఎంఓయూ (MoU) లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది.

అనంతపూర్ లోని కదిరి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని జాతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి అప్పగించింది. అయితే ఈ పవర్ ప్లాంట్ల పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కదిరి పవర్ ప్లాంట్లోని పనుల్లో
దాదాపు 75 శాతం పనులు రెండేళ్ల కాలంలో పూర్తయ్యాయి. మిగతా 25 శాతం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మిగతా 25 శాతం పనులు వచ్చే ఏడాది ప్రథమాంకంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక అధికారులు ఈ పనులు కచ్చితంగా అనుకున్న సమయానికే పూర్తి చేసి తీరుతామని హామీ కూడా  ఇస్తున్నారు. అంతే కాకుండా కర్నూల్, కడప జిల్లాల్లో చేపట్టిన రెండు పవర్ ప్లాంట్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీంతో  నిరుద్యోగుల్లో ఒకింత ఉత్సహం నెలకొంది.సోలార్ పవర్ ప్లాంట్లు పూర్తయితే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని వారు ఆశపడ్తున్నారు. ఈ మూడు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు కూడా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తాయనే లక్ష్యంతో చేపట్టడం జరిగింది.ఈ ప్రాజెక్టులు పూర్తి అవడంతో ఈ లక్ష్యం నెరవేరనుంది.