Futuristic Rayalaseema
About Leader
Job Portal

BHIM యాప్ ని రిలీజ్ చేసిన నరేంద్ర మోడీ

kj reddy
నోట్ల రద్దు తరవాత డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహిస్తూ  ప్రధాని నరేంద్ర మోడి BHIM యాప్ ను విడుదల చేశారు. 
1) BHIM యాప్ తో వినియోగదారులు ఏ ఇతర బ్యాంక్ ఖాతాలకు అయినా నగదు బదిలీ చేయవచ్చు. ఇతరులు (డబ్బు తీసుకునే వాళ్ళు) BHIM యాప్ ఉపయోగించనప్పటికీ  వారికీ ఖాతాలకు నగదు జమ చేయవచ్చు.

2) మరొక ప్రయోజనం ఈ అప్లికేషన్ ద్వారా డబ్బు పంపడం లో ఎటువంటి పరిమితి లేదు, మీరు మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎంత మొత్తన్ని అయితే బదిలీ చేయగలరో అంతే డబ్బును ఇతరులకు పంపవచ్చు.

3) భీమ్ యాప్ నేరుగా మన బ్యాంకు ఖాతాలతో అనుసంధానించబడుతుంది.
4) ఇతర ముఖ్యమైన ప్రయోజనం మనం అధార్ నమోదు సమయంలో అందించిన వేలు ముద్రలను  ఉపయోగించడం ద్వారా బిల్లులు చెల్లించవచ్చు.