Futuristic Rayalaseema
About Leader
Job Portal
kj reddy

ఏడాదిలోపు అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా  త్వరలోనే  ఎల్ఈడీ దీపాల వెలుగులతో నిండిపోనుంది

వచ్చే  ఏడాదిలోగా ప్రతీ గ్రామంలో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

 ఎల్‌ఈడీ దీపాల కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి అమరావతిలో ఆయనప్రారంభించారు.  వెలగపూడి, మందడం గ్రామాలకు చెందిన పలువురికి ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లను ఈ సందర్బంగా అయన అందజేశారు.  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని  ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్బు, ట్యూబ్‌లైట్‌తోపాటు ఇంధన పొదుపు సామర్థ్యం కలిగిన ఫ్యాను ఉండే విధంగా చూస్తామని అయన అన్నారు. ఈ మేరకు సంబంధిత  అధికారులకు ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ ఈ వెలుగులు తీసుకెళ్లడానికి 30 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అవసరం అవుతాయని చంద్రబాబు అన్నారు. ఈ దీపాలను పెట్టడానికి సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడిఅవసరమవుతుందన్నారు.

    ఎల్‌ఈడీ దీపాల వినియోగంతో గ్రామా పంచాయతీల్లో 40 శాతం మేర విద్యుత్‌ ఆదాకు అవకాశముంటుందని ఆయన అన్నారు. ఎల్‌ఈడీ బల్బుల వాడకంలో ప్రపంచంలోనే తాము ముందు నిలిచామని పేర్కొన్నారు.  ఎల్ఈడీ దీపాల కోసం  అవసరమైన     పెట్టుబడి పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంధన పొదుపు సేవల సంస్థ ముందుకు వచ్చింది. 


kj reddy

ఈ నెల 15 న రాష్ట్ర బడ్జెట్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  బడ్జెట్‌ ను ఈ నెల 15  న  శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.

ముందుగా నిర్ణయించిన మేరకు సోమవారం నాడు సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నేత, కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం     ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం వాయిదాపడింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉభయ సభలకు సెలవు ప్రకటించింది. మంగళవారం  రాష్ట్ర శాసనసభ, శాసనమండలి లు   నాగిరెడ్డి మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆయా సభలలో  ఆమోదిస్తాయి. అనంతరం ఉభయ సభలు వాయిదాపడతాయి. ఉభయ సభల్లో  రాష్ట్ర బడ్జెట్‌ ఫలానా తేదీన ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాక... అది వాయిదాపడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించటంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలనుకున్న రోజున సెలవు ప్రకటించాల్సి వచ్చింది. గవర్నర్‌ అనుమతితో బుధవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.


kj reddy

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంకై రూ 152 కోట్లు పనులకు అనుమతులు మంజూరు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రూ.152 కోట్ల పనుల కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి సోమవారం పరిపాలన అనుమతి లభించింది. 

హడ్కో నుంచి తక్కువ వడ్డీకి తీసుకున్న రుణం నుంచి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో ముందస్తుగా చేపట్టే మౌలిక సదుపాయాలు, అలంకార్‌ ధియేటర్‌ వద్ద వంతెన నిర్మాణం కోసం రూ.152 కోట్లు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలపై అనుమతులిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవెన్‌ ఆదేశాలు జారీ చేశారు.


kj reddy

పకడ్బందీగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

 అధికారులకు  స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ రావు ఆదేశాలు 

ఈ నెల 6  వ  తేదీ నుంచి ప్రారంభమౌతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను  పకడ్బందీగా నిర్వహించాలని శాసనసభ సభాపతి శ్రీ కోడెల శివప్రసాదరావు అధికారులను  ఆదేశినాచారు.  ఈ అంశంపై  అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో అయన వేర్వేరుగా సమీక్షించారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని వెలగపూడిలో తొలిసారి సమావేశాలు జరగనున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన  ఆదేశయించారు. తొలిసారి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కోడెల  అసెంబ్లీ లోపల, బయటా కలియతిరిగి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 6వ తేదీ ఉభయ సభల(శాసనసభ, శాసనమండలి)ను ఉద్దేశించి రాష్ట్ర  గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం చేయనున్నారు. ఆ మరుసటి రోజు, మార్చి 7న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఉంటుంది.

    రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 12 వ తేదీ వరకూ బడ్జెట్ సమావేశాలకు   సెలవులు ఇవ్వనున్నారు. ఈ  13న రాష్ట్ర బడ్జెట్‌ ను  ఆర్థిక   మంత్రి    యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టే అవకాశముంది.


kj reddy

సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర శాసనసభ నూతన భవనం ప్రారంభం

రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇఛ్చిన  ముఖ్యమంత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ, కౌన్సిల్  భవనాల  ప్రాంగణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ  సభ ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు, రాష్త్ర శాసనమండలి చైర్మన్ శ్రీ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభను ఉద్ద్యేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం 192  రోజుల వ్యవధిలోనే  శాసనసభ, శాశనమండలి భవనాలను నిర్మించిన అధికారులకు అభినందనలు  తెలిపారు .  రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32000  వేల ఎకరాలకు పైగా వ్యవసాయ  భూములను స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అప్పజెప్పిన  రైతులకు ఆయన ఈ సందర్బంగా పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు.  

           రాష్ట్ర రాజధానిని రానున్న రోజుల్లో దేశమంతా గర్వించే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని  ఆయన ఈ  సందర్బంగా ప్రజలకు హామీ ఇచ్చారు.39  సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని శ్రీ చంద్రబాబు  ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతంగా పూర్తి చేయడానికే  తానూ, హైదరాబాద్ నుంచి తన మకాం ను రాష్ట్ర  రాజధానికి మార్చానని, ఇలా మారడం వల్లే సచివాలయం, అసెంబ్లీ భవనాలను  త్వరగా  పూర్తి చేసుకోగలిగామని  అన్నారు. రాష్ట్ర రాజధానికి అనుబంధంగా  9  నగరాలను, 27  టౌన్ షిప్లను ను అభివృద్ధిపరుస్తామని సీఎం అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఇమేజిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరముందని చంద్రబాబు ఈ సందర్బంగా నొక్కిచెప్పారు. లోటు బడ్జెట్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనేక రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలించిందని అయన ఈ సందర్బంగా అన్నారు విభజన వల్ల రాష్ట్రము ఎంతో నష్టపోయిందని వెల్లడించిన అయన, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్  వన్ గా నిలబెట్టడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన  హామీ ఇచ్చారు.  రానున్న రోజుల్లో వెనకబడ్డ రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక ద్రుష్టిసారిస్తానని చంద్రబాబు అన్నారు.            

            రాయలసీమతో పాటు, ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికై కూడా కృషి చేస్తానని కూడా ఆయన అన్నారు. రాష్ట్ర రాజధానిలో నడక-ఉద్యోగం కల్చర్ ను ప్రోత్సహిస్తానని అయన ఈ సందర్బంగా తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి విద్య సంస్థలు, వైద్య సంస్థలను రాష్ట్ర రాజధానిలో నెలకొల్పుతామమని అయన ఈ సందర్బంగా వెల్లడించారు.  


kj reddy

ఎమ్మెల్సీ పదవికి నారా లోకేశ్‌ అన్ని విధాలా అర్హుడు: నందమూరి బాలకృష్ణ

పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి   చేశారని  పొగడ్తల వర్షం   

ఎమ్మెల్యే కోటాలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా  పోటీచేస్తున్న తన అల్లుడు,పార్టీ యువ నాయకుడు  నారా లోకేశ్‌ ఆ పదవికి అన్ని విధాలా అర్హుడని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు  నందమూరి బాలకృష్ణ అన్నారు.ఈ  అంశంపై  అయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు  పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం  లోకేశ్‌ ఎంతగానో పాటుపడుతున్నారని, ప్రజాప్రతినిధి గా ఆయన ప్రజా సమస్యల పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉంటారన్నారు. తన అల్లుడు లోకేశ్‌ మొదట్నుంచీ పార్టీ కార్యక్రమాల కోసం కష్టపడుతున్నారని, ఎమ్మెల్సీ పదవితో ఆయన బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. తన తండ్రి, రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న లోకేష్ రాజకీయాల్లో బాగా రాణిస్తారని బాలకృష్ణ అన్నారు.  

       లోకేష్ ను ఎమ్మెల్యే కోటాలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో ఇటీవలే నిర్ణయించిన సంగంతి మనందరికీ తెలిసిందే. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడుతూ టీడీపీ  తీసుకున్న నిర్ణయానికి ఆ యన పార్టీ అధ్యక్షునికి తన కృతజ్ఞతను తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని లోకేష్  ఈ సందర్బంగా అన్నారు. 


kj reddy

శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రవేశించనున్న నారా లోకేష్!

పార్టీ యువనాయకునికి శాసనసభ్యుల కోట కింద టికెట్ ఇవ్వాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం 

 

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్‌ ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టనున్నారు. ఆయనకు రాష్ట్ర  శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా టిక్కెట్‌ ఇవ్వాలని అధికార తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది.  ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా  చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో  ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక  విషయం  ప్రస్తావన వచ్చింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కసరత్తు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు. ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలో ముఖ్యమంత్రికి స్పష్టత ఉన్నందున దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్సీల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రికే వదిలిపెట్టాలని  టీడీపీ పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది.

                               నారా లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అంశంపై తీర్మానిద్దామని ఆంధ్రప్రదేశ్‌ తెదేపా అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రతిపాదించగా ఇందుకు పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా మద్దతు తెలిపారు. సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లోకేష్‌కు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎంపికైన  అనంతరం నారా లోకేష్ ను రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీలోని కొందరు నేతలు తెలియజేశారు. 


kj reddy

యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం

రెండేళ్లలో పది లక్షల ఇళ్ల నిర్మాణం 

అన్ని కార్పొరేషన్లలో ఎన్టీఆర్‌ క్యాంటీన్లు 

 

రెండేళ్లలో పది లక్షల ఇళ్ల నిర్మాణం 

అన్ని కార్పొరేషన్లలో ఎన్టీఆర్‌ క్యాంటీన్లు 

పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని అధికార తెలుగుదేశం పార్టీ  పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వారి విద్యార్హతను బట్టి నెలకు రూ.వేయి నుంచి రూ.2000 వరకు ఇవ్వాలని, వారిని సామాజిక సేవా కార్యక్రమాల్లో వినియోగించుకునేలా విధానం రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఆదివారం ఉండవల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగింది.

      ఈ సమావేశంలో మొత్తం  17 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అమెరికాలో తెలుగువారిపై దాడులు వంటి అంశాలపైనే ఎక్కువగా చర్చించారు. సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. వాటిని సమావేశానంతరం సోమిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో పేదలకు పది లక్షల ఇళ్లు నిర్మించాలని  పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని, ఈ ఇళ్లను  2019లోగా పూర్తి చేసేలా చూడాలని ప్రభుత్వానికి సూచించిందని వారు తెలిపారు.  అంతేకాకుండా  తొలి విడతలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఎన్టీఆర్‌ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనీ కూడా పొలిట్‌బ్యూరో తీర్మానించింది.

      గత నెల రాష్ట్రంలో జరిగిన  భాగస్వామ్య సదస్సులో రూ.10.55 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదరడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది.  అంతేకాకుండా, రాష్ట్రంలో నిర్వహించిన  జాతీయ మహిళా పార్లమెంటు, భాగస్వామ్య సదస్సు రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించేలా జరిగాయని ప్రభుత్వానికి అభినందనలు తెలియచేసింది.  


kj reddy

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార టీడీపీ అభ్యర్థి శ్రీ కే.జే.రెడ్డి

త్వరలో  జరుగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి సంబందించిన ఎన్నికల ప్రచారంలో  అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కే.జే.రెడ్డి గారు  దూసుకుపోతున్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోనని అంతేకాకుండా  తనకు ఆరేళ్ళ కాలానికి జీతంగా లభించే 1 .08  కోట్ల రూపాయలను రాయలసీమ కు చెందిన నిరుద్యోగ  యువతకు   ఉపాధి కల్పించడానికి ఉపయోగిస్తానని ప్రకటించి ఆయన రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. తాను  చేసిన ఈ  ప్రకటనతో రాయలసీమలోని నిరుద్యోగ యువతను తనవైపు తిప్పుకోవడంలో శ్రీ కే.జే.రెడ్డి ఘన విజయం సాధించారని రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన  సంచలన ప్రకటనతో  తన రాజకీయ ప్రత్యర్థులకు కనీసం కంటి మీద కునుకు కూడా లేకుండా  ఆయన చేశారని వారు అన్నారు.  శ్రీ కే.జే.రెడ్డి గారు చేసిన ఈ ప్రకటన తర్వాత ఆయనకు అన్ని వర్గాల ఓటర్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇందుకు ఇటీవలే ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి అనంతపూర్ పట్టణంలో  నిర్వహించిన  కార్యక్రమమే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కడప, కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున స్వచ్చందంగా  పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత మూడేళ్ళ  కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని శ్రీ కే.జే.రెడ్డి గారు ఏ సందర్బంగా  గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 25  మంది తుది బరిలో నిలిచారు. 


kj reddy

అట్టహాసంగా తన నామినేషన్ ను దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ కేజే రెడ్డి

భారీ బైక్ ర్యాలీ మధ్య  అనంతపూర్ కలెక్టరేట్ కు పయనం.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, ఎం ఎల్సీ  అభ్యర్థి  కే జె రెడ్డి,  ZP చైర్మన్  చామంసాబ్,మేయర్  మాధమంచి స్వరూప, ఎంఎల్ఏ  లు బి.కె పార్తసారథి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, కర్నూల్ ఎంఎల్ఏ  జయనాగేశ్వర రెడ్డి, ఎస్ వి మోహన్ రెడ్డి, రాజ్యసభ మెంబెర్ టి.జి   వెంకటేష్, మంత్రి కె ఈ కృష్ణమూర్తి సోదరుడు కె ఈ ప్రతాప్ ల   సమక్షంలో జిల్లా  కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు సమర్పణ.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రముఖ పారిశ్రామిక శ్రీ కేజే రెడ్డి గారి
నామినేషన్ దాఖలు కార్యక్రమం సోమవారం  అనంతపూర్ జిల్లాలో అట్టహాసంగా జరిగింది. జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ  కొల్లు రవీంద్ర, జిల్లాకు చెందిన మంత్రులు, శ్రీ పల్లె రఘునాథ రెడ్డి, శ్రీ పరిటాల సునీత, కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ శ్రీ టీజీ వెంకటేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ కాలువ శ్రీనివాసులు, విప్ యామిని బాల,  అనంతపూర్, కర్నూల్, కడప జిల్లాలకు చెందిన పార్టీ  ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు  కార్యక్రమంలో భారీఎత్తున  పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు శ్రీ కేజే రెడ్డి అనంతపూర్ పట్టణంలో ఒక భారీ బైక్ ర్యాలీ ని నిర్వహించారు. ఈ ర్యాలీ, టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి, టవర్ సర్కిల్, సప్తగిరి  సర్కిల్  మీదుగా జిల్లా కలెక్టర్, కార్యాలయం వరకు సాగింది. ఈ బైక్ ర్యాలీ కి తెలుగు యువత జిల్లా  అధ్యక్షుడు తమ్మినేని పవన్ కుమార్ నేతృత్వం వహించారు.ఇందులో వందలాది మంది పార్టీ కార్యకర్తలు,
తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.  అనంతరం .మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  తోడురాగా   ఆర్ట్స్ కళాశాల సమీపంలో గల పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీ కేజే రెడ్డి నివాళులు అర్పించారు. ఆ తర్వాత, రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో అయన తన నామినేషన్ పత్రాలను, అనంతపూర్ జిల్లా కలెక్టర్  కు సమర్పించారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం,మంత్రులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు
నాయుడు గారు ప్రజారంజక పాలనను అందిస్తున్నారని. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే  తమ ప్రభుత్వానికే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి  కల్పించి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, రాష్ట్ర సీఎం నిరంతర  కృషి చేస్తున్నారని,అంతేకాకుండా సమాజంలోని అన్ని వర్గాల సమాన అభివృద్దే ద్వేయంగా అయన పనిచేస్తున్నారని ఈ సందర్బంగా మంత్రులు నొక్కిచెప్పారు. ఇప్పటికే శ్రీ
చంద్ర బాబు నాయుడుగారి చొరవతో అనేక కంపెనీలు రాష్ట్రానికి  వచ్చాయని వీటి వల్ల వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వారు తెలిపారు. తమ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ. వచ్చే ఎన్నికల్లో  భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నారని ఈ సందర్బంగా  మంత్రులు
 ఆశాభావము వ్యక్తం చేశారు. 
Reference Links:
http://epaper.andhrajyothy.com/c/17009633
http://epaper.andhrajyothy.com/c/17009719
http://epaper.andhrajyothy.com/c/17009846
http://epaper.andhrajyothy.com/c/17009909
http://epaper.andhrajyothy.com/c/17009960
http://epaper.andhrajyothy.com/c/17010066
http://epaper.andhrajyothy.com/c/17010213
http://epaper.prajasakti.com/1112284/Ananthapuram/Ananthapuram#page/1/2
http://epaper.prajasakti.com/c/17010602
http://epaper.prabhanews.com/c/17010866
http://epaper.prabhanews.com/c/17010970
http://epaper.prabhanews.com/c/17011136
http://epaper.prabhanews.com/c/17011244
http://epaper.vaartha.com/c/17013596
http://epaper.vaartha.com/c/17013664
http://epaper.vaartha.com/c/17013690


kj reddy

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీ కేజేరెడ్డిని గెలిపించాలని

మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ పిలుపు

రానున్న  పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెదేపా బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కేజేే రెడ్డికి ఓటువేసి గెలిపించాలని మాజీ మంత్రి,  రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి శ్రీ కేజే రెడ్డి తో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటికే రాయలసీమ  ప్రాంతంలో ప్రముఖ  పారిశ్రామికవేత్తగా పేరును సంపాందించిన  కేజే రెడ్డి ఈ ప్రాంత   అభివృద్ధి దిశగా పనిచేస్తారని, అంతేకాకుండా ఆయన  ఎటువంటి ఫ్యాక్షన్‌ గొడవలకు సంబంధం లేనివారని ఈ సందర్బంగా వెల్లడించారు. పశ్చిమ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి సీమగా మార్చడానికి కేజే రెడ్డి కృషిచేస్తారని టీజీ వెంకటేష్ ఓటర్లకు హామీ ఇచ్చారు. అర్హులైన వ్యక్తులకు ఓటు వేయడంతో ప్రాంతాలు బాగుపడతాయన్నారు ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అర్హులైన ఓటర్లకు ఈ విషయాన్ని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో కేజే రెడ్డి మాట్లాడుతూ. ప్రజలందరి  సహకారంతో తాను ముందుకు సాగుతానని, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.  కర్నూలులో సహకరించినట్లుగానే, మిగతా జిల్లాల్లో ని ఓటర్లు, పార్టీ కార్యకర్తలు తనకు  మద్దతు తెలిపి తెదేపా గెలుపునకు పాటుపడాలని అయన ఈ సందర్బంగా కోరారు. టీడీపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం ఉదయం 10:30 గంటలకు నామినేషన్‌ దాఖలు
చేయనున్నట్లు అయన వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇస్తూ పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కేడీసీసీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, క్రిస్టియన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు బాబురాజు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


kj reddy

కర్నూల్ జిల్లాలోని సోలార్ పార్కు ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంత జిల్లా ఐన  కర్నూలులో  నిర్మిస్తున్న గనిశకునాల సోలార్ (సౌర)  పార్కు ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఈ విషయాన్నీ  రాష్ట్ర ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ స్వయంగా  వెల్లడించారు. ఈ పార్కును దేశ ప్రధాని ప్రారంభించే అవకాశాలు ఉన్నందునే  తాము దాన్ని వేగంగా పూర్తిచేసే  ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనీ  ఆయన తన శాఖ  అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు  రాష్ట్ర రాజధాని అమరావతి లో ని  వెలగపూడి లోగల సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ సౌర విద్యుత్‌ సంస్థ అధికారులు ఆదిశేషు, విఎస్‌ఆర్‌ నాయుడు, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎండీ కమలాకరబాబు, ఏపీట్రాన్స్‌కో డైరెక్టర్‌ సుబ్రమణ్యంతో  అయన సమావేశమయ్యారు. . గనిశకునాల సోలార్ ప్రాజెక్టు సామర్థ్యం వెయ్యి మెగావాట్లు అని..  దీన్ని అధికారులు  వెంటనే పూర్తిచేయాలని అజయ్‌జైన్‌ కోరారు. అదేవిధంగా  కడప జిల్లా గాలివీడు, మైలవరంలో ప్రతిపాదిత సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల పనులను  కూడా  త్వరగా ప్రారంభించాలని ఆయన అధికారులను కోరారు.  మే నెల నాటికి రాష్ట్రంలో అదనంగా 2వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అయన సంబంధిత  అధికారులను ఆదేశించారు. 


kj reddy

విజయవాడ లో తొమ్మిది ఐటీ కంపెనీలను ప్రారంభించిన రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు

650  మందికి  ఉపాధి కల్పించనున్నఐటీ  సంస్థలు  

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కి అతి చేరువైన నగరం విజయవాడ. ఈ నగరం ఇప్పుడు క్రమక్రమంగా ఐటీ నగరంగా రూపుదిద్దుకుంటోంది. విజయవాడలోని  ఆటో నగర్‌లో తొమ్మిది ఐటీ కంపనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక  ఇండ్వెల్ టవర్ లో నెలకొల్పబడ్డ ఈ తొమ్మిది కంపెనీలను రాష్ట్ర  సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు  ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ ఎనిమిది ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చి 650మందికి ఉద్యోగాలిస్తున్నారని, ఇది చాలా ఆనందకరమైన విషయమన్నారు. ఈ కంపెనీల ఏర్పాటు  ప్రారంభం మాత్రమేనని.. చాలా కంపెనీలు విజయవాడకు వచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని అయన అన్నారు. తన హయాంలో ప్రస్తుత  తెలంగాణ రాష్ట్ర రాజధాని ఐన హైదరాబాద్ నగరం ఏ విదంగానైతే అభివృద్ధి చెందిందో అదేవిదంగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజధాని అమరావతి ని అభివృద్ధి చేస్తానని అయన ఈ సందర్బంగా ప్రకటించారు. 


kj reddy

రాజకీయాల్లో తన విలక్షణతను చాటుకున్న టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ కేజే రెడ్డి

ఎమ్మెల్సీ గా ఎన్నికైతే ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని నిరుద్యోగులకు విరాళంగా ఇస్తానని ప్రకటన 

తాను మిగతా రాజకీయ నాయకులలాంటి నాయకుడు కాదని రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్నూల్ ,అనంతపూర్, కడప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నుంచి అధికార టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న శ్రీ  కేజే రెడ్డి నిరూపించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తనకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం మొత్తాన్ని నిరుద్యోగ యువతకు విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ గా ఉండే ఆరేళ్ళ కాలానికి రూ 1 .08 కోట్లు జీతంగా తనకు లభిస్తుందని ఈ మొత్తాన్ని రాయలసీమ ప్రాంతంలోని  నిరుద్యోగ యువత అభ్యున్నతికి ఉపయోగిస్తానని అయన ప్రజల సమక్షంలో ప్రకటించారు.  నిరుద్యోగ యువతకు వివిధ రకాలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అవసరమయ్యే ఫీజులను చెల్లించడానికి తన జీతాన్ని ఉపయోగిస్తానని ఆయన వెల్లడించారు. దేశంలోని ఏ నాయకుడు కూడా ఇలాంటి గొప్ప  ప్రకటనను చేయలేదు. తన ఈ ప్రకటనతో ఒక సరిక్రొత్త రాజకీయ ఒరవడికి శ్రీ కేజే రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి రావడంతోటే అక్రమ సంపాదనకు అలవాటుపడే నాయకులుండే నేటి సమాజంలో రాజకీయమనేది ప్రజలకు సేవచేయడానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనమని అయన తన ప్రకటనతో నిరూపించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక యువకుడు మీరు కూడా ఇతర రాజకీయ నాయకుల లాగా డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లో వస్తున్నారా అని వేసిన ప్రశ్నకు జవాబుగా శ్రీ  కేజే రెడ్డి ఈ ప్రకటనను చేశారు. పారిశ్రామిక వేత్తగాఎన్నో విజయాలు సాధించిన తనకు ఇక జీవితాంతం ప్రజా సేవ  చేయడమే మిగిలిందని అయన బాహాటంగా ప్రకటించారు. 


kj reddy

ఇల్లు లేని పట్టణ వాసులకు క్రొత్త పథకాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

వెయ్యి రూపాయలు కట్టిన వారికి ఇల్లు కట్టివ్వనున్న సర్కారు.

లబ్దిదారులకు   సులభ వాయిదాల్లో  బ్యాంకు నుంచి లోను సౌకర్యం  

ఒక్కో ఇంటిపై మూడు లక్షల రూపాయల సబ్సిడీ, ఏడాదిన్నర కాలంలో 1 .2  లక్షల ఇళ్ల నిర్మించనున్న సర్కారు. 

ఇల్లు లేని పట్టణ వాసులకు ఒక సరిక్రొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు  ప్రకటించింది. వెయ్యి రూపాయలు కట్టిన పట్టణ వాసులకు ఇల్లు కట్టి ఇవ్వాలని నిర్ణయించింది.  ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని అన్ని  పట్టణ ప్రాంతాల్లో 1.2లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన ప్రతిపాదనలకు  రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి  సామాన్య ప్రజలు  రూ.వెయ్యి చెల్లించగానే ఇంటిని మంజూరు చేయాలనీ నిర్ణయించింది.  మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాలపై తీర్చేలా బ్యాంకు రుణం ఇప్పించాలని నిర్ణయించింది.  ఒక్కో ఇంటికీ లబ్ధిదారులకు రూ.3లక్షల రాయితీని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తాయి.ఈ ఇళ్ల నిర్మాణాన్ని  ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పరిధిలో చేపట్టనున్నారు.  గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం జరుగనుంది. ఇందులో  తాగునీరు, విద్యుత్‌, రోడ్లు వంటి మౌలిక వసతులతోపాటు ఆసుపత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్‌ తదితర సదుపాయాల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటుచేస్తారు.  . ఒక్కో ఇంటి నిర్వహణకు  రూ.30వేలు చొప్పున ఈ సొసైటీ లో  డిపాజిట్‌ చేస్తామని  రాష్ట్ర  పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 

ఈ పథకంలో భాగాన మూడు ‘ రకాల ఇళ్లను ( విస్తీర్ణం) ఆధారంగా  నిర్మించనున్నారు. ఇందులో  మొదటిది 270 చ.అడుగుల్లో హాల్‌, పడకగది గల ఇల్లు. రెండో రకం 365 చ.అడుగుల్లో హాల్‌, పడకగది వేర్వేరుగా ఉంటాయి.మూడవ రకం  ఇల్లు  420 చ.అడుగుల్లో రెండు పడకగదులు, హాల్‌తో ఉంటుందని మంత్రి వివరించారు.   ఈ మూడింటిలోనూ వంట గది, మరుగుదొడ్డి ఉంటాయి. వీటికి లబ్ధిదారుల  ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి టైల్స్‌, గోడలకు పుట్టి పెట్టించుకోవచ్చు. 270చ.అడుగుల ఇల్లు కావాల్సిన వారు రూ.వెయ్యి కట్టాలి. 365 చ.అడుగుల ఇల్లు అయితే  రూ.25వేలు కట్టాల్సి ఉంటుంది. , ఇదే ఇల్లు అన్ని హంగులతో కావాలనుకొంటే రూ.50వేలు కట్టాలి. ఇందుకు ఏడాది గడువుంటుంది. 420చ.అ. విస్తీర్ణంలో పూర్తి హంగులతో ఇల్లు కావల్సినవాళ్లు రూ.లక్ష చెల్లించాలి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు లేని నాలుగు జిల్లాల్లో సంబంధిత టెండర్‌ ప్రకటనను నాలుగు రోజుల్లో గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ వివరించారు. . మిగిలిన జిల్లాల విషయమై ఎన్నికల సంఘం అనుమతి కోసం రాయాలని నిర్ణయించామని అయన అన్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకుంటే ఏప్రిల్‌ నెల నుంచి మిగిలిన జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణానికి సంబందించిన  ప్రక్రియ మొదలవుతుంద’న్నారు.


kj reddy

సీమలో నిరుద్యోగ సమస్య నివారణే ధ్యేయం: కె.జె.రెడ్డి

పశ్చిమ నియోజక వర్గమైన అనంతపురం, కడప, కర్నూలులోని నిరుద్యోగ సమస్య నివారణే ధ్యేయం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  కె.జె.రెడ్డి అన్నారు. 

సోమవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో నియోజక వర్గ ఇంచార్జి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కె.జె.రెడ్డి పాల్గొన్నారు.

 

 

ఈ సందర్బంగా ఇంచార్జి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ  పారిశ్రామిక రంగంలో అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపిస్తేనే పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది అని కాబట్టి పట్టభద్రులంతా కె.జె.రెడ్డిని గెలిపించి సీమ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కె.జె.రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలతో తనకు ఉన్న పరిచయం ద్వారా సీమకు పరిశ్రమలను తీసుకు రావడానికి కృషి చేస్తున్నానని, కడప లో స్టీల్ ప్లాంట్, అనంతపురంలో ఎలక్ట్రానిక్ పార్కు, కర్నూలులో సిమెంట్, ఐరన్ పరిశ్రమల స్థాపన కృషి చేస్తామని అయన తెలిపారు.   


kj reddy

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అ‘ద్వితీయ’ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో విశాఖలో ఆంధ్రప్రదేశ్-సీఐఐ రెండో సదస్సు

ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు, సత్వర పారిశ్రామికాభివృద్ధి-సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖనగరం వేదిక కానుంది. ‘‘సుస్థిర అభివృద్ధికి భాగస్వామ్యాలు- ఆవిర్భవిస్తున్న ప్రపంచ ఆర్ధిక క్రమం’’ ఇతివృత్తంతో  ఈ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో  విశాఖ హార్బర్ పార్కు దగ్గర ఏ.పీ.ఐ.ఐ.సీ మైదానంలో  జరగనుంది. 

గత ఏడాది భాగస్వామ్య సదస్సులో  ఫలవంతమైన ప్రాజెక్టులు:

గత ఏడాది భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చింది. రూ. 4 లక్షల 67 వేల 577 కోట్ల రూపాయల విలువైపు ఎంవోయూలు కుదిరాయి.  328 ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. 9,58,896 మందికి ఉపాధి కలుగుతోంది. 

వివిధ దశల్లో ప్రాజెక్టులు: 38 యూనిట్లలో తయారీ ప్రారంభం

వీటిలో ఇప్పటికే 48 శాతం ప్రాజెక్టులు పనులు ప్రారంభించి వివిధ దశల్లో వున్నాయి. 42% పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 38 యూనిట్లు తయారీని ప్రారంభించాయి. వీటి విలువ రూ. 52,987 కోట్లు. మరో 6 యూనిట్లు ట్రైయిల్ ప్రొడక్షన్లో వున్నాయి, వీటి విలువ రూ. 1,519 కోట్లు.

మిషన్ల బిగింపు దశలో 16 కర్మాగారాలు:

 మిషనరీ బిగింపు దశలో 16 కర్మాగారాలున్నాయి. వీటి విలువ రూ. 14,700 కోట్లు. సివిల్ వర్క్ దశలో 29 యూనిట్లు వున్నాయి. వీటి విలువ రూ. 82,595 కోట్లు. రూ. 23,754 కోట్లతో మరో 13 కంపెనీలు శంకుస్థాపనకు సిద్ధమయ్యాయి. ఇంకా రూ. 6,611 కోట్ల విలువ చేసే పెట్టుబడులు పెడుతున్న 8 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి.

ఈ స్ఫూర్తితో మరోసారి విశాఖలో ఈనెల 27, 28న భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.   ఇప్పటికే దాదాపు 425 సంస్థలు రాష్ట్రంలో రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు పంపాయి. విశాఖ భాగస్వామ్య సదస్సుకు దాదాపు 4 వేల మంది ప్రతినిధులు భాగస్వామ్య సదస్సుకు హాజరవుతారు. వీరిలో 42 దేశాల నుంచి పాల్గొనే 300 మంది విదేశీ ప్రతినిధులు వున్నారు. 12 దేశాల వాణిజ్య మంత్రులు రానున్నారు.  కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ధర్మేంద్రప్రధాన్, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి ఈ సదస్సులో పాల్గొంటారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్ అండ్ అపారల్, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. 

టీవీఎస్, విప్రో, క్రేన్ , టాటా, సియట్, దాసన్, డిక్సన్, డ్రోన్ డిఫెన్స్, అపోలో, హిమామి, శ్రీ సిమెంట్స్, టోరెంట్ పవర్, ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటాయి.

"సూర్యుడు ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్" స్ఫూర్తిమంత్రంతో రాష్ట్ర ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) తో గత ఏడాది ఇక్కడే నిర్వహించిన సదస్సు విజయవంతమైన అంశం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చొరవతో ఈ ఏడాదీ సదస్సును విశాఖలో నిర్వహించటానికి అంగీకరించింది. ఫలితమే మళ్లీ విశాఖలో శుక్రవారం నాడు నిర్వహించే సదస్సు.   ప్రపంచంలో అభివృద్ధి ప్రాధాన్యాలు, విధాన రూపకల్పన ప్రధాన లక్ష్యం.  తదుపరి స్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి చర్చావేదికగా ఈ సదస్సు ఉపయోగపడాలని ముఖ్యోద్దేశం. భారత్‌ లో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం, ఆసక్తి ఉన్న దేశాలను ఆకర్షించి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చటం ధ్యేయం.

రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పర్చేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలెన్నో తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించింది.  అద్భుత కృషితో గత ఏడాది రాష్ట్ట్రప్రభుత్వం  నెంబర్ వన్  ర్యాంకును  సాధించింది.

 ప్రత్యేక దృష్టి పెట్టిన విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ఐటి, పరిశ్రమలు-మౌలిక సదుపాయాల రంగాల్లో  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు  ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పిస్తోంది.  రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, సహజవనరుల్లో మన కలిమిని, బలిమిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా, యూ.కే, జపాన్, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు.

 కొద్దిరోజుల క్రితమే దావోస్ ‘ప్రపంచ ఆర్ధిక వేదిక’ (World Economic Forum) సదస్సు ఆహ్వానం మేర ఐదు రోజులు దావోస్ లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆకాంక్ష వ్యక్తపరిచిన కంపెనీలతో దావోస్‌లో ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. చైనా, పాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా, మలేషియా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించి వెళ్లాయి.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాతో సాంకేతిక సహకారానికి  ‘సిస్టర్ స్టేట్ ’  ఒప్పందం కుదిరింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), పారిశ్రామిక విధానం, ఉన్నతీకరణ విభాగం, భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ విశాఖలో ఈనెల 27,28 తేదీలలో సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం  సిఐఐ సహకారంతో నిర్వహించే రెండో  సదస్సే కాదు. సిఐఐ దేశవ్యాప్త సదస్సుల్లో  23వ భాగస్వామ్య సదస్సు.  

సిఐఐ గత ఇరవై రెండేళ్లుగా అంతర్జాతీయ అంశాలపై సహకారానికి, సమస్యల పరిష్కార సాధన కోసం చర్చలకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో  22 సదస్సులు నిర్వహించింది. ప్రస్తుత అవకాశాలు-భవిష్యత్తులో సవాళ్లపై  చర్చించే వేదికలుగా  ఈ సదస్సులు నిలుస్తున్నాయి. ఏటా కనీసం వేయి నుంచి 1,500 మంది ప్రతినిధులు సీఐఐ సదస్సులో పాల్గొంటున్నారు. ఇందులో 40% మంది ప్రతినిధులు విదేశీ ప్రతినిధులు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే దేశాధినేతలు, మంత్రులు, విధాన రూపకల్పన నిర్ణేతలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, విద్యావేత్తలు పాల్గొంటారు. 

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకున్నా కసితో చేసిన కృషి ఫలించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో (‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’) నెంబర్ వన్ గా అవతరించింది.రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవటానికి ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ ఇతివృత్తంతో సాగిస్తున్న ప్రస్థానం ఫలితాలనిస్తోంది. మౌలిక సదుపాయాలు, సహజవనరుల్లో  ఆంధ్రప్రదేశ్ కలిమిని,బలిమిని వివరించడానికి జాస్తి కృష్ణకిశోర్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇ.డి.బి) బృందం గత ఏడాది నవంబర్‌లో చైనాలో పర్యటించి వచ్చింది.

విశాఖలో ఈనెల 27,28 తేదీల్లో సదస్సు: 

సీఐఐ సదస్సు సమయ సూచిక, వివరాలు:

 మొదటి రోజు సమావేశం శుక్రవారం 

ఉదయం గం.10.00: ‘ఇండియా ఎట్ ది కస్ప్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇతివృత్తంగా మొదటి సమావేశం. ఉ. గం.11.30 నిలకు. ‘టైమ్ ఇండియా అవార్డ్స్’ ప్రారంభ సమావేశం. మధ్యాహ్నం గం.2.15 ని.లకు: సుస్థిర ఆర్ధిక, వాణిజ్యాభివృద్ధి సాధన దిశగా భారత్: అభివృద్ధి చెందిన దేశాలు నాయకత్వం వహిస్తాయా? అనే అంశంపై ప్లీనరీ సమావేశం.

 మధ్యాహ్నం గం.3.45: రెండో ప్లీనరీ సమావేశం: ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్-ప్రపంచంకోసం-భవిష్యత్తు కోసం సిద్ధం.  

సాయంత్రం గం. 5.45: మూడో ప్లీనరీ సమావేశం:  సుస్థిర అభివృద్ధికి వినూత్న భాగస్వామ్యాల ఆవిష్కరణ.  సాయంత్రం గం.7.00 లకు నాలుగో ప్లీనరీ సమావేశం:గ్లోబల్ ఫైనాన్షియల ఆర్కిటెక్చర్: ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ.

రెండో రోజు సమావేశాలు శనివారం 28 వతేదీ

ఉదయం గం.10. ఐదో ప్లీనరీ సమావేశం:  ఇండస్ట్రీ 4.0- లీవరేజింగ్ ఫర్ ఎఫిషియన్సీ, అడాప్టబిలిటీ, ప్రొడక్టివిటీ (LEAP)? What is it in India? ఉ. గం.10.00: ఆంధ్ర ప్రదేశ్ అండ్ గ్లోబల్ నాలెడ్జ్ అండ్ రిసెర్చి పార్ట్‌నర్‌షిప్స్.

11.15: ఆరో ప్లీనరీ సమావేశం. భారత అమెరికా సంబంధాలు. కొత్త పరిపాలన భవిష్యత్తు ప్రణాళిక:

గం.11:15: ప్రత్యేక సమావేశం స్కిల్లింగ్ 4.0-ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్

మ. 12.30 ఏడో ప్లీనరీ సమావేశం: ‘అన్ లీజింగ్ గ్రోత్ ఇండస్ట్రియల్ కారిడార్స్’.

మ. గం.3.00: ఎనిమిదో ప్లీనరీ సెషన్: ఇండియాస్ ఇంటిగ్రేషన్ విత్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా.  


kj reddy

కర్నూల్ జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట: కేతవరం రాక్ పెయింటింగ్స్ కు చేయూతనిస్తున్న ప్రభుత్వం

ప్రధాన పర్యాటక రంగాల అభివృద్ధిపై దృష్టి సారించి,  కేతవరం రాక్ పెయింటింగ్స్ కు చేయూతనిస్తున్నన ప్రభుత్వం. 

                కేతవరంలో ఉన్న  ప్రధానమైన రాతి చిత్రాలకు సందర్శనకు చేయూతనిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం రూ .50 లక్షల వ్యయంతో ఒక వినోద పార్కుగా సృష్టించడానికి ఆమోదించింది.

కేతవరం చరిత్రపూర్వక జంతువుల శిలా చిత్రలేఖనాలకు నిలయం. ఇక్కడ దాదాపు 42 కు పైగా శీలా చిత్రలేఖనాలు ఉన్నాయి. దీని వల్ల చాల మంది పర్యాటకులు ఈ చిత్రలేఖనాల సందర్శనకు ఉత్సహం చూపిస్తున్నారు. అయితే ఇక్కడ వసతుల లేమి అంతగా లేకపోవడం వలన ప్రభుత్వం ప్రాథమిక వసతుల కల్పనపై దృష్టి సారించి దాదాపు 5కోట్లతో టెండర్లకు అనుమతిచ్చింది. దీని ద్వారా దేశ, విదేశాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. 

దీంతో పాటు 1కోటి రూపాయలతో సుంకేసుల డ్యామ్ వద్ద వసతి గృహలను , ఒక ఊగే వంతెనను, చిన్న భోజన శాల మరియు టికెట్ కౌంటర్ ను కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అంతేకాక ఉరుకుంద నరసింహ స్వామి టెంపుల్ ని కూడా భారీగా అభివృద్ధి చేయలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ ఆలయ అభివృద్ధి కోసం 50లక్షలతో  వసతి గృహలను, రెస్టారెంట్ ను, మరుగుదొడ్లను ఏర్పాటు చెయ్యడానికి ప్రతిపాదించింది. 
ఇదే పద్దతిలో హోలగుండ మండలంలోని ఎల్లార్తి దర్గాకు కూడా వసతులను కల్పించి అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దర్గా వద్ద ఎటువంటి భోజన సదుపాయం లేకపోవడంతో ప్రాథమిక వసతులతో పాటు రూ.50 లక్షలతో ఒక బోజనశాలను దానికి అవసరమైన నీటి వసతిని అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  

వీటితో పాటు ప్యాపిలీ మండలంలోని బోయవాండ్ల గ్రామంలోని  అబ్బుర పరచే వాల్మీకి గుహలకు పైకి కిందకు వెళ్ళడానికి మెట్ల సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే తరహాలో మరిన్ని  ప్రకాశించే గుహలు, జలపాతాలను కూడా దృష్టిలో పెట్టుకుంది.  

గోనెగండ్ల మండలంలోని ఇరొంబంద గ్రామంలో గాజుల దిన్నె ప్రాజెక్టు వద్ద  బోటింగ్, ఉయ్యాలా వంతెన వంటి వాటితో పాటు టికెట్ కౌంటర్ మరియు చిన్న పిల్ల ఆట స్థలం, ఆట వస్తువులను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 50లక్షలతో సంగమేశ్వరాలయం, 1కోటితో  రంగాపురం మద్దిలేటి స్వామి ఆలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు ఏర్పాటు చేసింది.


kj reddy

కృష్ణా జలాలకు టెలిమెట్రీ - ఇకనుండి ప్రతి నీటి బొట్టు కి లెక్కే - సీమకు కలగనున్న ప్రయోజనం

ఇటీవల కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికీ వారే కృష్ణ బోర్డు కు  ఫిర్యాదులు చేసాయి. దీంతో నీటి వినియోగంలో పారదర్శకత పాటించడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)సిద్ధమైంది. దీనికోసం టెలీమీటర్లు  ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఇందుకోసం బుధ, గురువారాల్లో ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలో నిర్ణయించేందుకు పరీశీలిస్తున్నారు. 

టెలీమీటర్ల ఏర్పాటు వల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది..?
టెలిమెట్రీ పరీక్షల ద్వారా ఎవరెవరు ఎంత నీటిని వినియోగిస్తున్నారో దాదాపు ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. అయితే నీటి కొలతలో ఉన్న రెండు వేర్వేరు పద్ధతుల్లో దేనిని పాటిస్తారో తెలియాల్సి ఉంది. నిల్వ ఉండే నీటిని ఘనపుటడుగుల పరిమాణంలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో కొలుస్తారు. 

ఏదేమైనా ఖచ్చితమైన లెక్కలు వస్తే నీటి వాటాపై సీమకు చాలావరకు న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు కృష్ణా బేసిన్ నుండి రాయలసీమ రావలసిన నీటి వాటాలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఎక్కడెక్కడ టెలిమెట్రీలు ఏర్పాటు చేయనున్నారు..?
రాయలసీమలో సాగు,తాగు నీటిని అందించే బానకచర్ల క్రాస్ రెగ్యూలేటర్ కు అనుసంధానంగా ఉన్న తెలుగు గంగ, ఎస్సాఆర్పీసీ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా, సుంకేసుల, ఎల్లెల్సీ కాల్వలకు కోస్తాఆంధ్ర, సీమ సరిహద్దుల్లో టెలిమెట్రీ లను ఏర్పాటు చేయనున్నారు.   

ఆధారము:ఆంధ్రజ్యోతి న్యూస్


kj reddy

కర్నూలులో ప్రారంభమైన నంది నాటకోత్సవాలు: పదహారు రోజుల పాటు కన్నుల పండుగగా జరగున్న ఉత్సవాలు

తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను ప్రారంభించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు చలనచిత్ర,టివి మరియు నాటక రంగ సంస్థ ఆధ్వర్యంలో జరిగే నంది నాటకోత్సవాలకు కర్నూలు పట్టణం వేదిక అయింది. బుధవారం కర్నూలు జిల్లాలోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పురప్రముఖులు, రాజకీయ నేతలు, ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, మార్కెట్ యార్డు  చైర్మన్ శమంతకమణి, మాజీ న్యాయశాఖ మంత్రి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీలు శిల్పా చక్రపాణి రెడ్డి, సుధాకర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

ఈ సంధర్బంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ కర్నూలులో రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను ప్రారంభించడం హర్షణీయం అన్నారు. రాయలసీమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నంది నాటకాలను నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ షేక్ స్పియర్ నాటక రంగాన్ని జీవితానికి అన్వయించి గొప్ప నాటకాలు రాశారని గుర్తు చేసారు. కర్నూలు ఎమ్మెల్యే యస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ  నంది నాటకోత్సవాలను సిటీ కేబుల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, కళాకారులకు హౌస్ ఫర్ సేల్ పథకం కింద 10వేల ఇళ్ళు మంజూరు చేసి ఒకే బ్లాక్ లో కట్టించి ఇస్తామని అన్నారు.
 

వార్త ఆధారం: ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్


kj reddy

రైతులకు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడి సంక్రాతి కానుక

రూ.37వేల పంపుసెట్‌ ఉచితంగా పంపిణి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాతి కానుకను ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.37 వేలు విలువ కలిగిన వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్‌ను ఉచితంగా అందిస్తమని ప్రకటించారు.  2017 చివరినాటికి పాత పంపుసెట్ల స్థానంలో రెండు లక్షల కొత్త పంపుసెట్లను నెలకొల్పనున్నామని తెలియజేశారు.  రాష్ట్రంలోని రైతులందరికీ తమ ప్రభుత్వం సంపూర్ణ సాయం అందిస్తుందని,  రైతు శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అయన పునరుద్గాటించారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని రైతులందరికీ ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను రాష్ట్ర ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ మీడియాకు  విడుదల చేశారు. ఈ బహిరంగ లేఖలో రైతులకు సంబందించిన ప్రతి అంశాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న  నాసి రకం పంపుసెట్ల స్థానంలో 5 నక్షత్రాలు కలిగిన మోటారును రైతులకు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం తన లేఖలో గుర్తు చేశారు. ఈ పంపు సీట్లపై ఐదు సవత్సరాల వారంటీ ఉంటుందని ఈ సందర్బంగా అయన తెలియజేశారు. వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గురించి కూడా అయన ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ  రంగంపై ఏడాదికి రూ.8 వేల కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం  ఖర్చు చేస్తోందని వెల్లడించారు.రాష్ట్రంలోని  ఒక్కో రైతు కుటుంబానికి వ్యవసాయ పంపుసెట్‌కు కరెంట్‌ సరఫరాకు రూ.22 వేలు వెచ్చిస్తున్నామన్నారు. రైతులకు ఇప్పటి వరకూ 9,400 సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించామని తెలిపారు.  

             1,400 సౌర పంపుసెట్లను ఏర్పాటు చేయడం ద్వారా కృష్ణా జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 900 పంపుసెట్లు ఇవ్వడం ద్వారా విజయనగరం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. సంక్రాతి పండగను పురస్కరించుకొని  ‘‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’’ కార్యక్రమం ను  నిర్వహిస్తున్నామని అయన ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భంగం రాష్ట్రంలోని ప్రతి రైతునూ విద్యుత్‌ శాఖ ఉద్యోగి కలుస్తారని చంద్రబాబు నాయుడు తెలిపారు. .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాతి కానుకను ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.37 వేలు విలువ కలిగిన వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్‌ను ఉచితంగా అందిస్తమని ప్రకటించారు.  2017 చివరినాటికి పాత పంపుసెట్ల స్థానంలో రెండు లక్షల కొత్త పంపుసెట్లను నెలకొల్పనున్నామని తెలియజేశారు.  రాష్ట్రంలోని రైతులందరికీ తమ ప్రభుత్వం సంపూర్ణ సాయం అందిస్తుందని,  రైతు శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అయన పునరుద్గాటించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని రైతులందరికీ ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను రాష్ట్ర ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ మీడియాకు  విడుదల చేశారు. ఈ బహిరంగ లేఖలో రైతులకు సంబందించిన ప్రతి అంశాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న  నాసి రకం పంపుసెట్ల స్థానంలో 5 నక్షత్రాలు కలిగిన మోటారును రైతులకు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం తన లేఖలో గుర్తు చేశారు. ఈ పంపు సీట్లపై ఐదు సవత్సరాల వారంటీ ఉంటుందని ఈ సందర్బంగా అయన తెలియజేశారు. వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గురించి కూడా అయన ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ  రంగంపై ఏడాదికి రూ.8 వేల కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం  ఖర్చు చేస్తోందని వెల్లడించారు.రాష్ట్రంలోని  ఒక్కో రైతు కుటుంబానికి వ్యవసాయ పంపుసెట్‌కు కరెంట్‌ సరఫరాకు రూ.22 వేలు వెచ్చిస్తున్నామన్నారు. రైతులకు ఇప్పటి వరకూ 9,400 సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించామని తెలిపారు.  1,400 సౌర పంపుసెట్లను ఏర్పాటు చేయడం ద్వారా కృష్ణా జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 900 పంపుసెట్లు ఇవ్వడం ద్వారా విజయనగరం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. సంక్రాతి పండగను పురస్కరించుకొని  ‘‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’’ కార్యక్రమం ను  నిర్వహిస్తున్నామని అయన ఈ సందర్బంగా వెల్లడించారు. . ఈ కార్యక్రమంలో భంగం రాష్ట్రంలోని ప్రతి రైతునూ విద్యుత్‌ శాఖ ఉద్యోగి కలుస్తారని చంద్రబాబు నాయుడు తెలిపారు. .


kj reddy

నెరవేరిన పులివెందుల,కడప జిల్లా వాసుల దశాబ్దాల కల -టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి - నిరుద్యోగులకు ఉపాధి- కడప సమవేశంలో మాట్లాడిన కె.జె.రెడ్డి

లాంఛనంగా సి.ఎం చేతులమీదుగా గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభం - గండికోట నుంచి పైడిపాలెంకి ఉరకలు పెడుతున్న కృష్ణా జలాలు

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కడప జిల్లా ప్రజల గుండె సడి అయిన పైడిపాళెం రిజర్వాయరుకు, ఈ రోజు 11-01-2017న గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా లాంఛనంగా నీటి విడుదల జరిగింది.ఎన్నో ఏళ్లుగా రైతులు ఈ నీటి కోసం ఎదురుచూస్తున్నారు, ఈ రోజున కృష్ణ జలాల నీటి విడుదల ద్వారా వారి కల సాకారమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు పైగా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందనుంది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.జె.రెడ్డి మాట్లాడుతూ టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని, సీమలో సాగు నీరు,తాగునీరు మరియు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేదని దాదాపు తాగునీటి సమస్య తీరిందని చంద్రబాబు గారు, టీడీపీ నాయకుల కృషితో సాగునీటి సమస్య కూడా తీరనుందని అన్నారు. ఇక సీమలో మిగిలిన ఒకే ఒక్క ప్రధాన సమస్య నిరుద్యోగం, ఈ సమస్యను కూడా త్వరలోనే అధిగమిస్తామని అందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు 8 మెగా కంపనీలతో ఒప్పందం కుదిరింది అని అన్నారు. సీమలో మరొక సమస్య యువతలో ఉద్యోగానికి సంబందించిన స్కిల్స్ తక్కువగా ఉండడం, ఈ సమస్య పరిష్కారానికి ముందస్తుగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పట్టభద్రుల ప్రథమ ఓటు చాలా విలువయిందని కాబట్టి అలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

150కోట్ల పలు అభివృద్ధి పనులకు ఈ రోజు సి.ఎం నారా చంద్ర బాబు నాయుడు శంకు స్థాపన చేయనున్నారు.అంతేకాకుండా ఇప్పటి వరకు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇతర ప్రాజెక్టులకు కూడా తదుపరి దశలకు నిధులు విడుదల చేస్తారని జిల్లా అధికారులు తెలిపారు.


kj reddy

సంక్రాంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

-రాయలసీమ ప్రాంతాలు తిరుపతి, కడప, పుట్టపర్తి లోని శిల్పారామంలలో పండగ సంబరాలను నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండుగలో భాగంగా జరుపుకునే సంబరాలను ఘనంగా నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా గ్రామ, మండల, జిల్లా ఇలా వివిధ స్థాయిల్లో అధికారికంగా సంబరాలను నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. రాయలసీమ ప్రాంతాలైన తిరుపతి, కడప పుట్టపర్తి కోస్తా ప్రాంతమైన విశాఖపట్నంలోని శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించాలని ఆదేశించింది. సంక్రాంతి పండుగ‌ను రాష్ట్ర ప్ర‌జలంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చేసుకోవాల‌న్న‌దే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఉద్దేశ‌మ‌ని, దీనికోసం రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు ఖ‌ర్చు చేయ‌డానికి కోటి చొప్పున 13 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను మంజూరు చేసిన‌ట్లు రాష్ట్ర స‌మాచార‌, ఐటి, సాంస్కృతిక శాఖ మంత్రి డా. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి చెప్పారు. ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి అని..ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతులకు కూడా ఈ సంద‌ర్భంగా అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. సంక్రాంతి రోజుల్లో తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయ‌న్నారు. పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారుల విన్యాసాలు..ఎడ్ల పందాలు, హ‌రిదాసులు, రంగురంగుల ముగ్గులు...వాటి మ‌ధ్య కొలువుదీరిన గొబ్బెమ్మ‌లు, భోగి మంట‌లు, రేగుప‌ళ్లు వంటివ‌న్నీ సంక్రాంతికి మ‌రింత శోభ తెస్తాయ‌న్నారు. ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరించే ఆడ‌ప‌డుచులు సంతోషంగా ఉండేలా చూడాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి ధ్యేయ‌మ‌న్నారు. ఆడ‌ప‌డుచుల కోసం ప్ర‌త్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి ప‌ల్లె తెలిపారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ పండుగ‌ను ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. స‌చివాల‌యంలో ఉద్యోగులంతా ఆనందంగా పండుగ సంబురాల్లో పాల్గొనేందుకు ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల రూపాయ‌లు నిధులు మంజూరు చేశామ‌ని మంత్రి ప‌ల్లె వివ‌రించారు. రాష్ట్రంలో ప్ర‌తి తెల్ల‌కార్డుదారుడికీ చంద్ర‌న్న సంక్రాంతి కానుక అంద‌చేశామ‌ని... ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో... సంక్రాంతిని చేసుకోవాల‌ని, కుటుంబ‌స‌భ్యులు, బంధువులు అంతా క‌లిసిమెలిసి ఈ పండుగ‌ను వేడుక‌గా చేసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినందుకు మంత్రి ప‌ల్లె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


kj reddy

హిందూపురం ,బొబ్బిలి పారిశ్రామిక వాడలకు త్వరలోనే మహర్దశ:

రాష్ట్రంలో ఆధునీకరించిన పారిశ్రామిక మౌలిక వసతుల ఉన్నతీకరణ పథకం(ఎంఐఐయూస్) కింద తూమకుంట, గోళ్ళాపురం పారిశ్రామిక వాడలకు ప్రభుత్వం 50కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం ద్వారా పారిశ్రామిక వాడలలో మౌలిక వసతులైన రోడ్లు, నీటి సరఫరా, డ్రైనైజ్, ఫెన్సింగ్ మరియు ఇతర ప్రాథమిక అవసరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పనుల ఏర్పాట్లు జరుగుతుండడంతో త్వరలోనే ఈ పారిశ్రామిక వాడలకు మహర్దశ రానుంది. ఈ వసతుల కల్పన ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ఆకర్షించాలని ఏపీఐఐసీ ప్రయత్నిస్తోంది. దాదాపు రూ.500 కోట్లతో భారీ పరిశ్రమల నిర్మాణం జరగనుంది. గార్మెంట్స్,టెక్స్టైల్స్,ఐరన్,డ్రగ్ కెమికల్స్, మరియు వివిధ రంగాలలో పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే 20కి పైగా పరిశ్రమలు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా పెట్టుబడితో సూర్య రోషిణి, టెక్స్ పోర్టు స్పిన్నింగ్స్, హెరిటేజ్ ఫుడ్స్, రతన్ ప్లాస్టిక్, బలిహ కెమికల్స్ పరిశ్రమల పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇవే కాక మౌలిక వసతుల కల్పన పూర్తి అయినా వెంటనే మరికొన్ని పరిశ్రమలు స్థాపన జరిగే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో మూడు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు, మరికొన్ని వేల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా అయిన వలసలకు అడ్డుకట్ట పడుతుందని అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.


kj reddy

ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి 'ఆరోగ్య రక్ష' పథకం రాష్ట్ర ప్రజలకు వరం - ప్రారంభమైన పేర్ల నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారి కోసం ‘ఆరోగ్య రక్ష’ అనే సరికొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ వినూత్న పథకాన్ని నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి ఒకటవ తేదీన విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు.

ఇప్పటికే ప్రభుత్వ పరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య భీమా కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 35 లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకంలో చేరడానికి అవసరమైన పేర్ల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకంలో చేరాలనుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ-సేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చూ. ‘ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకొనే ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1,200 చెల్లించాలి. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది ఈ పథకంలో చేరవచ్చుఁ. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్య సేవ అందుతుంది. పథకంలో చేరిన లబ్దిదారులకు రాష్ట్రంలోని 432 ఆస్పత్రుల్లో 1,044 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది. ఈ పథకం కాలపరిమితి ఏడాది ఉంటుంది. ఆన్లైన్ లో తమ దరఖాస్తులు సమర్పించాలనుకునే వారు ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైటు లో లాగిన్ అయ్యి చేయవచ్చు. దరఖాస్తుదారులు అందరు తమ ఆధార్ కార్డు వివరాలను ఈ కార్డు పొందడానికి సమర్పించాల్సిఉంటుంది. దరఖాస్తుల సమర్పణ అనంతరం 'ఆరోగ్య రక్షా' పధకాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన ఆరోగ్య కార్డులు సంబంధిత దరఖాస్తుదారులు పొందవచ్చు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పథకంలో చేరడానికి వచ్చే నెల ఫిబ్రవరి 28వ తేదీ ని చివరి తేడాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆరోగ్య భీమా పథకం ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇందులో లబ్ధిదారులు కట్టే భీమా ప్రీమియం సొమ్ము, ప్రైవేట్‌ భీమా కంటే చాలా తక్కువ. దారిద్య్ర రేఖ (బీపీఎల్‌)కు దిగువన ఉన్న కుటుంబాలు, ఉద్యోగులు, పాత్రికేయులకు ఇప్పటికే ఆరోగ్య కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలందరికి ఆదర్శనంగా నిలవడానికి ఈ ఆరోగ్య రక్ష పథకంలో సీఎం శ్రీ నారా చంద్రబబు నాయుడు గారు కూడా తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకున్నారు.పథకానికి సంబందించిన ఆరోగ్య కార్డును వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అందుకున్నారు. ఈ పథకంలో చేరాలనుకునే రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం పథకానికి సంబందించిన వెబ్సైటు లింకును ఇక్కడ ఇస్తున్నాం. http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx


kj reddy

104 వ భారత జాతీయ కాంగ్రెస్ వేదికైన తిరుపతి; సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమ్మేళనానికి రాయలసీమ జిల్లా చిత్తూర్ వేదికైంది.

దేశ ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ఎల్ నరసింహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు, వేలాది మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ప్రశాంతి మాట్లాడుతూ.. రోజురోజుకూ అనూహ్యంగా తలెత్తుతున్న సవాళ్ళను చూసి చింతించకుండా వాటినే సోపానాలుగా మలచి మన యువతకు ఉపాధి కల్పించాలని, సమాజ సమస్యలను తీర్చాలని అయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరిశోధన సంస్థలు.. ఉన్నత విద్యాసంస్థలు- పాఠశాలలు, కళాశాలలతో అనుసంధానం కావాలని అభిలషించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) తరహాలో శాస్త్రీయ సామాజిక బాధ్యతను ఆరంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధిస్తున్న మన శాస్త్రసాంకేతిక రంగానికి అట్టడుగున ఉన్న పల్లెల్లోనూ సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత ఉందని స్పష్టం చేశారు. పరిశోధన ప్రమాణాలను పెంచాలంటూనే 2030నాటికి శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచంలోని మూడు అగ్రదేశాల్లో భారత్‌ ఒకటిగా ఉండబోతోందని భరోసానిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ తయారీ, బిగ్‌డాటా విశ్లేషణ, డీప్‌లర్నింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లాంటి వాటిలో పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలను పెంచుకోవటం ద్వారా ఈ సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవచ్చని అయన తెలిపారు. ఈ సాంకేతిక యంత్రాంగాలను సేవ, తయారీ రంగాలతోపాటు వ్యవసాయం, నీరు, ఇంధనం, ట్రాఫిక్‌ నిర్వహణ, ఆరోగ్యం, పర్యావరణం, మౌలిక సదుపాయాల కల్పన, జియో సమాచార వ్యవస్థలు, భద్రత, ఆర్థిక రంగాలతోపాటు నేరాలను అరికట్టడంలో సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని అయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా మన భవిష్యత్తును భద్రంగా ఉంచుకునేందుకు పరిశోధనాభివృద్ధి మౌలిక సదుపాయాలు, వనరులు, నైపుణ్యాల సృష్టికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య జాతీయ మిషన్‌ను ఆరంభిస్తామని మోడీ ఈ సందర్బంగా ప్రకటించారు.


kj reddy

కర్నూలులో నూతన సంవత్సర కానుకగా అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు..

నిరుద్యోగులకు లాభం కలగడమే లక్ష్యంగా , సోమవారం C.M నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి, రాజధాని ప్రాంతాన్ని ఉద్యోగ నియామకాలకు ఫ్రీ జోన్ గా ప్రకటించారు.

ఈ ప్రకటన ముఖ్యాంశాలు: 1) 14F పునపునరుద్ధరణ, అమరావతి పోలీస్ ఫ్రీ జోన్ 2) ఎక్కడ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు స్థాపించిన ఆ ప్రాంతం ఫ్రీ జోన్ గా పరిగణించబడుతుంది. 3) ఈ నిర్ణయం తాజా ASO నియామకాలు నుండే అమలు కానుంది.


kj reddy

జన్మ భూమి - మా ఊరు కార్యక్రమంలో కుటుంబ వికాసానికి 15 సూత్రాలకు శ్రీకారం చుట్టిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు

సమాజం పూలవనం లాంటిది - పూలవనంలోని ప్రతి పువ్వులా వ్యక్తి యొక్క శక్తి , వ్యక్తి వికాసంతోనే కుటుంబం వికసిస్తుంది. కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం, తద్వారా రాష్ట్రం , దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధితో విరబూస్తాయి,ఆర్థిక వృద్ధితో అనందం వెల్లివిరుస్తుంది. ఆ లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వికాసానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ 15 సూత్రాలకు శ్రీకారం చుట్టారు. ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాల్లో "కుటుంబ వికాసం" అమలుకు అందరం అంకితమవుతూ రాష్ట్ర వికాసానికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు: 1) జీవన భద్రత - ఎన్.టి.ఆర్ భరోసా 2) ఆహార భద్రత 3) చంద్రన్న భీమా 4) విద్యుత్ భద్రత 5) దీపం పథకం 6) మంచి నీటి భద్రత 7) గృహ భద్రత 8) ఆత్మ గౌరవం 9) ఆరోగ్య భద్రత 10) విద్యా భద్రత 11) ఇంటింటా పశు సంపద 12) ఉపాధి/ఉద్యోగ భద్రత 13) సమాచార/సాంకేతిక విజ్ఞానం 14) శాంతి భద్రతల పరిరక్షణ మహిళలకు భద్రత 15) ప్రతి కుటుంబానికి రూ.10,000 కనీస ఆదాయం


kj reddy

కరెన్సీ నోట్ల సమస్యను అధిగమించడానికి 'ఏపీ పర్స్' ఏప్ ను ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఇబ్బదున్దులు అన్ని ఇన్ని కావు. ఈ సమస్యలపై తీవ్ర తర్జన భర్జనలు జరిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించడానికి ఏపీ పర్స్ అనే ఒక వినూత్నమైన ఏప్ ను ప్రవేశపెట్టారు.

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ప్రజలను డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వాళ్లను నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు ఈ ఏప్ ను ప్రవేశపెట్టామని ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. గ్రామాల్లో మరింత మందిని ఈ ఏప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి ‘‘మార్పు నేస్తం’’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని సీఎం తెలిపారు. . మార్పు నేస్తాలుగా నమోదైనవారు డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు శిక్షణనిచ్చి ‘ఏపీ పర్సు’ మొబైల్‌ యాప్‌లో సభ్యులుగా నమోదు చేయించాలి. ఒక్కో సభ్యుడిని నమోదు చేసినందుకు మార్పు నేస్తం ప్రతినిధికి రూ.15 చొప్పున నగదు ప్రోత్సాహకం ఇస్తాం. నమోదైన ఆ సభ్యుడు తర్వాత దశలో కనీసం వారంలో 2 లావాదేవీలు నిర్వహిస్తే అందుకు ప్రతిఫలంగా మార్పు నేస్తం ప్రతినిధికి వారానికి రూ.5 చొప్పున నెలకు రూ.20 చెల్లిస్తాం. ‘ఏపీ పర్సు’ మొబైల్‌ యాప్‌లో ఇలా ఎంత ఎక్కువ మందిని నమోదు చేయించి, ఎన్ని ఎక్కువ నగదు రహిత లావాదేవీలు నిర్వహించగలిగేలా చేస్తే మార్పు నేస్తం ప్రతినిధికి అంత సొమ్ము ప్రోత్సాహకంగా లభిస్తుంది. ప్రభుత్వం కాకుండా బ్యాంకింగ్‌ సంస్థలు ఇచ్చే ప్రోత్సాహకం దీనికి అదనం. గ్రామాలను నగదు రహితంగా తీర్చిదిద్దడంలో మార్పు నేస్తం ప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలి. గ్రామాల్లో ఒక్కొక్కరూ వందమందిని ఏపీ పర్సులో నమోదు చేయిస్తే నెలకు కనీసం రూ.3500 వరకూ సంపాదించవచ్చని శ్రీ చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా అన్నారు. ప్రస్తుతం ఏపీ పర్సు మొబైల్‌ యాప్‌లో 13 మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థలు, 10 ఈ వ్యాలెట్‌ సంస్థలు తమ యాప్‌లను పొందుపరిచాయి. మరో ఆరు సంస్థలు అందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులూ ఈ యాప్‌ ద్వారా చేసుకునే వెసులుబాటును కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. నగదు రహిత లావాదేవీలుగా రూపాంతరం చెందే గ్రామాలను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2000 లోపు జనాభా కలిగిన గ్రామాలకు రూ.10వేలు, 5వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.25వేలు, 5-10వేల లోపు జనాభా కలిగిన వాటికి రూ.50వేలు, 10వేలు అంతకు మించి జనాభా కలిగిన గ్రామాలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. మార్పు నేస్తం ప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో, ఉపాధి కల్పన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశం చదువుకుంటున్న . విద్యార్థులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు చదువుకుంటూనే సాయంత్రం వేళల్లో మార్పు నేస్తాలుగా పనిచేయాలి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి రాష్ట్రంలోని 29వేల మంది చౌక ధరల దుకాణదారులను బ్యాంకు మిత్రలుగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పర్స్ అంటే ఏంటి? ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ-వాలెట్‌ చెల్లింపుల యాప్స్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్లు వాడే అందరికి నగదు రహిత చెల్లింపులు జరిపే అవకాశాన్ని కల్పిస్తుంది. సామాన్యులకు కూడా సులువుగా అర్ధమయ్యేలా తెలుగులోనూ... ఎలా వాడాలి అన్న అంశాలు అన్ని ఈ ఏప్ లో పొందుపరచటం జరిగింది. ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీనిని రూపొందించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం వాడేవారు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


kj reddy

నిరుద్యోగులకు తీపి కబురు అందించిన ఏపీపీఎస్సీ:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులకు తీపికబురు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 982 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కమీషన్ ఛైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.

సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లో విధానంలో స్వీకరిస్తామన్నారు. ఈ పరీక్షకు 25 వేల మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రిలిమినరీ (ప్రాథమిక) పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్‌ పరీక్ష మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నామన్నారు. గ్రూప్- 2 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు అభ్యర్థుల సౌకర్యార్థం ఇక్కడ ఇస్తున్నాం. * దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11.11.2016 * దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 10.12.2016 * ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 26, 2017 * మెయిన్స్‌ పరీక్ష: మే 20, 21వ తేదీల్లో (2017) భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: * ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 442 * నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 540 * మొత్తం పోస్టుల సంఖ్య: 982 * వయెపరిమితి: సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 (20-42 సంవత్సరాల మధ్య), ఎక్సైజ్‌ ఎస్సై (18-28 సంవత్సరాల మధ్య) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. * పూర్తి వివరాలకు: www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. * గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.


kj reddy

నవంబర్ 18,మన ప్రాంతానికి రాయలసీమగా పేరు తెచ్చిన ముఖ్యమైన రోజు:

తనకు ఒక పేరు ను ప్రకటించుకున్న ప్రాంతం రాయలసీమ,బహుశా చరిత్ర లో ఇలాంటిది చాలా అరుదు అయిన విషయం.

రాయలసీమ కు ఒకప్పుడు సీడెడ్ అనే మాట ఆత్మ గౌరవ సమస్యగానే గాక యుద్దాలు పంపకాలతో విషాద చరిత్రకు గుర్తుగా అప్పటి వాళ్ళు భావించారు.అందు వాళ్ళ దీన్ని తిరగ రాయాలి అని అనుకున్నారు.ఈ ప్రాంత చరిత్ర ను అసలైన పునాది ఫై పునర్నిర్మించాలి అని అనుకున్నారు.ఆ రోజుల్లో రాయల పాలన వారికీ ఒక స్వంత అస్తిత్వంగా భావించారు.అందుకే "సీడెడ్" అనే పేరు పక్కకు పెట్టి "రాయలసీమ" గా పిలవాలని ప్రతిపాదన చేశారు. 1928 నవంబర్ 18న నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహా సభ లో "రాయలసీమ" గా నామకరణం చేసారు. రాయలసీమ వైతాళికుడు అని పిలవదగిన పప్పూరి రామాచార్యులు తన సాధన పత్రిక ద్వారా ఈ పేరు ను జనరంజకం చేసారు. రాయలసీమ ఒకప్పుడు అనేక రాజరికల పదఘటనల కింద నలిగిపోయింది,ఢిల్లీ,మైసూర్,హైదరాబాద్ రాజ్యాల మధ్య ఇంగ్లాండ్,ఫ్రెంచ్ వలస వాదుల మధ్య రక్తమోడింది.వాళ్ళ తగాదాలకు యుద్ధ భూమిగా కన్నీరు కార్చింది.ఇక్కడి ప్రజల ప్రమేయం లేకుండానే ఎన్నో చేతులు మారింది. నిజం మరియు మారారాల మధ్య జరిగిన తగాదా లో బ్రిటిష్ వారు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నిజం నవాబు తన ఏలుబడిలోని జిల్లాలను బ్రిటిష్ వాళ్ళల్లో దత్తత ఇవ్వడం జరిగింది.అప్పటి నుండి బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని దత్తత జిల్లాలు గా పిలిచే వారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభ దశలో ఉండగానే రాయలసీమ మేధావులు,రచయితలు ఈ దత్తమండలము అనే పేరు లోని పరాధీన భావాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. నంద్యాల లో రాయలసీమ గా నామకరణం: 1928 నవంబర్ 18 న జరిగిన ఆంధ్ర మహా సభ లో చిలుకూరు నారాయణ రావు గారు చాలా మంది మదిలో ఉన్న ఆలోచన ను బయట పెట్టి, దత్త మండలాలను రాయలసీమ గా వ్యవహరించాలని ప్రతిపాదించారు. అక్కడ ఉన్న రచయితలు,మేధావులు పప్పూరి రామాచార్యులు,గాడిచర్ల మరియు తదితరులు అంగీకరించారు.అలా రాయలసీమ అనే పేరు స్థిరపడిపోయింది.ఇలా మొదటి నుండి రాయలసీమ ప్రాంత ప్రజలు స్వంత అస్తిత్వ కోసమే ఈనాటికి ఆరాట పడుతున్నారు.


kj reddy

ప్రభుత్వ అధికారుల దృష్టి పడితే అద్భుతమైన పారిశ్రామిక వాడగా మారనున్న ఓర్వకల్లు:

ఓర్వకల్లు... కర్నూల్ పట్టణానికి కేవలం 18 km దూరంలో గల మండల కేంద్రం. అంతేగాకుండా, అతి త్వరలోనే ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ప్రాంతం.

ఇందుకు కారణం ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవరమైన భూమి సమృద్ధిగా అందుబాటులో ఉండడం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలో , ఓర్వకల్లు ను ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చ్చారు. హామీ ఇవ్వడమే కాక దాన్ని వెంటనే ఆచరణలో కూడా పెట్టారు. ఓర్వకల్లు మండలంలో గల ఏడు వేల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని రాష్ట్ర రెవిన్యూ శాఖ వెంటనే ఏపీఐఐసీకి అప్పగించింది. ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక హబ్ నెలకొల్పడానికి మరో 2400 ఎకరాల ప్రైవేట్ భూమి అవసరమని తేల్చారు. ఈ భూమి సేకరణకు తమను అనుమతించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వారి దృష్టిని తనవైపు తిప్పాలని కలవరిస్తోంది. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు పారిశ్రామిక ప్రాంతంగా ఓర్వకల్లు ను మార్చడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన అంశాన్ని మాత్రం ప్రభుత్వ అధికారులు పక్కన పెట్టేసారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 40 టీఎంసీ ల నీళ్లను ప్రాజెక్ట్ కు సరఫరా చేయొచ్చని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు, నీళ్లను ఏ విధంగా సరఫరా చేయాలనే అంశాలతో కూడిన తుది నివేదికను మాత్రం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. దీంతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి బలమైన కోరికను నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం మాట ఇలా ఉంటే మరోవైపు, ఓర్వకల్లు లో తమ పరిశ్రమలను స్థాపిస్తామని 400 మందికి పైగా చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ 2935 కోట్లకు పైగా పెట్టుబడులను ఓర్వకల్లు లో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 370 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓర్వకల్లు లో కేటాయించింది. ఈ సంస్థ పెట్టబోయే పెట్టుబడుల వల్ల 6000 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్నూల్ ప్రాంతానికి చెందిన యువత పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక హబ్ కు సంబంధించిన మౌలిక వసతులను వెంటనే అధికారులు సమకూర్చాలని కోరుతున్నారు.


kj reddy

ఎక్స్ ప్రెస్ హైవే తో రాజధాని అమరావతి ని రాయలసీమ తో కలపనున్న ఎన్. హెచ్. ఏ. ఐ

భారత జాతీయ హైవే సంస్థ (ఎన్. హెచ్. ఏ. ఐ) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తో రాయలసీమ ప్రాంతాన్ని కలపడానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానిని రాయలసీమ ప్రాంతంతో కలపడానికి ఒక ఎక్స్ ప్రెస్ హైవే (మార్గం) ను నిర్మించాలని నిర్ణయించింది.

ఈ ప్రాజెక్ట్ ను జాతీయ హైవేల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్నీ ఎన్. హెచ్. ఏ. ఐ సభ్యులు (టెక్నికల్) ధనంజయ్ ఓ తవాడే వెల్లడించారు. జాతీయ హైవేల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ఆరవ దశలో ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపడతామని అయన వెల్లడించారు. రాయలసీమ లోని అనంతపూర్ జిల్లా నుంచి అమరావతి వరకు ఈ మార్గం ఉంటుందని ఆయన తెలిపారు. రాయలసీమ లోని మిగతా జిల్లాలైన కర్నూల్, కడప జిల్లాల నుంచి నాలుగు లేన్ల రోడ్లను నిర్మించి ఎక్స్ ప్రెస్ వే తో కలుపుతామని అయన ఈ సంధర్బంగా వెల్లడించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 600 km ఉండబోతోంది. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం నిర్మాణంతో రాయలసీమ ప్రజలకు రాష్ట్ర రాజధాని అమరావతి మరింత చేరువ కానుందండంలో ఎలాంటి సందేహం లేదు.


kj reddy

మరపురాని గత స్మృతులు- ఉజ్వల రాయలసీమ కు ప్రతీకలు

అక్టోబర్ 1,1953. ఈ రోజు రాయలసీమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే, 61 ఏళ్ళ క్రితం ఇదే రోజు కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. అయితే సరిగ్గా మూడేళ్ళ అనంతరం నవంబర్ 1,1956 రోజున ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిజాం సంస్థానమైన హైదరాబాద్ నగరానికి తరలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడింది.

కర్నూల్ రాజధానిగా సాగిన మూడేళ్ళ పరిపాలన ఉజ్వల రాయలసీమ కు ప్రతీకగా, రాయలసీమ చరిత్రలో మర్చిపోని ఘట్టంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే, రాష్ట్ర పరిపాలనకు అవరసరమైన అన్ని ముఖ్యమైన విభాగాలు కర్నూల్ కేంద్రంగా పరిపాలన సాగించాయి. రాష్ట్ర సచివాలయం, గవర్నర్ నివాసమైన రాజ్ భవన్, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం వంటివన్నీ కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలోని నేటి కోర్టు సముదాయం ఆంధ్ర రాష్ట్రంలోని శాసనసభ. నేటి మెడికల్ కాలేజీ అప్పటి సచివాలయం, నేటి కేవీఆర్ కాలేజీ అప్పటి రాజ్ భవన్. అలాగే నేటి ఎస్టీబీసీ కాలేజీలో అప్పటి ముఖ్యమంత్రి నివాసం ఉండేది. నేటి టౌన్ మోడల్ కాలేజి ప్రాంగణంలోనే అప్పటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవి. ఈ ముఖ్యమైన పరిపాలన కేంద్రాలు, కర్నూల్ లో ఉండడం మూలంగా, రాయలసీమ ప్రాంతమంతా గొప్ప ప్రభావాన్ని సంపాందించుకొంటుందనే భావన అందరిలో నెలకొంది అప్పట్లో. అయితే, ఆ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. అప్పటి పాలకులు కుట్రల ఫలితంగా, రాష్ట్ర రాజధాని కర్నూల్ నుంచి హైదరాబాద్ కు తరలిచండం జరిగింది. తమ గుండె లోతుల్లో రాయలసీమ ప్రజలు కట్టుకున్న స్వప్నాల మేడలు, రాజధాని తరలింపుతో ఒక్కసారిగా కళ్లెదుటే కూలడం జరిగింది. రాజధాని తరలింపులో అప్పటి కోస్తా నాయకుల ప్రత్యేక్ష ప్రమేయం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా రాజధాని తరలింపుతో ప్రారంభమైన రాయలసీమ జిల్లాల అధోగతి 61 ఏళ్ళు ఐన తర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత చాలా మంది రాయలసీమ నాయకులూ కర్నూల్ ను రాజధానిగా చేయాలనీ డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్ లు డిమాండ్లుగానే మిగిలాయి తప్ప నిజ రూపం దాల్చలేదు.


kj reddy

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న రాయలసీమ...!!!

రాష్ట్ర విభజన జరిగిన రెండున్నరేళ్లు గడిచిన తరవాత రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి పడిన బాటలు ఇప్పుడు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమస్యలని అధిగమించుకుంటూ రాయలసీమ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు నుండి బయట పడడానికి ముందడుగు వేస్తుంది.

ఈ సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య ను రాయలసీమ త్వరలోనే అధిగమించనుంది. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల వారిలో ఒక రకమైన ఆశ,ఉత్సహం నెలకొంది. మొదట రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్ర పాలకులు చేసిన ఎన్నో వాగ్దానాలు ఇప్పటికీ వాగ్దానులాగానే మిగిలిపోయాయి అని సీమ ప్రాంత ప్రజలు అనుకున్నప్పటికీ,సి.ఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో రాయలసీమ ప్రాంతం ప్రగతి పథంలో దూసుకుపోనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతానికి చెందిన జిల్లాలకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలకు ఇవ్వడం ఈ ప్రాంతంలోని యువత మరియు ఇతర రంగాలకు చెందిన వారిలో ఒకింత ఆశ్చర్యాన్నిమరియు ఆనందాన్నికూడా నింపుతుంది. వరుసగా గత ఐదేళ్ల నుంచి కరువు జిల్లాలుగా ఉన్న కర్నూల్, కడప మరియు అనంతపూర్ జిల్లాలు నమోదవుతున్న కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని హంద్రీనీవా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది, అంతే కాకుండా పట్టిసీమ మరియు పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తూ రాయలసీమ ప్రాంత ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను అంతం చేస్తుంది. రాయలసీమ అభివృద్ధికి చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనది. జాతీయ సంస్థలైన ఐఐటీ (IIT) , సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని ఈ ప్రాంత జిల్లాల్లో ఏర్పాటు చేయడం. అయితే ఈ వాగ్దానాల్లో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వంత జిల్లా అయిన చిత్తూరులో ఐఐటీ ఏర్పాటు జరిగింది. అంతే కాకుండా రాయలసీమ లోని మిగతా మూడు జిల్లాలైన కర్నూల్, కడప మరియు అనంతపూర్ లో కూడా జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు త్వరలోనే ప్రారంభం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. చిత్తూర్ లో ఐఐటీ, ఐఐఎం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు వివిధ స్థాయిల్లో ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్నాయి. అంతే కాకుండా అనంతపూర్ జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్నూల్ జిల్లాలో ఐఐటీ (IIT) ఏర్పాటు చేస్తామని, కడప జిల్లాలో ఎయిమ్స్ వంటి అత్యున్నత వైద్య విద్యా సంస్థను నెలకొల్పుతామని పాలకులు హామీ ఇచ్చ్చారు. అయితే ఈ హామీ కేవలం హామీ గానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలోనే అమరావతి నుండి రాయలసీమ జిల్లాలకు రోడ్డు మరియు రైలు సౌకర్యాలను కూడా స్వీకారం చుట్టారు.అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో తాము ఎదుర్కొంటున్న కష్టాలు దూరమౌతాయని రాయలసీమ ప్రజలు ఆశిస్తున్నారు. రాయలసీమ ప్రజలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఐన కేజేఆర్ గ్రూప్ ద్వారా అనంతపూర్ జిల్లాలో నిర్మించబోతున్న ఎలక్ట్రానిక్స్ పార్క్ ఒక ఆశా కిరణంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పార్క్ ఏర్పాటుతో 20,000 మందికి పైగా రాయలసీమకు చెందిన నిరుద్యోగ యువకులు ఉపాధి పొందనున్నారు.


kj reddy

అనంతపూర్ జిల్లా లో చంద్ర బాబు నాయుడు గారూ ఎలక్ట్రానిక్స్ పార్కు కి పునాది రాయి వేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలో చిలమతూరు గ్రామం లో "ఎలిసిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు" కి ప్రారంభోత్సవం చేసారు.అయన ఈ సందర్బంగా మాట్లాడుతూ సీమ అభివృద్ధి కి తాను కట్టుబడి ఉంటాను అని తెలియ జేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అనంతపూర్ జిల్లాలోని చిలమతూర్ ఎల్సిన - రాగ మయూరి టెక్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు . 50 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారికి అనుకోని వుంది. రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్ దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కేంద్రాల్లో అతిపెద్దది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అఫ్ ఇండియన్ (ELCINA ) సహకారంతో కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కే జె రెడ్డి గారి నేతృత్వం లోని కేజేఆర్ గ్రూప్ ఈ పార్కును నిర్మించబోతోంది . పార్కులో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల యూనిట్లను నెలకొల్పేందుకు కేజేఆర్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో రక్షణ వాయు రంగానికి సంబందించిన ఎలక్ట్రానిక్ విడిభాగాలను తయారు చేయనున్నారు . ఈ విడిభాగాలను మన దేశముతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు


kj reddy

రాయలసీమలో ప్రారంభం కాబోతున్న మూడు సోలార్ ప్రాజెక్ట్స్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లో 2500 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్స్ కి పునాది వేసింది.దీన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసారు...

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ 3 మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు నిర్ణయించింది . ఈ 3 ప్రాజెక్టుల పూర్తి స్థాయి సామర్థ్యం 2500MW . ఇందుకు సంబందించిన ఏం ఓ యూ (MOU) లను కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి భూ కేటాయింపులకు సంబందించిన అంశాన్ని రాష్ట్ర కాబినెట్ ఆమోదించింది . ఈ 3 ప్రాజెక్టులలో ఒకటి 1000 మెగా వాట్ల సామర్థ్యం కల్గిన ప్లాంట్ అనంతపూర్ జిల్లా కదిరి లో రాబోతుంది . ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఎన్ టి పి సి (న్టీపీసీ) కి అప్పగించింది . ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 7000 కోట్లు ఖర్చుచేయనున్నారు . అదేవిధంగా కర్నూల్ జిల్లా పాణ్యం మరో 1000 MW సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రాబోతుంది. మూడవ సోలార్ పవర్ ప్లాంట్ కడప జిల్లాలోని జమ్మలమడుగు లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రానున్న రోజుల్లో మరో 2000 MW సోలార్ పవర్ ప్లాంట్ లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నది.