Futuristic Rayalaseema
About Leader
Job Portal

అనంతపూర్ జిల్లా లో చంద్ర బాబు నాయుడు గారూ ఎలక్ట్రానిక్స్ పార్కు కి పునాది రాయి వేశారు

kj reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలో చిలమతూరు గ్రామం లో "ఎలిసిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు" కి ప్రారంభోత్సవం చేసారు.అయన ఈ సందర్బంగా మాట్లాడుతూ సీమ అభివృద్ధి కి తాను కట్టుబడి ఉంటాను అని తెలియ జేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అనంతపూర్ జిల్లాలోని చిలమతూర్ ఎల్సిన - రాగ మయూరి టెక్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు .

50 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారికి అనుకోని వుంది. రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్ దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కేంద్రాల్లో అతిపెద్దది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అఫ్ ఇండియన్ (ELCINA ) సహకారంతో కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కే జె రెడ్డి గారి నేతృత్వం లోని కేజేఆర్ గ్రూప్ ఈ పార్కును నిర్మించబోతోంది .

పార్కులో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల యూనిట్లను నెలకొల్పేందుకు కేజేఆర్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో రక్షణ వాయు రంగానికి సంబందించిన ఎలక్ట్రానిక్ విడిభాగాలను తయారు చేయనున్నారు . ఈ విడిభాగాలను మన దేశముతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు