Futuristic Rayalaseema
About Leader
Job Portal

ఎక్స్ ప్రెస్ హైవే తో రాజధాని అమరావతి ని రాయలసీమ తో కలపనున్న ఎన్. హెచ్. ఏ. ఐ

kj reddy
భారత జాతీయ హైవే సంస్థ (ఎన్. హెచ్. ఏ. ఐ) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తో రాయలసీమ ప్రాంతాన్ని కలపడానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానిని రాయలసీమ ప్రాంతంతో కలపడానికి ఒక ఎక్స్ ప్రెస్ హైవే (మార్గం) ను నిర్మించాలని నిర్ణయించింది. 
ఈ ప్రాజెక్ట్ ను జాతీయ హైవేల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్నీ ఎన్. హెచ్. ఏ. ఐ సభ్యులు (టెక్నికల్) ధనంజయ్ ఓ తవాడే వెల్లడించారు. జాతీయ హైవేల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ఆరవ దశలో ఈ  ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపడతామని అయన వెల్లడించారు. రాయలసీమ లోని అనంతపూర్ జిల్లా నుంచి అమరావతి వరకు ఈ మార్గం ఉంటుందని ఆయన తెలిపారు. రాయలసీమ లోని  మిగతా జిల్లాలైన కర్నూల్, కడప జిల్లాల నుంచి నాలుగు లేన్ల రోడ్లను నిర్మించి ఎక్స్ ప్రెస్ వే తో కలుపుతామని అయన ఈ సంధర్బంగా వెల్లడించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 600 km ఉండబోతోంది. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం నిర్మాణంతో రాయలసీమ ప్రజలకు రాష్ట్ర రాజధాని అమరావతి మరింత చేరువ కానుందండంలో ఎలాంటి సందేహం లేదు.