Futuristic Rayalaseema
About Leader
Job Portal

కరెన్సీ నోట్ల సమస్యను అధిగమించడానికి 'ఏపీ పర్స్' ఏప్ ను ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

kj reddy
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఇబ్బదున్దులు అన్ని ఇన్ని కావు. ఈ సమస్యలపై తీవ్ర తర్జన భర్జనలు జరిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించడానికి ఏపీ పర్స్ అనే ఒక వినూత్నమైన   ఏప్ ను ప్రవేశపెట్టారు. 
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ  ప్రజలను డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వాళ్లను నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు ఈ ఏప్ ను ప్రవేశపెట్టామని ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. గ్రామాల్లో మరింత మందిని ఈ ఏప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి  ‘‘మార్పు నేస్తం’’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని సీఎం తెలిపారు. . మార్పు నేస్తాలుగా నమోదైనవారు డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు శిక్షణనిచ్చి ‘ఏపీ పర్సు’ మొబైల్‌ యాప్‌లో సభ్యులుగా నమోదు చేయించాలి. ఒక్కో సభ్యుడిని నమోదు చేసినందుకు మార్పు నేస్తం ప్రతినిధికి రూ.15 చొప్పున నగదు ప్రోత్సాహకం ఇస్తాం. నమోదైన ఆ సభ్యుడు తర్వాత దశలో కనీసం వారంలో 2 లావాదేవీలు నిర్వహిస్తే అందుకు ప్రతిఫలంగా మార్పు నేస్తం ప్రతినిధికి వారానికి రూ.5 చొప్పున నెలకు రూ.20 చెల్లిస్తాం. ‘ఏపీ పర్సు’ మొబైల్‌ యాప్‌లో ఇలా ఎంత ఎక్కువ మందిని నమోదు చేయించి, ఎన్ని ఎక్కువ నగదు రహిత లావాదేవీలు నిర్వహించగలిగేలా చేస్తే మార్పు నేస్తం ప్రతినిధికి అంత సొమ్ము ప్రోత్సాహకంగా లభిస్తుంది. ప్రభుత్వం కాకుండా బ్యాంకింగ్‌ సంస్థలు ఇచ్చే ప్రోత్సాహకం దీనికి అదనం. గ్రామాలను నగదు రహితంగా తీర్చిదిద్దడంలో మార్పు నేస్తం ప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలి. గ్రామాల్లో ఒక్కొక్కరూ వందమందిని ఏపీ పర్సులో నమోదు చేయిస్తే నెలకు కనీసం రూ.3500 వరకూ సంపాదించవచ్చని   శ్రీ చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా అన్నారు. ప్రస్తుతం ఏపీ పర్సు మొబైల్‌ యాప్‌లో 13 మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థలు, 10 ఈ వ్యాలెట్‌ సంస్థలు తమ యాప్‌లను పొందుపరిచాయి. మరో ఆరు సంస్థలు అందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులూ ఈ యాప్‌ ద్వారా చేసుకునే వెసులుబాటును కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు.  నగదు రహిత లావాదేవీలుగా రూపాంతరం చెందే గ్రామాలను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  2000 లోపు జనాభా కలిగిన గ్రామాలకు రూ.10వేలు, 5వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.25వేలు, 5-10వేల లోపు జనాభా కలిగిన వాటికి రూ.50వేలు, 10వేలు అంతకు మించి జనాభా కలిగిన గ్రామాలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.  మార్పు నేస్తం ప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో, ఉపాధి కల్పన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశం చదువుకుంటున్న . విద్యార్థులకు  కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు  చదువుకుంటూనే సాయంత్రం వేళల్లో మార్పు నేస్తాలుగా పనిచేయాలి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి  రాష్ట్రంలోని  29వేల మంది చౌక ధరల దుకాణదారులను బ్యాంకు మిత్రలుగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 

ఏపీ పర్స్ అంటే ఏంటి? 
ప్రస్తుతం  వాడుకలో ఉన్న ఈ-వాలెట్‌ చెల్లింపుల యాప్స్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్లు వాడే అందరికి నగదు రహిత చెల్లింపులు జరిపే అవకాశాన్ని కల్పిస్తుంది. సామాన్యులకు కూడా సులువుగా అర్ధమయ్యేలా తెలుగులోనూ... ఎలా వాడాలి అన్న అంశాలు అన్ని ఈ ఏప్ లో  పొందుపరచటం జరిగింది.  ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీనిని రూపొందించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం వాడేవారు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.