Futuristic Rayalaseema
About Leader
Job Portal

నవంబర్ 18,మన ప్రాంతానికి రాయలసీమగా పేరు తెచ్చిన ముఖ్యమైన రోజు:

kj reddy
తనకు ఒక పేరు ను ప్రకటించుకున్న ప్రాంతం రాయలసీమ,బహుశా చరిత్ర లో ఇలాంటిది చాలా అరుదు అయిన విషయం.
రాయలసీమ కు ఒకప్పుడు సీడెడ్ అనే మాట ఆత్మ గౌరవ సమస్యగానే గాక యుద్దాలు పంపకాలతో విషాద చరిత్రకు గుర్తుగా అప్పటి వాళ్ళు భావించారు.అందు వాళ్ళ దీన్ని తిరగ రాయాలి అని అనుకున్నారు.ఈ ప్రాంత చరిత్ర ను అసలైన పునాది ఫై పునర్నిర్మించాలి అని అనుకున్నారు.ఆ రోజుల్లో రాయల పాలన వారికీ ఒక స్వంత అస్తిత్వంగా  భావించారు.అందుకే  "సీడెడ్" అనే పేరు పక్కకు పెట్టి "రాయలసీమ" గా పిలవాలని ప్రతిపాదన   చేశారు. 1928 నవంబర్ 18న నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహా సభ లో "రాయలసీమ" గా నామకరణం చేసారు. రాయలసీమ వైతాళికుడు అని పిలవదగిన పప్పూరి రామాచార్యులు తన సాధన పత్రిక ద్వారా ఈ పేరు ను జనరంజకం చేసారు.
రాయలసీమ ఒకప్పుడు అనేక రాజరికల పదఘటనల కింద నలిగిపోయింది,ఢిల్లీ,మైసూర్,హైదరాబాద్ రాజ్యాల మధ్య ఇంగ్లాండ్,ఫ్రెంచ్ వలస వాదుల మధ్య రక్తమోడింది.వాళ్ళ తగాదాలకు యుద్ధ భూమిగా కన్నీరు కార్చింది.ఇక్కడి ప్రజల ప్రమేయం లేకుండానే ఎన్నో చేతులు మారింది. నిజం మరియు మారారాల మధ్య జరిగిన తగాదా లో బ్రిటిష్ వారు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నిజం నవాబు తన ఏలుబడిలోని జిల్లాలను బ్రిటిష్ వాళ్ళల్లో దత్తత ఇవ్వడం జరిగింది.అప్పటి నుండి బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని దత్తత జిల్లాలు గా పిలిచే వారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభ దశలో ఉండగానే రాయలసీమ మేధావులు,రచయితలు ఈ దత్తమండలము అనే పేరు లోని పరాధీన భావాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. 
నంద్యాల లో రాయలసీమ గా నామకరణం:
1928 నవంబర్ 18 న  జరిగిన ఆంధ్ర మహా సభ లో చిలుకూరు నారాయణ రావు గారు చాలా మంది మదిలో ఉన్న ఆలోచన ను బయట పెట్టి, దత్త మండలాలను రాయలసీమ గా వ్యవహరించాలని ప్రతిపాదించారు.
అక్కడ ఉన్న రచయితలు,మేధావులు పప్పూరి రామాచార్యులు,గాడిచర్ల మరియు తదితరులు అంగీకరించారు.అలా రాయలసీమ అనే పేరు స్థిరపడిపోయింది.ఇలా మొదటి నుండి రాయలసీమ ప్రాంత ప్రజలు స్వంత అస్తిత్వ కోసమే ఈనాటికి ఆరాట పడుతున్నారు.