Futuristic Rayalaseema
About Leader
Job Portal

నిరుద్యోగులకు తీపి కబురు అందించిన ఏపీపీఎస్సీ:

kj reddy
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  వేలాది  మంది  నిరుద్యోగులకు తీపికబురు. రాష్ట్రంలో ఖాళీగా  ఉన్న  గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 982 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కమీషన్ ఛైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.
సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పూర్తిగా  ఆన్‌లైన్‌లో విధానంలో స్వీకరిస్తామన్నారు. ఈ పరీక్షకు 25 వేల మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రిలిమినరీ  (ప్రాథమిక)  పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్‌ పరీక్ష మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నామన్నారు.

గ్రూప్- 2 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు అభ్యర్థుల సౌకర్యార్థం ఇక్కడ ఇస్తున్నాం. 
* 
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11.11.2016
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 10.12.2016
* ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 26, 2017
* మెయిన్స్‌ పరీక్ష: మే 20, 21వ తేదీల్లో (2017)

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: 
* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 442
* నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 540
* మొత్తం పోస్టుల సంఖ్య: 982

* వయెపరిమితి: సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 (20-42 సంవత్సరాల మధ్య), ఎక్సైజ్‌ ఎస్సై (18-28 సంవత్సరాల మధ్య) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* పూర్తి వివరాలకు: www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

*  గ్రూప్-2 పోస్టులకు  దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.