Futuristic Rayalaseema
About Leader
Job Portal

మరపురాని గత స్మృతులు- ఉజ్వల రాయలసీమ కు ప్రతీకలు

kj reddy
అక్టోబర్ 1,1953. ఈ రోజు రాయలసీమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే, 61 ఏళ్ళ క్రితం ఇదే రోజు కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. అయితే సరిగ్గా మూడేళ్ళ అనంతరం నవంబర్ 1,1956 రోజున ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిజాం సంస్థానమైన హైదరాబాద్ నగరానికి తరలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడింది.
కర్నూల్ రాజధానిగా సాగిన మూడేళ్ళ పరిపాలన ఉజ్వల రాయలసీమ కు ప్రతీకగా, రాయలసీమ చరిత్రలో మర్చిపోని ఘట్టంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే, రాష్ట్ర పరిపాలనకు అవరసరమైన అన్ని ముఖ్యమైన విభాగాలు కర్నూల్ కేంద్రంగా పరిపాలన సాగించాయి.

రాష్ట్ర సచివాలయం, గవర్నర్ నివాసమైన రాజ్ భవన్, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం వంటివన్నీ కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలోని నేటి కోర్టు సముదాయం ఆంధ్ర రాష్ట్రంలోని శాసనసభ. నేటి మెడికల్ కాలేజీ అప్పటి సచివాలయం, నేటి కేవీఆర్ కాలేజీ అప్పటి రాజ్ భవన్. అలాగే నేటి ఎస్టీబీసీ కాలేజీలో అప్పటి ముఖ్యమంత్రి నివాసం ఉండేది. నేటి టౌన్ మోడల్ కాలేజి ప్రాంగణంలోనే అప్పటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవి.

ఈ ముఖ్యమైన పరిపాలన కేంద్రాలు, కర్నూల్ లో ఉండడం మూలంగా, రాయలసీమ ప్రాంతమంతా గొప్ప ప్రభావాన్ని సంపాందించుకొంటుందనే భావన అందరిలో నెలకొంది అప్పట్లో. అయితే, ఆ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. అప్పటి పాలకులు కుట్రల ఫలితంగా, రాష్ట్ర రాజధాని కర్నూల్ నుంచి హైదరాబాద్ కు తరలిచండం జరిగింది. తమ గుండె లోతుల్లో రాయలసీమ ప్రజలు కట్టుకున్న స్వప్నాల మేడలు, రాజధాని తరలింపుతో ఒక్కసారిగా కళ్లెదుటే కూలడం జరిగింది.

రాజధాని తరలింపులో అప్పటి కోస్తా నాయకుల ప్రత్యేక్ష ప్రమేయం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా రాజధాని తరలింపుతో ప్రారంభమైన రాయలసీమ జిల్లాల అధోగతి 61 ఏళ్ళు ఐన తర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత చాలా మంది రాయలసీమ నాయకులూ కర్నూల్ ను రాజధానిగా చేయాలనీ డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్ లు డిమాండ్లుగానే మిగిలాయి తప్ప నిజ రూపం దాల్చలేదు.