Futuristic Rayalaseema
About Leader
Job Portal

రాయలసీమలో ప్రారంభం కాబోతున్న మూడు సోలార్ ప్రాజెక్ట్స్..

kj reddy
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లో 2500 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్స్ కి పునాది వేసింది.దీన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసారు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ 3 మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు నిర్ణయించింది . ఈ 3 ప్రాజెక్టుల పూర్తి స్థాయి సామర్థ్యం 2500MW . ఇందుకు సంబందించిన ఏం ఓ యూ (MOU) లను కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి భూ కేటాయింపులకు సంబందించిన అంశాన్ని రాష్ట్ర కాబినెట్ ఆమోదించింది .

ఈ 3 ప్రాజెక్టులలో ఒకటి 1000 మెగా వాట్ల సామర్థ్యం కల్గిన ప్లాంట్ అనంతపూర్ జిల్లా కదిరి లో రాబోతుంది . ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఎన్ టి పి సి (న్టీపీసీ) కి అప్పగించింది . ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 7000 కోట్లు ఖర్చుచేయనున్నారు . అదేవిధంగా కర్నూల్ జిల్లా పాణ్యం మరో 1000 MW సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రాబోతుంది. మూడవ సోలార్ పవర్ ప్లాంట్ కడప జిల్లాలోని జమ్మలమడుగు లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రానున్న రోజుల్లో మరో 2000 MW సోలార్ పవర్ ప్లాంట్ లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నది.