ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రూ.152 కోట్ల పనుల కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి సోమవారం పరిపాలన అనుమతి లభించింది.
హడ్కో నుంచి తక్కువ వడ్డీకి తీసుకున్న రుణం నుంచి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో ముందస్తుగా చేపట్టే మౌలిక సదుపాయాలు, అలంకార్ ధియేటర్ వద్ద వంతెన నిర్మాణం కోసం రూ.152 కోట్లు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలపై అనుమతులిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవెన్ ఆదేశాలు జారీ చేశారు.
Social Stream