Futuristic Rayalaseema
About Leader
Job Portal

హిందూపురం ,బొబ్బిలి పారిశ్రామిక వాడలకు త్వరలోనే మహర్దశ:

kj reddy
రాష్ట్రంలో ఆధునీకరించిన పారిశ్రామిక మౌలిక వసతుల ఉన్నతీకరణ పథకం(ఎంఐఐయూస్) కింద తూమకుంట, గోళ్ళాపురం పారిశ్రామిక వాడలకు ప్రభుత్వం 50కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం ద్వారా పారిశ్రామిక వాడలలో మౌలిక వసతులైన రోడ్లు, నీటి సరఫరా, డ్రైనైజ్, ఫెన్సింగ్ మరియు ఇతర ప్రాథమిక అవసరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పనుల ఏర్పాట్లు జరుగుతుండడంతో త్వరలోనే ఈ పారిశ్రామిక వాడలకు మహర్దశ రానుంది. ఈ వసతుల కల్పన ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ఆకర్షించాలని ఏపీఐఐసీ ప్రయత్నిస్తోంది.

దాదాపు రూ.500 కోట్లతో భారీ పరిశ్రమల నిర్మాణం జరగనుంది. గార్మెంట్స్,టెక్స్టైల్స్,ఐరన్,డ్రగ్ కెమికల్స్, మరియు వివిధ రంగాలలో  పరిశ్రమలు రాబోతున్నాయి.
ఇప్పటికే 20కి పైగా పరిశ్రమలు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా పెట్టుబడితో  సూర్య రోషిణి, టెక్స్ పోర్టు స్పిన్నింగ్స్, హెరిటేజ్ ఫుడ్స్, రతన్ ప్లాస్టిక్, బలిహ కెమికల్స్ పరిశ్రమల పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇవే కాక మౌలిక వసతుల కల్పన పూర్తి అయినా వెంటనే మరికొన్ని పరిశ్రమలు స్థాపన జరిగే అవకాశం ఉంది.

ఈ పరిశ్రమల ఏర్పాటుతో మూడు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు, మరికొన్ని వేల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా అయిన వలసలకు అడ్డుకట్ట పడుతుందని అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.