Futuristic Rayalaseema
About Leader
Job Portal

104 వ భారత జాతీయ కాంగ్రెస్ వేదికైన తిరుపతి; సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

kj reddy
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమ్మేళనానికి రాయలసీమ  జిల్లా చిత్తూర్  వేదికైంది. 
దేశ ప్రధాని
నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ  రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ఎల్  నరసింహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అరుగురు నోబెల్  బహుమతి గ్రహీతలు, వేలాది మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ప్రశాంతి మాట్లాడుతూ.. రోజురోజుకూ అనూహ్యంగా తలెత్తుతున్న సవాళ్ళను చూసి చింతించకుండా వాటినే సోపానాలుగా మలచి మన యువతకు ఉపాధి కల్పించాలని, సమాజ సమస్యలను తీర్చాలని అయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరిశోధన సంస్థలు.. ఉన్నత విద్యాసంస్థలు- పాఠశాలలు, కళాశాలలతో అనుసంధానం కావాలని అభిలషించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) తరహాలో శాస్త్రీయ సామాజిక బాధ్యతను ఆరంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధిస్తున్న మన శాస్త్రసాంకేతిక రంగానికి అట్టడుగున ఉన్న పల్లెల్లోనూ సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత ఉందని స్పష్టం చేశారు. పరిశోధన ప్రమాణాలను పెంచాలంటూనే 2030నాటికి శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచంలోని మూడు అగ్రదేశాల్లో భారత్‌ ఒకటిగా ఉండబోతోందని భరోసానిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు  ఆయన ప్రసంగం సాగింది.  రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ తయారీ, బిగ్‌డాటా విశ్లేషణ, డీప్‌లర్నింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లాంటి వాటిలో పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలను పెంచుకోవటం ద్వారా ఈ సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవచ్చని అయన తెలిపారు. ఈ సాంకేతిక యంత్రాంగాలను సేవ, తయారీ రంగాలతోపాటు వ్యవసాయం, నీరు, ఇంధనం, ట్రాఫిక్‌ నిర్వహణ, ఆరోగ్యం, పర్యావరణం, మౌలిక సదుపాయాల కల్పన, జియో సమాచార వ్యవస్థలు, భద్రత, ఆర్థిక రంగాలతోపాటు నేరాలను అరికట్టడంలో సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని అయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా మన భవిష్యత్తును భద్రంగా ఉంచుకునేందుకు పరిశోధనాభివృద్ధి మౌలిక సదుపాయాలు, వనరులు, నైపుణ్యాల సృష్టికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య జాతీయ మిషన్‌ను ఆరంభిస్తామని మోడీ ఈ సందర్బంగా ప్రకటించారు.