Futuristic Rayalaseema
About Leader
Job Portal
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే కూడా ఎక్కువ - విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ

ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు సత్వర పారిశ్రామికాభివృద్ధి-సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా    నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖనగరం వేదిక కానుంది. ‘‘సుస్థిర అభివృద్ధికి భాగస్వామ్యాలు- ఆవిర్భవిస్తున్న ప్రపంచ ఆర్ధిక క్రమం’’ ఇతివృత్తంతో  ఈ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో  విశాఖ హార్బర్ పార్కు దగ్గర ఏ.పీ.ఐ.ఐ.సీ మైదానంలో  జరగనుంది. 

 గత ఏడాది భాగస్వామ్య సదస్సులో  ఫలవంతమైన ప్రాజెక్టులు

గత ఏడాది భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చింది. రూ. 4 లక్షల 67 వేల 577 కోట్ల రూపాయల విలువైపు ఎంవోయూలు కుదిరాయి.  328 ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. 9,58,896 మందికి ఉపాధి కలుగుతోంది. 

వివిధ దశల్లో ప్రాజెక్టులు:38 యూనిట్లలో తయారీ ప్రారంభం

వీటిలో ఇప్పటికే 48 శాతం ప్రాజెక్టులు పనులు ప్రారంభించి వివిధ దశల్లో వున్నాయి. 42% పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 38 యూనిట్లు తయారీని ప్రారంభించాయి. వీటి విలువ రూ. 52,987 కోట్లు. మరో 6 యూనిట్లు ట్రైయిల్ ప్రొడక్షన్లో వున్నాయి, వీటి విలువ రూ. 1,519 కోట్లు.

మిషన్ల బిగింపు దశలో 16 కర్మాగారాలు

 మిషనరీ బిగింపు దశలో 16 కర్మాగారాలున్నాయి. వీటి విలువ రూ. 14,700 కోట్లు. సివిల్ వర్క్ దశలో 29 యూనిట్లు వున్నాయి. వీటి విలువ రూ. 82,595 కోట్లు. రూ. 23,754 కోట్లతో మరో 13 కంపెనీలు శంకుస్థాపనకు సిద్ధమయ్యాయి. ఇంకా రూ. 6,611 కోట్ల విలువ చేసే పెట్టుబడులు పెడుతున్న 8 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి.

 

 

 

ఈ స్ఫూర్తితో మరోసారి విశాఖలో ఈనెల 27, 28న భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.   ఇప్పటికే దాదాపు 425 సంస్థలు రాష్ట్రంలో రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు పంపాయి. విశాఖ భాగస్వామ్య సదస్సుకు దాదాపు 4 వేల మంది ప్రతినిధులు భాగస్వామ్య సదస్సుకు హాజరవుతారు. వీరిలో 42 దేశాల నుంచి పాల్గొనే 300 మంది విదేశీ ప్రతినిధులు వున్నారు. 12 దేశాల వాణిజ్య మంత్రులు రానున్నారు.  కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ధర్మేంద్రప్రధాన్, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి ఈ సదస్సులో పాల్గొంటారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్ అండ్ అపారల్, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. 

టీవీఎస్, విప్రో, క్రేన్ , టాటా, సియట్, దాసన్, డిక్సన్, డ్రోన్ డిఫెన్స్, అపోలో, హిమామి, శ్రీ సిమెంట్స్, టోరెంట్ పవర్, ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటాయి.

  ‘సూర్యుడు ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్’ స్ఫూర్తిమంత్రంతో రాష్ట్ర ప్రభుత్వం  భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) తో గత ఏడాది ఇక్కడే నిర్వహించిన సదస్సు విజయవంతమైన అంశం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చొరవతో ఈ ఏడాదీ సదస్సును విశాఖలో నిర్వహించటానికి అంగీకరించింది. ఫలితమే మళ్లీ విశాఖలో శుక్రవారం నాడు నిర్వహించే సదస్సు.   ప్రపంచంలో అభివృద్ధి ప్రాధాన్యాలు, విధాన రూపకల్పన ప్రధాన లక్ష్యం.  తదుపరి స్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి చర్చావేదికగా ఈ సదస్సు ఉపయోగపడాలని ముఖ్యోద్దేశం. భారత్‌ లో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం, ఆసక్తి ఉన్న దేశాలను ఆకర్షించి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చటం ధ్యేయం.

రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పర్చేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలెన్నో తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించింది.  అద్భుత కృషితో గత ఏడాది రాష్ట్ట్రప్రభుత్వం  నెంబర్ వన్  ర్యాంకును  సాధించింది.

 ప్రత్యేక దృష్టి పెట్టిన విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ఐటి, పరిశ్రమలు-మౌలిక సదుపాయాల రంగాల్లో  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు  ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పిస్తోంది.  రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, సహజవనరుల్లో మన కలిమిని, బలిమిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా, యూ.కే, జపాన్, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు.

 కొద్దిరోజుల క్రితమే దావోస్ ‘ప్రపంచ ఆర్ధిక వేదిక’ (World Economic Forum) సదస్సు ఆహ్వానం మేర ఐదు రోజులు దావోస్ లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆకాంక్ష వ్యక్తపరిచిన కంపెనీలతో దావోస్‌లో ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. చైనా, పాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా, మలేషియా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించి వెళ్లాయి.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాతో సాంకేతిక సహకారానికి  ‘సిస్టర్ స్టేట్ ’  ఒప్పందం కుదిరింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), పారిశ్రామిక విధానం, ఉన్నతీకరణ విభాగం, భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ విశాఖలో ఈనెల 27,28 తేదీలలో సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం  సిఐఐ సహకారంతో నిర్వహించే రెండో  సదస్సే కాదు. సిఐఐ దేశవ్యాప్త సదస్సుల్లో  23వ భాగస్వామ్య సదస్సు.  

సిఐఐ గత ఇరవై రెండేళ్లుగా అంతర్జాతీయ అంశాలపై సహకారానికి, సమస్యల పరిష్కార సాధన కోసం చర్చలకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో  22 సదస్సులు నిర్వహించింది. ప్రస్తుత అవకాశాలు-భవిష్యత్తులో సవాళ్లపై  చర్చించే వేదికలుగా  ఈ సదస్సులు నిలుస్తున్నాయి. ఏటా కనీసం వేయి నుంచి 1,500 మంది ప్రతినిధులు సీఐఐ సదస్సులో పాల్గొంటున్నారు. ఇందులో 40% మంది ప్రతినిధులు విదేశీ ప్రతినిధులు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే దేశాధినేతలు, మంత్రులు, విధాన రూపకల్పన నిర్ణేతలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, విద్యావేత్తలు పాల్గొంటారు. 

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకున్నా కసితో చేసిన కృషి ఫలించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో (‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’) నెంబర్ వన్ గా అవతరించింది.రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవటానికి ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ ఇతివృత్తంతో సాగిస్తున్న ప్రస్థానం ఫలితాలనిస్తోంది. మౌలిక సదుపాయాలు, సహజవనరుల్లో  ఆంధ్రప్రదేశ్ కలిమిని,బలిమిని వివరించడానికి జాస్తి కృష్ణకిశోర్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇ.డి.బి) బృందం గత ఏడాది నవంబర్‌లో చైనాలో పర్యటించి వచ్చింది


ఆంధ్రప్రదేశ్ సూర్యుడు ఉదయించే రాష్ట్రం - అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రం: విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన సీఎం

ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాల నిది, ఎన్నో సహజ వనరులకు నిలయం
   

 భవిష్యత్తులో మానవ వనరుల్లో భారత్ కు ఎవరు పోటీ కాలేరు.. 


నెరవేరిన పులివెందుల,కడప జిల్లా వాసుల దశాబ్దాల కల - గండికోట నుంచి పైడిపాలెంకి ఉరకలు పెడుతున్న కృష్ణా జలాలు

లాంఛనంగా సి.ఎం చేతులమీదుగా గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభం

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కడప జిల్లా ప్రజల గుండె సడి అయిన పైడిపాళెం రిజర్వాయరుకు, ఈ రోజు 11-01-2017న గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా లాంఛనంగా నీటి విడుదల జరిగింది. ఎన్నో ఏళ్లుగా రైతులు ఈ నీటి కోసం ఎదురుచూస్తున్నారు, ఈ రోజున కృష్ణ జలాల నీటి విడుదల ద్వారా వారి కల సాకారమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు పైగా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందనుంది. 150కోట్ల పలు అభివృద్ధి పనులకు ఈ రోజు సి.ఎం నారా చంద్ర బాబు నాయుడు శంకు స్థాపన చేయనున్నారు.అంతేకాకుండా ఇప్పటి వరకు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇతర ప్రాజెక్టులకు కూడా తదుపరి దశలకు నిధులు విడుదల చేస్తారని జిల్లా అధికారులు తెలిపారు.


కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు:

నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా

కర్నూలు, కడప జిల్లాల్లోని కనీసం 2.46 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు లబ్ధిచేకూరనుంది


ప్రధాని నరేంద్ర మోడీ 2017 నూతన సంవత్సర సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం:

ప్రధాని నరేంద్ర మోడీ రైతులు, పట్టణ పేదలకు,చిన్న వ్యాపారులకు మరియు సీనియర్ సిటిజన్లకు ,గ్రామీణ పేదలకు కొత్త ప్రోత్సాహకాలు కోసం గృహ రుణ రాయితీలు పాటు మరికొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు.

దేశ ప్రజలంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రసంగాని టెలివిజన్ ద్వారా మాట్లాడారు.నోట్ల రద్దు ద్వారా కష్టాలు ఉన్నప్పటికీ ప్రజలు తమ మద్దతు ద్వారా నల్లధనం మరియు నకిలీ నోట్లు పోరాటంలో ప్రభుత్వంతో వెన్నంటి నిలబడిన భారతదేశం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ప్రసంగంలో ప్రోత్సాహకాలు ప్రకటించిన ముఖ్య విభాగాలు: గృహ సంబంధిత అంశాలు: - పట్టణ పేదలకు కోసం: 9 లక్షల రుణం వడ్డీపై 4% సబ్సిడీ; 12 లక్షల రుణ వడ్డీపై 3% సబ్సిడీ - గ్రామీణ పేదలకు : ప్రధాని ఆవాస్ హౌసింగ్ కోటా కింద సబ్సిడీ 33% పెరిగింది ; 2 లక్షల రూపాయి రుణ వడ్డీపై 3% సబ్సిడీ ఇచ్చారు. రైతులకు సంబంధిత అంశాలు: - రబీలో సాగు చేసే ప్రాంతాలలో రుణాలపై సబ్సిడీ 6% పెరుగుదల; ఎరువుల రుణాలపై సబ్సిడీ 9% పెంచారు. - ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి కొంత డబ్బు బదిలీ చేస్తుంది; జిల్లా కోపరేటివ్ బ్యాంకులు రబీ రుణాలకు వడ్డీ తగ్గింపు ఇవ్వాలని కోరారు - 20,000 కోట్లు ఎక్కువగా నాబార్డ్ మరింత సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఆ సంస్థకు తెలియజేసింది,ఈ మొత్తన్ని ప్రభుత్వం నాబార్డ్ వారికీ భర్తీ చేస్తుంది - 3 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు తదుపరి 3 నెలల్లో RUPAY కార్డులుగా మారుస్తారు. MSME సంబంధిత అంశాలు - చిన్న పరిశ్రమలు క్రెడిట్ గ్యారంటీ 1కోటి నుండి 2 కోట్లకి పెరిగింది. బ్యాంకులు చిన్న పరిశ్రమలకు రుణాలు మంజూరు ఉన్నప్పుడు ప్రభుత్వ హామీ అందిస్తుంది. NBFCలను కూడా ఈ పథకంలో చేర్చారు -చిన్న పరిశ్రమలకు క్యాష్ క్రెడిట్ పరిమితి 20% నుండి 30% వరకు పెంచుతున్నారు. - చిన్న పరిశ్రమలకు రోజు ట్రేడింగ్ పని పరిమితి 20% నుండి 30% కు పెంచింది. - 2 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న పరిశ్రమలకు 8% నుంచి 6% 2 కోట్ల వడ్డీ రేటుమినహాయింపుని ప్రభుత్వం ఇస్తుంది. మహిళలకు సంబంధిత అంశాలు: - గ్రామీణ గర్భిణీ స్త్రీలకు ప్రసూతి ప్రయోజనం కింద వారి ఖాతాలలో రిజిస్ట్రేషన్ కోసం, రోగనిరోధకత, పోషకాహారం కోసం 6000 రూపాయలు జమ చేస్తారు. వయో వృద్ధుల: - 7.7 లక్షల నుండి 10 సంవత్సరాలకు గాను వయో వృద్ధులకు చెల్లించాల్సిన వడ్డీ రేటు నెలవారీ కోసం 8% పెంపు..


అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం లో మాట్లాడిన సి.ఎం చంద్రబాబు నాయుడు గారు:

అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం లో మాట్లాడుతూ సి.ఎం చంద్రబాబు నాయుడు గారు, తాను ముందుచూపుతో గోదావరి జలాలలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కృష్ణ డెల్టా నుండి రాయలసీమ ప్రాంతానికి తీసుకువచ్చామని అన్నారు.

ఆయన ఈ సందర్బంగా గోదావరి జలాలను తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోర్టు సమస్యలను పరిష్కరించడానికి టీడీపీ ప్రభుత్వం చాలా కృషి చేసిందని తెలిపారు.అంతే కాకుండా రాయలసీమ ప్రాంతానికి ఉన్న నీటి ఎద్దడిని నివారించడానికి తాను ఒక ప్రణాళికను కూడా రూపొందించానని తెలిపారు. రాయలసీమ ఇప్పుడు రాళ్లసీమ అని కొందరు అంటున్నారని కానీ మల్లి ఒకప్పటి రతనాల సీమగా మారుస్తానని అన్నారు.


రాయలసీమ లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

కర్నూల్, కడప అనంతపూర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల ఘన విజయానికి పార్టీ నాయకులూ, కార్యకర్తలందరూ కృషి చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

కర్నూల్ జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఆయన, కర్నూల్, కడప, అనంతపూర్ పట్టభద్రుల స్థానం నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవకుడు, కేజే రెడ్డి గారిని, ఉపాధ్యాయుల స్థానం నుంచి బచ్చల పుల్లయ్య గారిని పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగిందని, ఈ ఇద్దరు పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలందరు బాగా కృషి చేయాలనీ, కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. ప్రత్యేక్ష ఎన్నికలు అయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ నాయకులూ, కార్యకర్తలు బాగా పనిచేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని అదే పరోక్ష ఎన్నికలు అయిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఏమాత్రం కష్టపడకుండా, పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల ఓటమికి కారణమవడమే గాక.. ఎలాంటి ఓటు బ్యాంకు లేని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల గెలుపుకు కారణమౌతున్నారనే అపవాదు ఉందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. , ఈ అపవాదును వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా తొలగించుకోవాలని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులూ, కార్యకర్తల్ని గట్టిగా కోరారు.


రాయలసీమ అభివృద్ధ్ది గురించి తన అభిప్రాయాన్ని తెలిపిన కేజెర్:

రాయలసీమలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు ప్రజాబంధు అయిన కెజెర్ గారు సీమ అభివృద్ధ్ది కి పాటు పడుతానని పత్రిక ముకంగ తెలియజేశారు.ఈ సందర్భానగా అయన సీమ కి రావలసిన పరిశ్రమల గురించి జిల్లా నాయకులతో సమావేశం అయి మాట్లాడుతానని చెప్పారు.

అంతే కాకుండా ఇదివరకే జిల్లాకి చాల పరిశ్రమలు రావాల్సి ఉందని అన్నారు. కొన్ని జాతీయ విద్య సంస్థలు కూడా రావాల్సి ఉందని తెలిపారు.ఐఐటి,ఐఐఎం,న్ఐటి లాంటి విద్య సంస్థలు కడప,కర్నూల్,అనంతపూర్ జిల్లాల లో రావడానికి తన వంతు కృషి తాను చేస్తానని చెప్పారు.దీనికి సంబంధించిన ఏ జిల్లాలో ఏ సంస్థ వస్తే బాగుంటుంది అని చర్చ కూడా జరుగుతుందని అన్నారు.రాయలసీమ లో ఉన్న సహజ వనరులని ఉపయోగించుకుని మూడు జిల్లాలలో సమానమైన అభివృద్ధి జరిగేలా ఒక ప్రణాళిక బద్దంగ ముందుకు పోతానని ఈ సందర్బముగా అయన తెలిపారు. పట్టభద్రుల ఏమ్మెల్సీ అభ్యర్థిగా తనని ప్రతిపాదించినందుకు చంద్రబాబు గారికి మరియు జిల్లా పార్టీ సభ్యులందరికి అయన ధన్యవాదాలు తెలిపారు.


అనంతపురం జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా మారుస్తాం:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు...

కరవు జిల్లా గా పేరుగాంచిన అనంతపూర్ జిల్లా దశ దిశా మార్చే రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని చిలమత్తూరు గ్రామంలో పార్కు కు సంబందించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

అత్యంత ఆర్భాటంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,రాగ మయూరి పార్క్ అధినేత కేజె రెడ్డి గారు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అనంతపూర్ జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అనంతపూర్ జిల్లాను తెలుగు దేశం పార్టీ కంచుకోటగా అభివర్ణించిన ఆయన, జిల్లా అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతపూర్ జిల్లాలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను దూరం చేయడానికి రాగ మయూరి టెక్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్త కేజె రెడ్డి గారిని అభినందించిన అయన, పార్కు అభివృద్ధికి ఆవరసరమైన అన్ని చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, పార్క్ ను ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా, రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్కుని మోడల్ పార్క్ గా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన ప్రకటించారు. అనంతపూర్ అభివృద్ధి జిల్లాకు రానున్న రోజుల్లో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇస్తామని ఆయన ఈ సంధర్బంగా ప్రకటించారు. జిల్లాలోని చెరువులన్నింటిని నీటితో నింపుతామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అనంతపూర్ జిల్లాకు దగ్గరగా ఉన్నందున, జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నీ బాగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో అనంతపూర్ జిల్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ కస్టమ్స్ అకాడమీ వంటివి రాబోతున్నాయని, ఈ జాతీయ సంస్థల ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందనుందని ఆయన అన్నారు.


ఎలక్ట్రానిక్స్ పార్క్ శంకుస్థాపన,అనంతపూర్ జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: మంత్రి పల్లె రఘునాథ రెడ్డి..

20,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సామర్థ్యం కలిగిన రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ శంకుస్థాపన చేసిన రోజు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని రాష్ట్ర పరిశ్రమలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి గారు అన్నారు.

రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాగ మయూరి టెక్ పార్క్ లో పది కంపెనీలు 2000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. అదేవిదంగా, లేపాక్షి బయోటెక్నాలజీ పార్క్ కూడా జిల్లాకు రావడం జిల్లా ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. లేపాక్షి బయోటెక్నాలజీ పార్క్ దేశంలోనే సాటిలేని పార్క్ అని రఘునాథ రెడ్డి గారు అన్నారు. రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ప్రశంసల వర్షాన్ని ఈ సందర్బంగా మంత్రి కురిపించారు. సీఎం గారి దూరదృష్టి వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీ లైన బెల్, ఎయిర్ బస్ లు కూడా తమ సంస్థల్ని అనంతపూర్ జిల్లాలో స్థాపించబోతున్నాయని అన్నారు.