Futuristic Rayalaseema
About Leader
Job Portal

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే కూడా ఎక్కువ - విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ

ఈ ఏడాది రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు సత్వర పారిశ్రామికాభివృద్ధి-సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలుగా    నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పారిశ్రామిక సమాఖ్య, కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సహకారంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రెండో భాగస్వామ్య సదస్సుకు విశాఖనగరం వేదిక కానుంది. ‘‘సుస్థిర అభివృద్ధికి భాగస్వామ్యాలు- ఆవిర్భవిస్తున్న ప్రపంచ ఆర్ధిక క్రమం’’ ఇతివృత్తంతో  ఈ సదస్సు ఈనెల 27,28 తేదీల్లో  విశాఖ హార్బర్ పార్కు దగ్గర ఏ.పీ.ఐ.ఐ.సీ మైదానంలో  జరగనుంది. 

 గత ఏడాది భాగస్వామ్య సదస్సులో  ఫలవంతమైన ప్రాజెక్టులు

గత ఏడాది భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చింది. రూ. 4 లక్షల 67 వేల 577 కోట్ల రూపాయల విలువైపు ఎంవోయూలు కుదిరాయి.  328 ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. 9,58,896 మందికి ఉపాధి కలుగుతోంది. 

వివిధ దశల్లో ప్రాజెక్టులు:38 యూనిట్లలో తయారీ ప్రారంభం

వీటిలో ఇప్పటికే 48 శాతం ప్రాజెక్టులు పనులు ప్రారంభించి వివిధ దశల్లో వున్నాయి. 42% పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 38 యూనిట్లు తయారీని ప్రారంభించాయి. వీటి విలువ రూ. 52,987 కోట్లు. మరో 6 యూనిట్లు ట్రైయిల్ ప్రొడక్షన్లో వున్నాయి, వీటి విలువ రూ. 1,519 కోట్లు.

మిషన్ల బిగింపు దశలో 16 కర్మాగారాలు

 మిషనరీ బిగింపు దశలో 16 కర్మాగారాలున్నాయి. వీటి విలువ రూ. 14,700 కోట్లు. సివిల్ వర్క్ దశలో 29 యూనిట్లు వున్నాయి. వీటి విలువ రూ. 82,595 కోట్లు. రూ. 23,754 కోట్లతో మరో 13 కంపెనీలు శంకుస్థాపనకు సిద్ధమయ్యాయి. ఇంకా రూ. 6,611 కోట్ల విలువ చేసే పెట్టుబడులు పెడుతున్న 8 యూనిట్లకు భూకేటాయింపులు పూర్తయ్యాయి.

 

 

 

ఈ స్ఫూర్తితో మరోసారి విశాఖలో ఈనెల 27, 28న భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.   ఇప్పటికే దాదాపు 425 సంస్థలు రాష్ట్రంలో రూ. 6 లక్షల 83 వేల 107 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు పంపాయి. విశాఖ భాగస్వామ్య సదస్సుకు దాదాపు 4 వేల మంది ప్రతినిధులు భాగస్వామ్య సదస్సుకు హాజరవుతారు. వీరిలో 42 దేశాల నుంచి పాల్గొనే 300 మంది విదేశీ ప్రతినిధులు వున్నారు. 12 దేశాల వాణిజ్య మంత్రులు రానున్నారు.  కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ధర్మేంద్రప్రధాన్, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి ఈ సదస్సులో పాల్గొంటారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్ అండ్ అపారల్, పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. 

టీవీఎస్, విప్రో, క్రేన్ , టాటా, సియట్, దాసన్, డిక్సన్, డ్రోన్ డిఫెన్స్, అపోలో, హిమామి, శ్రీ సిమెంట్స్, టోరెంట్ పవర్, ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటాయి.

  ‘సూర్యుడు ఉదయిస్తున్న ఆంధ్రప్రదేశ్’ స్ఫూర్తిమంత్రంతో రాష్ట్ర ప్రభుత్వం  భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) తో గత ఏడాది ఇక్కడే నిర్వహించిన సదస్సు విజయవంతమైన అంశం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చొరవతో ఈ ఏడాదీ సదస్సును విశాఖలో నిర్వహించటానికి అంగీకరించింది. ఫలితమే మళ్లీ విశాఖలో శుక్రవారం నాడు నిర్వహించే సదస్సు.   ప్రపంచంలో అభివృద్ధి ప్రాధాన్యాలు, విధాన రూపకల్పన ప్రధాన లక్ష్యం.  తదుపరి స్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి చర్చావేదికగా ఈ సదస్సు ఉపయోగపడాలని ముఖ్యోద్దేశం. భారత్‌ లో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యం, ఆసక్తి ఉన్న దేశాలను ఆకర్షించి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చటం ధ్యేయం.

రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పర్చేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలెన్నో తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం సాధించింది.  అద్భుత కృషితో గత ఏడాది రాష్ట్ట్రప్రభుత్వం  నెంబర్ వన్  ర్యాంకును  సాధించింది.

 ప్రత్యేక దృష్టి పెట్టిన విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ఐటి, పరిశ్రమలు-మౌలిక సదుపాయాల రంగాల్లో  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు  ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పిస్తోంది.  రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, సహజవనరుల్లో మన కలిమిని, బలిమిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా, యూ.కే, జపాన్, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు.

 కొద్దిరోజుల క్రితమే దావోస్ ‘ప్రపంచ ఆర్ధిక వేదిక’ (World Economic Forum) సదస్సు ఆహ్వానం మేర ఐదు రోజులు దావోస్ లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆకాంక్ష వ్యక్తపరిచిన కంపెనీలతో దావోస్‌లో ప్రాథమిక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. చైనా, పాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, రష్యా, మలేషియా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించి వెళ్లాయి.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాతో సాంకేతిక సహకారానికి  ‘సిస్టర్ స్టేట్ ’  ఒప్పందం కుదిరింది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), పారిశ్రామిక విధానం, ఉన్నతీకరణ విభాగం, భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ విశాఖలో ఈనెల 27,28 తేదీలలో సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం  సిఐఐ సహకారంతో నిర్వహించే రెండో  సదస్సే కాదు. సిఐఐ దేశవ్యాప్త సదస్సుల్లో  23వ భాగస్వామ్య సదస్సు.  

సిఐఐ గత ఇరవై రెండేళ్లుగా అంతర్జాతీయ అంశాలపై సహకారానికి, సమస్యల పరిష్కార సాధన కోసం చర్చలకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో  22 సదస్సులు నిర్వహించింది. ప్రస్తుత అవకాశాలు-భవిష్యత్తులో సవాళ్లపై  చర్చించే వేదికలుగా  ఈ సదస్సులు నిలుస్తున్నాయి. ఏటా కనీసం వేయి నుంచి 1,500 మంది ప్రతినిధులు సీఐఐ సదస్సులో పాల్గొంటున్నారు. ఇందులో 40% మంది ప్రతినిధులు విదేశీ ప్రతినిధులు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే దేశాధినేతలు, మంత్రులు, విధాన రూపకల్పన నిర్ణేతలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, విద్యావేత్తలు పాల్గొంటారు. 

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకున్నా కసితో చేసిన కృషి ఫలించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో (‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’) నెంబర్ వన్ గా అవతరించింది.రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవటానికి ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ ఇతివృత్తంతో సాగిస్తున్న ప్రస్థానం ఫలితాలనిస్తోంది. మౌలిక సదుపాయాలు, సహజవనరుల్లో  ఆంధ్రప్రదేశ్ కలిమిని,బలిమిని వివరించడానికి జాస్తి కృష్ణకిశోర్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇ.డి.బి) బృందం గత ఏడాది నవంబర్‌లో చైనాలో పర్యటించి వచ్చింది